Jump to content

చర్చ:వీగనిజం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

సహాయం కావాలి

[మార్చు]

ఈ వ్యాసాన్ని తెలుగులోనికి అనువదించమని అనుభవజ్ఞులైన/ఉత్సాహవంతులైన వాడుకరులను అభ్యర్థిస్తున్నాను.--స్వరలాసిక (చర్చ) 09:17, 1 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసాలను చేర్చాలనే సంకల్పం అభినందనీయమే. పూర్తిగా ఇంగ్లీషులో ఉన్న ఈ వ్యాసాన్ని అనువదించేందుకు ఎవరైనా పూనుకుంటే వారు మరింతగా అభినందనీయులౌతారు. కానీ అనువదించేందుకు ఎవరూ ముందుకు రాకపోతే, ఈ ఇంగ్లీషు వ్యాసం ఇలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఎవరో ఒకరు తొలగింపుకు ప్రతిపాదించాలి, దానిపై చర్చించాలి, ఆపై తొలగించాలి. ఇదంతా అనవసరమైన పని. దీని బదులు రచ్చబండలోనో మరో చోటో.., ఇంగ్లీషు వ్యాసం పేరు ఇచ్చి దాన్ని ఎవరైనా అనువదించమని కోరితే బాగుంటుంది. దాని వలన రెండుపయోగాలున్నాయి:
  • అనువదించేందుకు ఎవరూ ముందుకు రాకపోతే, నష్టమేమీ లేదు. తొలగింపు ప్రయాస ఉండదు.
  • అనువదించే ఆసక్తి ఉన్నవారు అ వ్యాసాన్ని తామే తెచ్చి అనువదిస్తారు. అప్పుడు వ్యాసం సృష్టించినవారి పేరుగా ఆ వాడుకరి పేరే ఉంటుంది. (వ్యాస సృష్టికర్తగా తమ పేరు ఉండడం కోసమే ఇంగ్లీషు వ్యాసం తెచ్చి ఇక్కడ పెట్టారనే అపప్రథ కూడా ఉండదు.)
అందరూ పరిశీలించవలసినది. __చదువరి (చర్చరచనలు) 11:20, 1 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పైన వివరించిన విధానం బాగుంది. యర్రా రామారావు (చర్చ) 12:59, 1 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, వికీపీడియాలో ఎవరికి ఆసక్తి ఉన్న అంశాలకు సంబంధించిన వ్యాసాలు ఆయా వాడుకరులు రాస్తుంటారు. ఎవరో ఏదో వ్యాసాన్ని రాయాలని సూచించడం అంటే, ఒక వాడుకరి మిగతా వాడుకరులకు పని అప్పజెప్పడం లాంటిదని నా అభిప్రాయం. వ్యాసాలు సూచిండడం అనేది మొదలు పెడితే ప్రతి ఒక్కరూ వ్యాసాలు సూచిండడమే పనిగా పెట్టుకుంటారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:21, 1 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పైన స్వరలాసిక గారు ఆయనకు ఆసక్తి ఉన్న ఒక వ్యాసాన్ని అనువదించడంలో మిగతా సభ్యుల సహాయం కోరారు. అది మంచిదే. ఎవరైనా ఆసక్తి ఉంటే చేస్తారు లేదంటే లేదు. సహాయం కోరడాన్ని మనం ప్రోత్సహించాలి. కానీ వ్యాసాలు అనువదించేటపుడు ఆంగ్ల పాఠ్యాన్ని మొత్తం మొదట్లోనే పేస్టు చెయ్యకుండా, తీరిక దొరికినప్పుడు ఒక్కో పేరాగ్రాఫు తీసుకువచ్చి అనువాదం చేసి చేరుస్తూ ఉంటే బాగుంటుంది. నేను అనువదించే వ్యాసాల్లో కూడా ఇదే పద్ధతి అనుసరిస్తాను. స్వరలాసిక గారూ, పరిశీలించండి. రవిచంద్ర (చర్చ) 01:35, 2 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
'వీగనిజం' అసలు దీనికి సరియైన తెలుగుపదం ఏమిటో అర్థం కావటంలేదు.ఇది పూర్తిగా ఆంగ్ల పదంలాగా ఉంది.ఆంగ్లంలో కూడా Veganism అనే ఉంది.నాకు తెలిసినంతవరకు శాకాహారం అనే అర్థం అనుకుంటున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:25, 2 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీని సృష్టించి, అనువదించమని కోరి 10 రోజులైంది. అనువదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు, సృష్టికర్త లాగానే. ఈ పేజీని తక్షణమే తొలగించాల్సిన సమయమిది. అసలు సత్వర తొలగింపు-A2 ప్రకారం సృష్టించిన వెంటనే తొలగించాల్సిన పేజీ ఇది. ఇప్పుడు ఆ క్లాజు ప్రకారమే తొలగిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 03:29, 10 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]