Jump to content

చర్చ:షా అలీ పహిల్వాన్ దర్గా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
షా అలీ పహిల్వాన్ దర్గా వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


దండెత్తడాలు, ఇతర మతస్తుల ప్రార్థనాలయాలను ధ్వంసం చేయడం, అన్ని మతాలలోనూ నేరమే, అలాగే ఇస్లాంలోనూ నేరమే. సూఫీతత్వము శాంతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడుకున్నది, పహిల్వాన్లుల, మల్లయోధుల క్రీడ కాదు. ఒక వేళ పత్రికలో వచ్చిన కథనం నిజమైతే, ఈ పహిల్వాన్ గారికి దర్గా నిర్మించడం ఉర్సులు నిర్వహించడం శుద్ధ దండగ. దర్గాలు సూఫీ గురువులవి వున్నాయి. అంధవిశ్వాసులు వున్నన్న నాళ్ళూ ఇలాంటివారు కొలవబడతారు. అహ్మద్ నిసార్ (చర్చ) 04:27, 23 ఆగష్టు 2014 (UTC)

సూఫీ తత్వం- హైందవ అత్మీయ తత్వమే

[మార్చు]

అహ్మద్ నిసార్ గారూ! నమస్కారాలు. ముసల్మానులు (అందరు కాదు) అంధమార్గంగా భావించినా, సూఫీతత్వం హైందవులను సైతం అక్కున చేర్చుకున్న జ్ఞాన నేత్రం, అత్మీయ మంత్రం. ఆ ఇష్టంతోనే దర్గాల గురుంచి రాయడం మొదలుపెట్టాను. సూఫీతత్వము శాంతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడుకున్నది, పహిల్వాన్లుల, మల్లయోధుల క్రీడ కాదు అని మీరన్నది నిజమే. దర్గాలు ఆధ్యాత్మిక గురువులవే ఇదీ కాదనలేని వాస్తవమే. ఆ పేపరులో వచ్చిన కథనం జానపదుల కథనాల ఆధారంగా ప్రచురించబడినది. ఈనాటికీ ఆ ఊర్లో అలాగే భావిస్తారు. అలంపూర్‌తో నాకున్న ఐదు సంవత్సరాల అనుబంధంతో చెబుతున్నాను. నేను అక్కడే చదువుకున్నాను. అయితే జానపదుల కథనాలలో కాలక్రమేనా కొన్ని ప్రక్షిప్తాలు చేరడం సహజం. అయినా దర్గా నిర్మించారంటే పహిల్వాన్‌లోనూ ఏదో ఒక మానవీయ కోణం ఉండే ఉండవచ్చు. సాక్షి భూతమైన నిజ చరిత్రే నిగ్గు తేల్చాల్సి ఉంది. Naidugari Jayanna (చర్చ) 17:56, 23 ఆగష్టు 2014 (UTC)

సూఫీతత్వం పట్ల మీ అభిప్రాయం అభిమానం

[మార్చు]

నాయుడుగారి జయన్న గారూ, సూఫీతత్వం పట్ల మీ ఆసక్తి అభిమానం చూస్తుంటే ముచ్చటేస్తుంది. సత్యం చెప్పాలంటే, నేనూ సూఫీ తత్వాన్ని అభిమానించే వాడినే. సూఫీతత్వం మహర్షులందించిన ఆధ్యాత్మిక జ్ఞానం. ముహమ్మద్ ప్రవక్త కూడా ఒక మహర్షియే. అతనూ సంవత్సరాల తరబడీ హిరా గుహలో "మురాకిబా", "జిక్ర్" (ధ్యానం, తపస్సు లాంటివి) చేసినవారే. ఆతరువాతే వారికీ దివ్యావిష్క్రుతి లభించినది. కానీ నేడు ముస్లింలు వితండవాదులుగా మారారు. అరేబియాలో వహాబిజం బయల్దేరిన నాటి నుండి సున్నీలకు వహాబీలకు పడటం లేదు. ఇద్దరిలో ఉన్న అతివాదాలు సామాజిక సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సరే, సూఫీతత్వం గురించి, ముస్లింలందరికీ సూఫీ గురువు పైగంబరులవారు (మహర్షి వర్యులు) ముహమ్మద్ ప్రవక్తయే. నేడు మనం చూస్తున్న వలీ (ఏకవచనం), ఔలియా (బహువచనం) లు , అల్లాహ్ కు సన్నిహితులు. అందుకే వీరికి ఔలియా అల్లాహ్ (అల్లాహ్ సన్నిహితులు - అల్లాహ్ స్నేహితులు) అని సంబోధిస్తారు. ఔలియాలను గౌరవిస్తారు గాని కొలవరు, ఆరాధించరు, పూజించరు. ఔలియా & సూఫీ తత్వం వ్యాసాలు చూడండి. అహ్మద్ నిసార్ (చర్చ) 18:12, 19 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

పాలగిరి, పవన్ సంతోష్, అహ్మద్ నిసార్

ధన్యవాదాలు

[మార్చు]

అహ్మద్ నిసార్ గారూ! మీ ఆప్యాయతకు ధన్యవాదాలు. నిర్లాభాపేక్షగా సంవత్సరాల తరబడి వికీపీడియాకు అంకితమై, వేలకొలది దిద్దుబాట్లు చేసిన మీ వంటి సీనియర్ వికీపీడియన్ మార్గనిర్దేశకత్వం లభించడం నిజంగా నా అదృష్టం. ఇక సూఫీతత్వం, దర్గాల గురించిన విషయానికి వస్తే, దస్తగిరయ్య, గోకారమయ్య ( బహుశా ఇవి హైందవీకరించబడిన పేర్లు అయిఉండవచ్చు) వంటి ఏదో ఒక పేరుతో దర్గాలేని పల్లెటూరు లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు నాగరికత పేరుతో జనాలు మర్చిపోయారేమో కానీ, దశాబ్దం కిందటి వరకు కందూరు పేరుతో దర్గా దగ్గర పొలావ్ రుచి చూడని పల్లెటూరి హిందువు ఉన్నాడా? కళ్ళకు, గొంతుకు ఉదానీ అద్దుకోనీ మనిషి ఉన్నాడా? పీర్ల చావిడి దగ్గర దూల ఆడని మనిషి పల్లెటూర్లో వెతికినా దొరకడు. పల్లెల్లో సమైక్యతకు దర్గాలు వారథులు. ఏ మతంలోని అతివాదులైన సమైక్య భావనకు విరోధులే. సంఘవిద్రోహ శక్తులే. Naidugari Jayanna (చర్చ) 15:11, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

జయన్న గారూ, చాలా మంచి కోణాలలో చూస్తూ వ్రాసారు అభినందనలు. కొన్ని విశదీకరణలు
దస్తగిరయ్య : దస్తగిరి + అయ్య ; దస్తగిరి తెనుగీకరింపబడిన ఉర్దూ, పర్షియన్, అరబ్బీ పదం "దస్తగీర్" అర్థం చేయిపట్టి మార్గం చూపించువాడు, ఈ విశేషణాన్ని ఆనాటి సూఫీ గురువు అబ్దుల్ ఖాదిర్ జీలాని (బడే పీర్, మహబూబ్ సుబహానీ, గౌసుల్ ఆజం దస్తగీర్ అనే ఇతర పేర్లు) కు వాడుతారు. ఇతని పేరు మీదే "గ్యార్వీఁ కే ఫాతెహా" (గ్యార్వీఁ చదివింపులు - గ్యార్మీ) లు చేస్తారు.
గోకారమయ్య : ఉర్దూ మరియు పర్షియన్ పదము "గోరఖ్ ధందా" అర్థం "అర్థం కాని విషయం", బుర్రకందని వాడు (పరమేశ్వరుడు) లకు వాడుతారు. అల్లాహ్ లేదా పరమేశ్వరుణ్ణి "తుమ్ ఎక్ గోరఖ్ ధందా హో" అనీ, నువ్వు బుర్రకందని వాడివయ్యా అనీ పిలుస్తారు. అలా జరిగింది పదవ్యుత్పత్తి.
కందూరు : కందోరీ అని కూడా అంటారు, అనగా "నోము" లేదా "మొక్కుబడి" (నియాజ్ - మన్నత్) నోచి తీర్చుకునే సంబరం, లేదా వలీ (పీరు, సూఫీ గురువు) అల్లాహ్ సాన్నిధ్యాన్ని చేరుకునే సందర్భాన జరుపుకునే సంబరం.
ఊదాని : ఊద్ (సాంబ్రాణి) ను బొగ్గు కణికలలో కాల్చి సుగంధాన్ని గాలిలో (వాతావరణంలో) వెదజల్లడం లేదా వదలడం. అనగా మనం సాంబ్రాణిలా కాలి ఇతరులకు సుగంధాన్ని మరియు మంచి వాతావరణాన్ని మరియు మంచి ఆలోచనలను కలుగ జేయాలి, ఇదొక సింబాలిక్ విషయం.

కానీ..... దురదృష్ట వశాత్తు పెద్దలు చెప్పిన విషయాలు నేడు పిల్లచేష్టలై కూర్చున్నాయి. పెద్దలు "విజ్ఞానం" వైపుకు పరుగెడితే పిల్లలైన నేటి యుగపు మనుషులు "వినోదం" వెనుక పరుగెడుతున్నారు.

దూలా : పీర్ల పండుగ మొహర్రం పండుగ సందర్భాన కర్బలా కథను వల్లుతూ "అలావా" చుట్టూ తిరుగుతూ ఎగరడం. ఇవి ఎక్కువగా షియా ముస్లింలు చేస్తారు. కానీ సున్నీలలోనూ ఆచరించేవారు. కానీ నేడు సున్నీలలో దాదాపు కనుమరుగయ్యింది.


మీరు పైనుదహరించిన ఐదు పదాల వెనుక కహానీ... అహ్మద్ నిసార్ (చర్చ) 19:48, 21 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]