చర్చ:సీలింగ్ ఫ్యాన్
స్వరూపం
రెడ్డి గారు ఎవరికీ తెలియని ఒక విశేషమైన అంశాన్ని సూక్ష్మంగా సంక్షిప్తంగా ఫ్యాను ఎందుకు తిరుగుతుందో కూడా తెలియజేయకుండా చక్కగా వ్రాసినందుకు ధన్యవాదాలు. ఎక్కువ విషయం వ్రాస్తే పాఠకులు జ్ఞానవంతులైపోతారనే మీ ధృక్పధం విశేషమైనది. Somu.balla (చర్చ) 03:24, 8 ఫిబ్రవరి 2013 (UTC)
- సీలింగ్ ఫ్యాన్ లాంటివి అనగా టేబుల్ ఫ్యాన్, పెడల్ ఫ్యాన్ మొదలైనవి అన్నింటికీ ఫ్యాన్ అనే వ్యాసాన్ని తయారుచేస్తే బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 04:37, 8 ఫిబ్రవరి 2013 (UTC)
- పంఖా అనేది ఉర్దూ పదం. విసనకర్ర లేదా వీవెన అనేది తెలుగు పదం. కానీ దీనికి కర్రతో తయారై చేతితో విసరుకొనే వాటికే ఉపయోగిస్తారు. ఫ్యాన్ ఆంగ్ల పదం అయినా ఇదే వాడుకలో ఉన్నది.Rajasekhar1961 (చర్చ) 08:05, 8 ఫిబ్రవరి 2013 (UTC)
ఒకే సభ్యునికి వ్యతిరెకంగా పదెపదె అనవసర వ్యాఖ్యలు చేయడం తప్పు. అలాచేయడం ఆ సభ్యుని వికిపీడియా రచనా హక్కులకు భంగకరం. 49.14.252.147 14:56, 8 ఫిబ్రవరి 2013 (UTC)
- నేను ఒకే సభ్యునకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంలేదని గమనించాలి. విషయం లేని వ్యాసకర్తలకు తగు సూచనలిచ్చినా వారు వారి పంధా మార్చుకోకపోవటం దురదృష్టకరం.తెవికీ లో రచనా హక్కులను వేరొక సభ్యుడు భంగపరచడం ఉండదు. మీరు రెడ్డిగారిచే నాణ్యమైన వ్యాసాలు వ్రాయమని, వారి అర, పావు వాక్యాలను విస్తరించమని చెప్పండి. అయనికి తగు సూచనలివ్వండి. అప్పుడైనా మారుతారేమో. అంతే గాని సూచనలిస్తే అనవసర వ్యాఖ్యలా! నాకు అనవసర వ్యాఖ్యలు చెయ్యటమె పనా! రెడ్డిగారు నాకు శత్రువా! అతను ఎవరో తెలీదు. అతడు మంచి వ్యాసకర్తగా మారాలని కోరుకుంటున్నాను.Somu.balla (చర్చ) 15:50, 8 ఫిబ్రవరి 2013 (UTC)
- విసన కర్ర మరియు వీవెన అనునవి యంత్ర సహాయంతో పనిచేయవు. ఇవి మనిషి యొక్క కండర శక్తి వల్ల పనిచేస్తాయి. ఫ్యాను కు సరియైన తెలుగు పదం లేదు. అనగా ఇది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. అనగా ఇందు శక్తి పరివర్తన జరుగుతుంది. అందువల్ల దీనిని విసనకర్ర లో విలీనం చేయటం తగదు. జన సామాన్యంలో ప్యాను అనే పదం అందరికీ సుపరిచితమే అని సభ్యులు గ్రహించాలి. ఆంగ్ల పదములను సరియైన తెలుగు పదములు లభించవు. యించుమించు సమానార్థాన్నిచ్చే పదాలు లభిస్తాయి. అన్ని ప్యాన్లు కూడా విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చినప్పటికి కొన్ని వలయాలలో తేడాలుంటాయి. ఉదాహరణకు టేబుల్ ప్యానులో రెగ్యులేటర్ అందులోనే అమరి ఉండటం, అన్నివైపులా తిరిగే వ్యవస్థ ఒకె బేరింగ్ ఉండే వ్యవస్థ ఉంటాయి. అందువల్ల ఈ వ్యాసాన్ని ఈ విధంగా యధా తధంగా ఉంచితె సమస్యలేదని నా అభిప్రాయం. అందువల్ల దీనిని తగు విధంగా శుద్ధి చేసి,పనిచేసే విధానం చేర్చి విలీనం మూసను తొలగించాను. దీనిపై ఏ విధమైన అభిప్రాయములున్న ఈ చర్చా పేజీలో వ్రాయండి.( కె.వి.రమణ- చర్చ 16:38, 8 ఫిబ్రవరి 2013 (UTC))
- నేను ఒకే సభ్యునకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంలేదని గమనించాలి. విషయం లేని వ్యాసకర్తలకు తగు సూచనలిచ్చినా వారు వారి పంధా మార్చుకోకపోవటం దురదృష్టకరం.తెవికీ లో రచనా హక్కులను వేరొక సభ్యుడు భంగపరచడం ఉండదు. మీరు రెడ్డిగారిచే నాణ్యమైన వ్యాసాలు వ్రాయమని, వారి అర, పావు వాక్యాలను విస్తరించమని చెప్పండి. అయనికి తగు సూచనలివ్వండి. అప్పుడైనా మారుతారేమో. అంతే గాని సూచనలిస్తే అనవసర వ్యాఖ్యలా! నాకు అనవసర వ్యాఖ్యలు చెయ్యటమె పనా! రెడ్డిగారు నాకు శత్రువా! అతను ఎవరో తెలీదు. అతడు మంచి వ్యాసకర్తగా మారాలని కోరుకుంటున్నాను.Somu.balla (చర్చ) 15:50, 8 ఫిబ్రవరి 2013 (UTC)
- పైకప్పు పంఖా అన్న పదం వాడుకలో లేదు. సీలింగ్ ఫ్యాన్ అన్న పదం వ్యవహారంలో ఉంది. వికీపీడియా సాధారణ నామం విధానం ప్రకారం ఏదైతే సాధారణంగా వ్యవహారంలో ఉందో ఆ పదమే వాడాలి. కనుక, సీలింగ్ ఫ్యాన్ అన్న పేరుకు దీన్ని తరలిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:30, 13 మార్చి 2021 (UTC)