చిరంతానందస్వామి
స్వరూపం
చిరంతానందస్వామి తెలుగు రచయిత. అతను రాసిన "శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర" కు 1957లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినది. ఇతనికి పూర్వాశ్రమమున (బ్రహ్మచర్యాశ్రమున) మాధవ చైతన్యులనీ, సన్యాసాంతమున చిరంతానంద స్వామి అనే పేర్లు ఉన్నాయి.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను తెలుగు సాహిత్యంలో గద్య రచనలో ప్రసిద్ధి చెందినవాడు. అతను రామకృష్ణుడు, వివేకానంద తత్వాలకు సంబంధించిన 20 పుస్తకాలను రచించాడు. అతని రచనలు సూక్ష్మమైన తాత్విక ఆలోచనల శైలితో విలక్షణత కలిగి ఉంటాయి.[2]
రచనలు
[మార్చు]- శ్రీ వివేకానంద లేఖావళి - 1వ భాగం (అనువాదం) : ఈ మొదటి సంపుటి లేఖావళిలో వివిధ సందర్భాలలో 1888 ఫిబ్రవరి నుంచి 1894 వరకు పలువురికి రాసిన లేఖలలో కొన్నింటిని శ్రీ చిరంతనానంద స్వామి అనువదించగా శ్రీరామకృష్ణ మఠం స్వయంగా ప్రచురించింది.[3]
- శ్రీ వివేకానంద లేఖావళి - 2వ భాగం (అనువాదం)
- శ్రీ రామకృష్ణ బోధామృతం
- శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర[4]
- శ్రీ శారదాదేవి చరిత్ర
- శ్రీ వివేకానంద జీవిత చరిత్ర.[5]
మూలాలు
[మార్చు]- ↑ "శ్రీ వివేకానంద లేఖావళి-రెండవ భాగం - ఆర్ఛీవ్స్ లో కాపీ - కట్టమంచి రామలింగారెడ్డి రాసిన పీఠిక".
- ↑ Lal, Mohan (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. Sahitya Akademi. ISBN 9788126012213.
- ↑ "ఎప్పుడూ భారతీయ ఆధ్యాత్మిక రాయబారి వివేకానందుడే". Archived from the original on 2012-01-22. Retrieved 2018-06-23.
- ↑ "'TRIVENI' HAS SHED LIGHT ON MY PATH. BLESSED BE HER NAME!".[permanent dead link]
- ↑ "SWAMI CHIRANTANANANDA పుస్తకాలు".[permanent dead link]