Jump to content

చిండుగ

వికీపీడియా నుండి

చిండుగ
A. odoratissima from "Plants of the coast of Coromandel" by William Roxburgh
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
A. odoratissima
Binomial name
Albizia odoratissima
Synonyms
  • Mimosa odoratissima L.f.

చిండుగ వృక్ష శాస్త్రీయ నామం అల్బిజియా ఒడోరాటిస్సిమా (Albizia odoratissima). చిండుగను సిరిసి, తెల్సు, గనర అని కూడా అంటారు.

ఇతర భాషలలో పేర్లు

[మార్చు]

సంస్కృతం : భూశీరిష, హిందీ : కాలా శీరిష్, తమిళం : కరువాకై, సిత్తిలవాకై, కన్నడం : బిల్వార, మలయాళం : పులివాన్, నెల్లివాన్, కరివాన్, కున్నివాక, ఆంగ్లము : బ్లాక్ సిరిస్, కాలాసిరిస్

వ్యాప్తి

[మార్చు]

భారతదేశమంతటా 1500 మీటర్ల ఎత్తువరకు గల ప్రాంతాలలో బాగా పెరుగుతుంది.

మొక్క వర్ణన

[మార్చు]

ఎత్తులో మధ్య తరగతికి చెందిన చెట్టు ఇది. ముళ్ళు, బలమైన కొమ్మలు లేకుండా 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. చిన్న మొక్కలకు ఉదారంగు కాండలు, బాగా ముదురు ఆకుపచ్చ ఆకులు ఉంటాయి. కాండంపై బెరడు సన్నని గజిబిజి పగుళ్ళు, ముదురు రంగు మచ్చలతో ఉంటుంది. ఆకులకు కాడ ఎక్కువగా ఉండదు. ఆకులు ఈనె ఇరువైపులా ఒకదాని తరువాత మరొకటి ఉంటాయి. ఇవి ప్రధాన ఈనెకు ఇరువైపులా ఉంటాయి. ముదురాకు పచ్చరంగు ఆకుల మొదలు, చివర్లు అర్థవృత్తాకారంలో ఉంటాయి. ఈనెలు అన్ని సమానంగా ఉండవు. పూవులు తెలుపు రంగులో, వాసనతో, అనేక సన్న కేలాగ్రాలతో ఉంటాయి. కాయలు కంది కాయవలె పల్చగా ఉంటూ వాటి కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. ముదురు గోధుమ రంగులో ఉండే ఈ కాయలపై కొద్దిగా అల్లుకుని కనిపించే నరాల వంటి ఈనెలు ఉంటాయి. గింజలు పసుపచ్చని రంగులో పల్చగా ఉంటాయి.

ఆయుర్వేదంలో ఉపయోగపడే భాగాలు

[మార్చు]

చెట్టు బెరడు.

లక్షణాలు

[మార్చు]

ఇవి రక్తస్రావాన్ని నిలుపుదల చేస్తుంది. రక్తశుద్ధి, శ్లేషాన్ని పోగొట్టే లక్షణాలున్నాయి. వ్రణాలు, కుష్టు, చర్మరోగాలు, అగ్ని విసర్పణి దగ్గు, రొమ్ముపడిశం, మధుమేహం, శరీర మంటలకు దివ్యమైన ఔషధం.

చిత్రమాలిక

[మార్చు]





ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చిండుగ&oldid=2822693" నుండి వెలికితీశారు