Jump to content

చర్చ:వేణువు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మీరు "వీణ వేణువైన సరిగమ విన్నావా?" అనే పాట విన్నారా? ఏదో రైమ్ కోసం కవి అలా రాసుంటాడు. లోతుగా హేతుబద్ధంగా ఆలోచిస్తే ముందు వేణువు ఆతర్వాత కొన్నివందల సంవత్సరాలకి వీణ పుట్టాయి. మనం ఇప్పుడు "ముందు వేణువు ఆతర్వాత వీణ పుట్టుకల వెనుక హేతువును పరిశీలిద్దాం. వందల వేల సంవత్సరాలక్రితం ఎప్పుడో ఏఅడవిలోనో వానలు వచ్చి వెలసిన తర్వాత వీచేగాలికి వినిపించే ఈలలు కూతలు స్వరాలు సరిగమలు మనిషిలో ఆశ్చర్యాన్ని భయాన్ని ఆలోచనను రేకెత్తిస్తే...కందిరీగలొచ్చి చెప్పాయట "వానలకు వెదురు బొంగులలో మాఇళ్ళన్నీ కరిగి కొట్టుకుపోతే మేం వెదుళ్ళకు చేసిన రంధ్రాలలోకి గాలి దూరి ఆ ధ్వనులు వస్తున్నాయ్ " అని. అవును కదా! గోవులు మేపుకుంటూ గోపబాలకులు ఆ వెదురు బొంగులనే వేణువులుగా ఊదేవారన్నమాట. అందుకే శ్రీకృష్టుడి వేణునాదానికి అడవిమొత్తం పులకించిపోయేదన్నమాట. ఇంతకీ సప్తస్వరాలను కనుగొన్నది ఎవరు? శ్రీకృష్టుడా? సరస్వతా? లేక తెలియక కందిరీగలు, తెలిసి గోపబాలురా? ఎవరు సప్తస్వరాలను కనుగొన్నారు? వేణువు ముందా? వీణముందా? ఆలోచిస్తుంటే ఈ ప్రశ్నల మధ్య పొంతన లేదనిపిస్తోంది. ఎందుకంటే వేణువు ఆవిర్భావం జరిగిన తీరుతెన్నులకూ వీణ తయారైన తీరుతెన్నులకూ వందల సంవత్సరాల దూరం ఉండే అవకాశాలెక్కువ. వీణను తయారు చేయాలంటే ముందు ఉక్కు తీగలు కావాలి. అంటే ఇనుమును కరిగించేటంతటి ఉష్టోగ్రతను మానవుడు కనిపెట్టేనాటికే వేణువు తయారవ్వడమూ మనిషి అనుభవంలోకి రావడమూ జరిగిపోయి ఉండాలి. అందుకే సప్త స్వర సృష్టికర్త సరస్వతీదేవి కాదనినాకనిపిస్తోంది. ఒక్క వేణువనేకాదు ఇంచుమించు గాలివాయిద్యాలన్నీ పుట్టి వాటి మనుగడ మొదలయ్యాక కొన్నివందల సంవత్సరాల తర్వాత గాని తీగ (తంత్రీ) వాయిద్యాలు మొదలయ్యే అవకాశంలేదు. సరే ఇప్పుడీచర్చ దేనికి? దేనికీ అంటే ముందు సంగీతాన్ని కనుగొన్నవారు జానపదులనీ వారి మొదటి వాయిద్యం వేణువు అనీ వివరించడానికి. సంగీత కళాకారులు పూజలు చేయవలసివస్తే ముందుగా ఆపూజలు వేణువుకి చేయాలని చెప్పడానికి. అంతే. మీ 'సూర్యమిత్ర' బుద్ధ చంద్ర దేవ్ , కొత్తపేట. తూ.గో.జిల్లా. 117.200.28.111 02:50, 19 మే 2017 (UTC)Addanki Buddha Chandra Dev, kothapeta (mandal & village), E.G.Dt., 533223[ప్రత్యుత్తరం]