చిమ్నీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The world's tallest chimney, of GRES-2 in Ekibastuz, Kazakhstan (419.7 metres).
A chimney remaining after the destruction of a 19th-century two-story house (Mount Solon, Virginia).

చిమ్నీ అనునది కర్మాగారాలలో బాయిలర్లు, స్టవ్‌లు, ఫర్నేసులు లేదా ఉష్ణ ప్రదేశాలలో వెలువడిన వేడిగా ఉన్న ఇంథన వాయువులను లేక పొగను బాహ్య వాతావరణం లోనికి ప్రసరణ చేయుటకు చేసిన నిర్మాణము. ఈ చిమ్నీ నిర్మాణాలు వాటి ద్వారా వాయువులను సజావుగా నిట్టనిలువుగా పైకి పంపించేవిగా ఉంటాయి. కర్మాగారాలలో వివిధ దహన ప్రక్తియలు జరుగునపుడు వాటి నుండి వెలువడే వ్యర్థ వాయువులను పైకి పంపించే ప్రక్రియను చిమ్నీ ప్రభావం అంటారు. చిమ్నీలో గల ప్రదేశాన్ని "ఫ్లూ" అంటారు. చిమ్నీ అనే నిర్మాణాలు అనేక భవనాలలో కూడా ఉంటాయి. ఇవి ఆవిరి యంత్రాలు, నౌకలు, స్టీమర్లలో కూడా ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ కీ స్మోక్‌స్టాక్ అనే పదం యంత్రాల చిమ్నీలకు ప్రత్యామ్నాయంగా వాడుతారు. కొన్ని ప్రాంతాలలో "ఫన్నెల్" అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు.[1][2]

ఒక చిమ్నీ యొక్క ఎత్తు స్టాక్ ప్రభావం ద్వారా బాహ్య వాతావరణానికి వాయువులు బదిలీ దాని సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అదనంగా, అధిక ఎత్తు గల చిమ్నీలను ఉపయోగించడం వల్ల కాలుష్య వ్యాప్తి తక్షణ పరిసరాలపై వారి ప్రభావం తగ్గిస్తుంది. కొన్ని సందర్భాలలో హానికరమైన బహిర్గత వాయువులు ఉన్నపుడు చిమ్నీ యొక్క ఎత్తు తగినంత ఉన్నపుడు దానిలోని విషపదార్థ కణాలు భూమికి చేరడానికి ముందే స్వీయ తటస్థత చేకూరుస్తుంది. ఇందులో ఎక్కువ పైగా కాలుష్య వ్యాప్తి వాటి సాంద్రతలు తగ్గించడానికి, నియంత్రణ పరిమితులు అనుగుణంగా సులభతరం చేస్తుంది .

మూలాలు

[మార్చు]
  1. C.F. Saunders (1923), The Southern Sierras of California
  2. "Jules Verne (1872), Around the World in Eighty Days". Archived from the original on 2014-03-02. Retrieved 2014-01-17.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చిమ్నీ&oldid=2885398" నుండి వెలికితీశారు