Jump to content

చిత్రమూలము

వికీపీడియా నుండి

చిత్రమూలము
Plumbago auriculata
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
ప్లంబగో

జాతులు

See text

చిత్రమూలము ప్లంబగో ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. ఇది ప్లంబజినేసి కుటుంబానికి చెందినది. ఈ పేరు లాటిన్ పదం ప్లంబమ్ అంటే సీసం నుండి వచ్చినది. కొన్ని జాతులలో సీసపు నీలం రంగుల పూల మూలంగా ఇది వచ్చినది. రసాయనంగా ఈ మొక్కల వేళ్ళలో 'ప్లంబజీన్' (Plumbagein) అనే పదార్థం ఉంటుంది. వీని నుండి చిత్రకాదివటి, చిత్రఘృతం మొదలైన ఆయుర్వేద ఔషధాలు తయారుచేస్తారు. కొన్ని మొక్కలను ఉద్యానవనాల్లో అలంకరణ కోసం కూడా పెంచుతారు. వేర్లు జీర్ణ శక్తిని పెంచే గుణం, గడ్డలను హరించే గుణం కలిగివుంటాయి.

లక్షణాలు

[మార్చు]
  • ఇది ఎక్కువ కొమ్మలతో గుబురుగా ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క.
  • దాదాపు అండాకారపు పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఉంటాయి.
  • పుష్పాలు జాతిని బట్టి కొమ్మల చివర వివిధ రంగులలో పూస్తాయి.
  • ఫలాలు పొడవుగా, సన్నగా ఉండి పత్రావళితో కప్పబడి ఉంటాయి.

జాతులు

[మార్చు]
Plumbago indica
Plumbago zeylanica
  • తెల్ల చిత్రమూలము - Plumbago zeylanica, Ceylon leadwort
  • ఎర్ర చిత్రమూలము - Plumbago rosea or Plumbago indica, rose-colored leadwort
  • నల్ల చిత్రమూలము - Plumbago capensis