Jump to content

చామరాజనగర్

అక్షాంశ రేఖాంశాలు: 11°55′34″N 76°56′25″E / 11.9260°N 76.9402°E / 11.9260; 76.9402
వికీపీడియా నుండి
Chamarajanagar
CH Nagar
City
Tirupati_Passenger_train_in_Chamarajanagar_Railway_Station.jpg
Chamarajanagar Railway Station
Nickname: 
The City of Chamraja Wodeyar IX
పటం
Coordinates: 11°55′34″N 76°56′25″E / 11.9260°N 76.9402°E / 11.9260; 76.9402
Country India
StateKarnataka
DivisionMysuru
DistrictChamarajanagar
Named afterChamaraja Wodeyar IX
ప్రభుత్వం
 • సంస్థCity Municipal Council
విస్తీర్ణం
 • City
18.75 కి.మీ2 (7.24 చ. మై)
 • గ్రామీణ
1,210 కి.మీ2 (470 చ. మై)
ఎత్తు
720 మీ (2,360 అ.)
జనాభా
 (2011)
 • City
69,875
 • సాంద్రత3,700/కి.మీ2 (9,700/చ. మై.)
 • Rural
2,87,924
Languages
 • OfficialKannada
కాల మండలంUTC+5:30 (IST)
PIN
571 313
Telephone code08226
Vehicle registrationKA-10
Websitewww.chamarajanagaracity.gov.in

చామరాజనగర్ లేదా చామరాజనగర భారతదేశం, కర్ణాటక, దక్షిణ భాగంలో చామరాజనగర్ జిల్లాలోని పట్టణం. గతంలో 'అరికొత్తర'గాపిలిచే మైసూర్ పూర్వపు రాజు IX చామరాజ వడయార్ పేరుదీనికి పెట్టారు. ఇదిచామరాజనగర్ జిల్లాకు ప్రధానకేంద్రం. ఇది పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలను కలిపే అంతర్రాష్ట్ర రహదారిపై ఉంది.

చరిత్ర

[మార్చు]

చామరాజనగర్‌ను పూర్వం శ్రీ అరికొత్తర అని పిలిచేవారు. మైసూరు వడయార్ అయిన చామరాజ వడయార్ ఇక్కడే జన్మించాడు.అందుకే ఈ ప్రదేశానికి అతని పేరు పెట్టారు. సా.శ. 1117లో హోయసల రాజు గంగరాజు సేనాధిపతి పునిసదండనాయకుడు విజయ పార్శ్వనాథ బసది, పవిత్ర జైన క్షేత్రం నిర్మించాడు.

భౌగోళిక శాస్త్రం

[మార్చు]

చామరాజనగర్ సముద్రమట్టానికి 720 మీటర్లు ( 2360 అడుగులు) 11°55′N 76°57′E / 11.92°N 76.95°E / 11.92; 76.95.ఎత్తులో ఉంది.

జనాభా శాస్త్రం

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, చామరాజనగర్ జనాభా 69,875.[1] అందులో పురుషులు 51% శాతం మంది ఉండగా, స్త్రీలు 49% శాతం మంది ఉన్నారు. చామరాజనగర్ సగటు అక్షరాస్యత రేటు 60% శాతంగా ఉంది.ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ ఉంది. పురుషుల అక్షరాస్య.త 65% శాతం ఉండగా, స్త్రీల అక్షరాస్యత 54% శాతం ఉంది. మొత్తం జనాభాలో 12% శాతం మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నవారు.

రవాణా

[మార్చు]

చామరాజనగర్ రైల్వే స్టేషన్ కర్ణాటకలో దక్షిణాన ఉన్న రైలు కేంద్రం. తిరుపతికి నేరుగా రైలు మధ్యాహ్నం మూడుగంటలకు బయలుదేరుతుంది ఉదయం బెంగళూరుకు నేరుగా రైలుఉంది.సమీప విమానాశ్రయం మైసూర్ విమానాశ్రయం. సమీప అంతర్జాతీయవిమానాశ్రయాలు కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి.

మతపరమైన దృశ్యం

[మార్చు]

మారవ్వ లేదా మారమ్మ పట్టణంలో అత్యంత విస్తృతంగా ఆరాధించబడే దేవత, పట్టణంలో పదికి పైగా మారవ్వ ఆలయాలు కనిపిస్తాయి. చామరాజేశ్వర దేవాలయం, హరాలు కోటే ఆంజనేయ దేవాలయం పెద్దవిగా ఉన్న పురాతన దేవాలయాలు. ఇవి కాకుండా పట్టణంలో అనేక దేవాలయాలు ఉన్నాయి.ఇతర మత విశ్వాసాల విషయానికొస్తే, పట్టణంలో 15 కంటే ఎక్కువ మసీదులు, 5 చర్చిలు, 2 జైన మందిరాలు, 2 బుద్ధ విహారాలు ఉన్నాయి.

బందిపోటు వీరప్పన్

[మార్చు]

జిల్లాలోని చాలా దక్షిణ ప్రాంతం దట్టమైన అటవీప్రాంతం కాబట్టి, వంద మంది పోలీసుల మరణానికి కారణమైన అపఖ్యాతి పాలైన బందిపోటు వీరప్పన్‌కు ఇది మంచి ఆశ్రయం కల్పించింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో 2004 అక్టోబరు 18న ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్వేక కార్యదళం (ఎస్.టి.ఎఫ్) తో జరిగిన సంఘర్షణలో అతను కాల్చి చంపబడ్డాడు. అతను రెండు దశాబ్దాలకు పైగా పరారీలో ఉన్నాడు.

నల్లరాయి కోసం అక్రమ గనులు ఉండటం వల్ల ఈ ప్రాంతంలోని అడవులకు పెను ముప్పు వాటిల్లుతోంది.

చిత్ర గ్యాలరీ

[మార్చు]

ఇవి కూడ చూడండి

[మార్చు]

బి. రాచయ్య

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2011". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.

వెలుపలి లంకెలు

[మార్చు]