Jump to content

చిరంజీవులు (సినిమా)

వికీపీడియా నుండి
చిరంజీవులు
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం వేదాంతం రాఘవయ్య
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
బాలసరస్వతి,
మాష్టర్ బాబ్జి,
బేబీ శశికళ
సంగీతం ఘంటసాల
గీతరచన మల్లాది రామకృష్ణశాస్త్రి
ఛాయాగ్రహణం వి.ఎన్.రెడ్డి
నిర్మాణ సంస్థ వినోదా ప్రొడక్షన్స్
భాష తెలుగు

చిరంజీవులు 1956 లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో ఎన్టీఆర్ ఒక అంధుడి పాత్ర పోషించాడు. జమున, గుమ్మడి ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

ఒక పల్లెటూర్లో మోహన్ (యన్.టి.ఆర్), రాధ (జమున) ఇరుగు పొరుగున నివసించే పిల్లలు. చిన్ననాటి నుంచి వారిద్దరి మధ్య చెలిమి మొగ్గ తొడిగింది. రాధ తల్లిదండ్రులు కొంచెం సంపన్నులు. మోహన్ తండ్రి మిఠాయిబండి నడిపేవాడు. కాలక్రమేనా వారిద్దరు పెరిగి పెద్దవారవుతారు. ఇద్దరికీ పెళ్ళి కూడా నిశ్చయమవుతుంది. అయితే అంతకుముందే వారిద్దరూ కలిసి తిరునాళ్ళకు వెళతారు. అక్కడ డాక్టర్ కృష్ణ (గుమ్మడి) రాధను చూస్తాడు. పెళ్ళికోసం బంగారు వస్తువులు కొనడానికి వెళ్ళిన మోహన్ దురదృష్టవశాత్తూ కంటిచూపుకు దూరమవుతాడు. కొంతకాలం డాక్టరు దగ్గర వుండాల్సి వస్తుంది. సకాలంలో మోహన్ ఇంటికి రాకపోవడం వల్ల అతన్ని మోసగాడుగా భావించి రాధకు డాక్టరుతో పెళ్ళి జరిగే ఏర్పాటు చేస్తారు. మోహన్ ఇంటికి తిరిగి వచ్చి రాధకు పెళ్ళి జరిగిపోయిందని తెలిసి బాధపడతాడు. తిరిగి టౌనుకు వెళ్ళిన మోహన్ కు డాక్టర్ కృష్ణ ఆశ్రయమిచ్చి అతనికి కళ్ళు తెప్పించే ప్రయత్నం చేస్తాడు. రాధకు అతన్ని పరిచయం చేయగా ఆమె మోహన్ ను చూసి నిర్ఘాంతపోతుంది. చూపువచ్చిన మోహన్ పల్లెటూరికి తిరిగి వెళతాడు. అతన్ని వెతుక్కుంటూ రాధ కూడా వెళుతుంది. వారిద్దరూ చిన్ననాడు నిర్మించుకొన్న పొదరిల్లు వద్ద ప్రాణాలు విడుస్తారు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
తెల్లవారవచ్చె తెలియక నా సామి మల్లాది రామకృష్ణశాస్త్రి ఘంటసాల పి.లీల
ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక అందాక మల్లాది రామకృష్ణశాస్త్రి ఘంటసాల ఘంటసాల
కనుపాప కరవైన కనులెందుకో, తనవారె పరులైన బ్రతుకెందుకో మల్లాది రామకృష్ణశాస్త్రి ఘంటసాల ఘంటసాల పి.లీల
చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు మల్లాది రామకృష్ణశాస్త్రి ఘంటసాల ఘంటసాల పి.లీల
మనసు నీదే మమత నాదే నాదానవే నే నీవాడనే మల్లాది రామకృష్ణశాస్త్రి ఘంటసాల ఘంటసాల
మిగిలింది నేనా బ్రతుకిందుకేనా మరచేవా ఎడబాసి మాయమయేవా మల్లాది రామకృష్ణశాస్త్రి ఘంటసాల ఘంటసాల
  1. అల్లవాడే రేపల్లెవాడే అల్లిబిల్లి పిల్లంగొవి- పి. లీల, ఘంటసాల బృందం
  2. ఎందాక ఎందాక ఎందాక అందాక అందాక - పి. లీల, ఘంటసాల
  3. ఏనాటికైనా నీ దాననే ఏనాటికైనా నీ దాననే - పి. లీల
  4. కనుపాప కరవైన కనులెందుకోతనవారే పరులైన - ఘంటసాల, పి. లీల
  5. చికిలింత చిగురు సంపంగి గుబురు చినదాని మనసు - ఘంటసాల, పి. లీల
  6. చివురుల నీడల చిరునవ్వు తానై విరసిన చిన్నారి - ఘంటసాల కోరస్
  7. తినేందుకున్నాయిరా కొనేందుకున్నాయిరా - జిక్కి, కె. జమునారాణి
  8. తెల్లవార వచ్చె తెలియక నా సామి మళ్ళి పరుండేవు లేరా - పి. లీల
  9. నాటిన అంటుకు ...ఎంచక్కా ఎంచక్కా ఎంచక్కా - కె.రాణీ, కె. జమునారాణి
  10. మనసు నీదే మమత నాదే నాదానవే నే నీ వాడనే - ఘంటసాల
  11. మనసైన పాట మారని పాట - ఘంటసాల, పి. లీల
  12. మనసైన పాట మారని పాట - ఘంటసాల,( గుమ్మడి మాటలతో)
  13. మారని ప్రేమ మల్లెల మాల - పి. లీల
  14. మారని ప్రేమ మల్లెల మాల - పి. లీల, ఘంటసాల
  15. మిగిలింది నేనా బ్రతుకిందుకేనా మరచేవా ఎసబాసి -ఘంటసాల
  16. రామనామ మను మిఠాయి ఇదిగో రండి సుజనులార- మాధవపెద్ది
  17. సుకుమార హృదయాల వేదనకు శాంతి - ఘంటసాల

వనరులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • ఎస్.వి.రామారావు: నాటి 101 చిత్రాలు. కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.