Jump to content

చింతా కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
చింతా కృష్ణమూర్తి

చింతా కృష్ణమూర్తి కూచిపూడి నాట్యాచార్యుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన 1912లో కృష్ణాజిల్లాకు చెందిన కూచిపూడి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి చింతా వెంకట్రామయ్య కూడా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు. ఆయన తండ్రిగారు వెంకటరామ నాట్య మండలి ట్రూపును ప్రారంభించి అనేక ప్రదర్శనలిచ్చాడు. బాల్యంలో కృష్ణమూర్తి వివిధ ప్రదర్శనలలో ప్రహ్లాదుడు, లవుడు, కుశుడు వంటి వేషాలు వేసేవాడు. తరువాత ఆయన ప్రముఖ పాత్రలైన హరిశ్చంద్ర, రాముడు, కృష్ణుడు, అర్జునుడు, వివిధ పురాణ పాత్రలను పోషించాడు.

ఆయన కూచిపూడి పరంపరకు చెందిన కుటుంబానికి చెందినవాడు. ఆయన కూచిపూడి నృత్యాన్ని తన కుటుంబంతో పాటు ప్రముఖ నాట్యాచార్యుడు వేదాంతం సత్యం వద్ద కూడా నేర్చుకున్నాడు. ఆయన వెంకటరామ నాట్య మండలి ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రదర్శనలనిచ్చేవాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చాడు. ఆయన బండ కనకలింగేశ్వరరావుతో కలసి శ్రీ సిద్దేంద్ర కళాక్షేత్రాన్ని కూచిపూడిలో నెలకొల్పడానికి కీలక పాత్ర వహించాడు. ఆయన 1969లో మరణించాడు.[1]

భరత కళా ప్రపూర్ణ అయిన చింతా కృష్ణమూర్తికి 1968లో సంగీత నాటక అకాడమీ పురస్కారం వచ్చింది.

ఆయనకు అఖిల భారత కూచిపూడి నాట్యకళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు పసుమర్తి కేశవ ప్రసాద్ అద్వర్యంలో 45వ వర్థంతి సభను హైదరాబాదు రవీంద్రభారతిలో నిర్వహించారు.[2]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]