చిట్కాలు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సౌందర్య చిట్కాలు
[మార్చు]చర్మం తాజాగా, మృదువుగా ఉండడానికి , For fresh and smooth skin- కమలాఫలం, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడిచేయండి. ఈ పొడిని ఓ డబ్బాలోకి తీసుకోండి. అప్పుడప్పుడు సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని కడిగేయాలి. దీనివల్ల అక్కడి చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది. - ఆమంచర్ల ఉష, తిరుపతి అన్నిరకాల వాతావరణాన్ని ఎదుర్కొంటూ చర్మసౌందర్యాన్ని రక్షించుకోవాలంటే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ముఖ్యంగా శీతాకాలంలో ఉండే చల్లటి వాతావరణం చర్మంపై హానికారక ప్రభావం చూపిస్తుంది. దీంతో పలు రకాల చర్మ సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మసౌందర్యాన్ని కాపాడుకోవడంతోపాటు మరింత అందాన్ని సొంతం చేసుకోవచ్చు. - ఈ కాలంలో చర్మం ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటుంది. కాబట్టి శరీరంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వాతావరణం చల్లగా ఉందన్న కారణంతో చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కానీ ఇది సరైనది కాదు. చర్మంలో తగినంత తేమ నిలిచి చలికాలంలొ చర్మ సంవరక్షణ ఉండడానికి, చర్మం తాజాగా కనిపించడానికి నీరు ఎంతగానో తోడ్పడుతుంది. అందుకని రోజులో వీలైనంత నీరు తాగుతూ ఉండాలి. - ముఖంపై మొటిమలున్నవారికి చర్మం పొడిబారడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కనుక చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. - స్నానానికి సరైన సబ్బును ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా కొన్ని రకాల సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. వాటిల్లో ఉండే హానికారకమైన రసాయనాలే అందుకు కారణం. గ్లిజరిన్, మాయిశ్చరైజింగ్ సబ్బులు ఈ కాలంలో ఉపయోగకరంగా ఉంటాయి. స్నానానికి చల్లటి నీరు కంటే గోరువెచ్చటి నీటిని ఉపయోగించడం మంచిది.ఎక్కువ వేడి ఉన్న నీళ్లతో స్నానం చేయకూడదు. Beautiful Feet , అందమైన పాదాలు (బ్యూటిఫుల్ ఫీట్) --- పాదాలను పద్మాలతో పోలుస్తారు. అంటే పద్మాలంత బ్యూటిఫుల్ ఫీట్ అన్నమాట. బ్యూటిఫుల్ ఫీట్ ఎందరికి ఉంటాయి? మన చుట్టుప్రక్కల వారిని ఒకసారి గమనిస్తే, ముఖానికి ఇచ్చే ప్రాధాన్యత పాదాలకు ఇచ్చినట్లు కనిపించదు. పాదాల ఆకృతి మన చేతిలో ఉండదు. కానీ వాటిని ఆకర్షణీయంగా, బ్యూటిఫుల్ ఫీట్ గా మార్చుకోవడం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. బ్యూటిఫుల్ ఫీట్ అంటే ఎలా ఉండాలి? మెత్తగా, మృదువుగా ఉండాలి. శుభ్రంగా ఉండాలి. పగుళ్ళు ఉండకూడదు. ఈమాత్రం లక్షణాలు ఉంటె చాలు బ్యూటిఫుల్ ఫీట్ కోవకే చెందుతాయి. మనలో చాలామందికి బ్యూటిఫుల్ ఫీట్ ఎందుకు లేవంటే పై లక్షణాలు లేనందువల్లనే. ముఖానికి మల్లేనే పాదాలనూ సంరక్షించుకోవాలి. బ్యూటిఫుల్ ఫీట్ గా మలచుకావాలి. అందుకు పెద్దగా కష్టపడాల్సింది, ఖర్చు పెట్టాల్సిందీ ఏమీ ఉండదు. బ్యూటిఫుల్ ఫీట్ కోసం పాదాలకు కాస్త వాజిలిన్ అప్లై చేసి మర్దనా చేయాలి. ఇలా చేయడంవల్ల మృదువుగా మారి బ్యూటిఫుల్ ఫీట్ గా కనిపిస్తాయి. కొందరికి కాళ్ళు పగులుతాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఏమైతేనేం అలా పగిలినప్పుడు క్రాక్స్ ను నివారించే ఆయింట్మెంట్ ఏమైనా రాసి తగ్గించుకోవాలి. లేకుంటే బ్యూటిఫుల్ ఫీట్ కాస్తా అగ్లీ ఫీట్ గా కనిపిస్తాయి. పైగా విపరీతమైన నొప్పి కూడా ఉంటుంది. పగుళ్ళు లేకుండా జాగ్రత్త పడితే బాధ నివారణ అవుతుంది, బ్యూటిఫుల్ ఫీట్ అని ఇతర్లు మెచ్చుకుంటారు. బ్యూటిఫుల్ ఫీట్ కోసం మరో చిట్కా నెయిల్ పాలిష్ వేసుకోవడం. అలాగే అందమైన చెప్పులను ఎంచుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన పాదాలు మనకే కాకుండా తోటివారికీ ముచ్చట కలిగిస్తాయి. బ్యూటిఫుల్ ఫీట్ అని ప్రశంసిస్తారు. - స్నానంలో ఒకటి రెండు చుక్కల బాదం నూనెను వేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. - స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకుంటే చర్మానికి రక్షణ లభిస్తుంది. ఇది చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. పొడిచర్మం ఉన్నవారు ఆయిల్‌తో తయారైన మాయిశ్చరైజింగ్ క్రీమును, జిడ్డు చర్మం ఉన్నవారు సాధారణ క్రీమును వాడుకోవచ్చు. - చుండ్రు, జుట్టురాలడం ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణ కోసం సరైన షాంపూతో తలస్నానం చేయడం, సరైన మాయిశ్చరైజింగ్ క్రీమును స్నానం చేసిన తర్వాత రాసుకోవడం చేయాలి. - కొంతమంది తలస్నానం చేసి సరిగ్గా తుడుచుకోరు. అలా చేయడం వల్ల శిరోజాల సౌందర్యం దెబ్బతింటుంది. కనుక తడి లేకుండా శ్రద్ధ తీసుకోవాలి. - ఈ కాలంలో వాడాల్సిన వాటిలో సన్‌స్క్రీన్ లోషన్ కూడా ముఖ్యమైందే. సాధారణంగా చాలామంది సన్‌స్క్రీన్ లోషన్ అంటే ఎండాకాలంలో మాత్రమే వాడుకునేది అన్న అభిప్రాయం ఉంది. కానీ ఏ కాలంలోనైనా హానికారక సూర్యకిరణాల నుంచి చర్మానికి రక్షణ లభించాలంటే సన్‌స్క్రీన్ లోషన్ వాడుకోవాల్సిందే. - ఈ కాలంలో చర్మం సున్నితంగా మారడం వల్ల పలురకాల సమస్యలు వేధిస్తుంటాయి. పెదాలు, పాదాలపై పగుళ్లు ఈ కాలంలో వే ధించే ప్రధాన సమస్యలు. ఈ విషయంలో పెదాలకు రక్షణగా లిప్‌బామ్‌ను రాసుకోవాలి. లేదా పేరుకున్న నేయి, వెన్నపూసను రాసుకున్నా ఫలితం ఉంటుంది. పాదాల పగుళ్లు రాకుండా ఉండాలంటే నీరు, దుమ్ము పాదాల దరిచేరకుండా చూసుకోవాలి. పాదాలకు రక్షణగా నాణ్యమైన సాక్స్‌లు ధరించడం మంచిది. రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కుని, పొడిటవల్‌తో తడుచుకోవాలి. తర్వాత వ్యాజిలైన్ రాసుకుని పడుకుంటే పాదాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉంటాయి. - చేతులు, కాళ్లు కడుక్కున్న తర్వాత అలానే వదిలేయకుండా శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి. - తీసుకునే ఆహారం కూడా చర్మంపై ప్రభావం చూపిస్తుంది. పీచు ఎక్కువగా ఉండే, శరీరంలో ఉష్ణాన్ని నిలిపి ఉంచే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. వంటల్లో ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. - సులభమైన వ్యాయామంతో చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. శీతాకాలంలో వ్యాయామం శారీకంగా, మానసికంగా ఎంతో ప్రభావం చూపుతుంది. కనుక రోజులో కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించండి. - గృహిణులు చేతికి సురక్షితమైన గ్లోవ్స్(కవచాలు) ధరించి పనులు చేసుకోవడం మంచిది. - చల్లదనాన్ని నిరోధించే లేదా ఉష్ణాన్నిచ్చే వస్త్రాలు ఈ కాలంలో ధరించడానికి అనుకూలంగా ఉంటాయి. జ్యూసులతో ముఖానికి తేజస్సు
కొందరి ముఖాలు ఏంటో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. చర్మం తేజోవంతంగా ప్రకాసిస్తుంటుంది. తమ చర్మం కూడా అలా మెరవాలంటే ఏం చేయాలో తెలీక, వాళ్ళ కాంతి రహస్యం బోధపడక నిరాశపడుతుంటారు చాలామంది. నిజానికి అదేమంత కష్టమైనా పని కాదు. మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే, అలాంటి ఆకర్షణీయమైన చర్మాన్ని మనమూ సొంతం చేసుకోవచ్చు. అప్పుడు మన ముఖంలోనూ గొప్ప వర్చస్సు వస్తుంది. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం. టొమాటో జ్యూస్ కడిగిన టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది కూడా. ఏపిల్ జ్యూస్ “ఎవ్రీ డే యాన్ ఏపిల్, కీప్స్ అవే ఫ్రం డాక్టర్” అననేది ఇంగ్లీష్ ప్రోవేర్బ్. కనుక రోజూ కప్పుడు ఏపిల్ జ్యూస్ కనుక తాగాగాల్గితే ఆరోగ్యానికి ఆరోగ్యం. చర్మమూ భాసిస్తుంది. కారెట్ జ్యూస్ కారెట్ జ్యూస్ మహా ఆరోగ్యకరమైనది. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాదు, కళ్ళకు ఏంటో మంచిది. అసిదితీని తగ్గిస్తుంది. కారెట్లో విటమిన్ ఎ, సీ లు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయి. బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్ కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటె పోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎర్ర రక్త కణాల సమాఖ్య పెరుగుతుంది. అదండీ సంగతి. ఇలా జ్యూసులతో అందాన్ని పెంచుకోవచ్చు. అన్ని జ్యూసులూ ఒక్కరోజే తాగమని కాదు. అలా చేస్తే మోషన్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోరోజు ఒక్కో జ్యూస్ చొప్పున తగినంత పరిమాణంలో తాగితే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది.
వంటింటి చిట్కాలు
[మార్చు]- ఆరోగ్యము, సౌందర్యం చిట్కాలు
- టమాట, పాలకూర అన్ని రకాల కూరగాయలు, ఇలా దేనితోనైనా చిక్కని స్టాక్ తయారు చేసుకొని చల్లార్చి, ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రీజ్ చేయాలి. గట్టి పడిన తరువాత క్యూబ్స్ ను విడదీసి పాలిథీన్ కవర్‌లో వేసి గాలి లేకుండా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో ఉంచుకుంటే అవసరమైనప్పుడు వాడు కోవచ్చు.
- ఉల్లి పాయలను గ్రైండ్ చేసే ముందు కొద్దిగా నూనె వేసి వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
- ఎక్కువగా పండిన టమాటలను ఉప్పు కలిపిన చల్లని నీటిలో రాత్రంతా ఉంచితే ఉదయానికల్లా తాజాగా మారుతాయి.
- టమాటాలను ఏడెనిమిది నిమిషాలపాటు వేడి నీటిలో ఉంచి తీస్తే తొక్క సులభంగా వస్తుంది.
- కూరల్లో ఉప్పు ఎక్కువైతే తొక్క తీసిన పచ్చి టమాట అందులో వేస్తే అదనపు ఉప్పును అది పీల్చుకుంటుంది.
- మిరప్పొడి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే డబ్బాలో చిన్న ముక్క ఇంగువ వేయాలి.
- ఉప్పు సీసాలో ఒక చెంచా మొక్కజొన్న పిండి వేస్తే ఉప్పు తడిబారి ముద్ద కాదు.
- చక్కెర డబ్బాలో మూడులేక నాలుగు లవంగాలు వేస్తే చీమలు పట్టవు.
- బిస్కిట్లు నిలువ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే మెత్తబడకుండా కరకరలాడుతాయి.
- పచ్చళ్ళలో బూజు రాకుండా ఉండాలంటే, చిన్న ఇంగువ ముక్కను నిప్పు మీద కాల్చి ఖాళీ జాడీలో పెట్టాలి. అరగంట తరువాత జాడీలో నుండి ఇంగువ ముక్కను తీసివేసి పచ్చడి వేయాలి.
- బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే, డబ్బాలో ఎండు వేపాకులు కాని ఎండు మిరపకాయలు కాని వేయాలి.
- ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు ఒకటిన్నర కప్పుల మినప పప్పు, ఐదు కప్పుల బియ్యానికి, ఒక కప్పు నాన పెట్టిన అటుకులను కలిపితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి.
- బఠాణీలను ఉడికించేటప్పుడు చిటికెడు తినేసొడా వేస్తే త్వరగా ఉడుకుతాయి. రంగు కూడా ఆకర్షణీయంగా మారుతుంది.