చర్చ:మిరుదొడ్డి
వికీపీడియా నుండి నాకు తెలిసిన చరిత్ర చెబుతున్నాను. క్రీ..శ. 900 సంవరత్సరాల క్రితం నుంచె ఈ గ్రామం ఉండేది. వడ్డే రాజులు సామంత రాజులుగా ఉన్నారు.
రాజు మరణించగా ఆయన భార్య లక్ష్మి, 7 గురు కుమారులు జీవిస్తున్నారు. అక్కడ నిర్మించిన రామాలయనికి దగ్గర్లొ నివాసం ఉండి పరిపాలించ సాగారు. ఒక రోజు ఉత్తర ప్రాంతం నుంచి ఒక మునీశ్వరుడు వచ్చి ఆష్రయం పొందాడు. ఆ రొజు పడుకునె ముందు తన దగ్గర ఉన్న పాత్రను ఉట్టిపై పెట్టి పడుకున్నాడు. అంతకు ముందే ఆ పాత్రను ముట్టుకొవద్దని ఛెప్పాడు. అనుమానం వచ్చిన ఆ రొజు రాత్రి లక్ష్మి కుమారులు ఉట్టి పై ఉన్న పాత్రను దొంగచాటుగా చూశారు. ఆ పాత్ర నుంచి ఒక్కొ బొట్టు చుక్కలు పడుతున్నాయి. కింద ఉన్న ఇనుప బండి పయ్యపై పడగా ఇనుము బంగారంగా మారింది. ఇనుమును బంగారంగా మర్చవచ్చని, శ్రీమంతులం కావచ్చనే దుర్బుద్దితో పాత్రను దొంగిలించారు. మునిని చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి దిగులు చెందింది. అప్పుడే తీవ్ర కరువు వచ్చింది. లక్ష్మి ప్రతీ రొజు పూజలు చేయ సాగింది. ముని ఒక రోజు కళలోకి వచ్చి ప్రజలకు ఉపయోగపదె పనులు చేయాలని, అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పాడు. అప్పుడే గ్రామం చుట్టూ చెరువులు, కుంటలు తవ్వించారు. మొత్తం 101 వరకు తవ్వించారు. ప్రజలను భాగస్వాములను చేశారు. అప్పుడే పెద్ద కుమారుడు మిట్టరాజు పేరును గ్రామానికి నామకరణం చెసినట్లు చెబుతారు. కొడుకుల పేర బ్రహ్మరాజు చెరువు, మిట్టాకాని కుంట తదితర పేర్లను నమకరణం చెశారు. లక్ష్మి అటవీ ప్రాంతంలొ నివసించింది. అప్పుడు ఆమె నివసించిన చోట లక్ష్మినగర్ గ్రామంగా ఏర్పడీంది. 'తప్తె మిర్ దొడ్డి' మిర్దొడ్డి గ్రామానికి తప్తె మిర్డొడ్డి అనే పేరు వచ్చింది. ఈ గ్రామం చాలా విశాళంగా ఉండడంతో ఇక్కడ పెద్ద దొడ్డి ఉండేదట. ఏ గ్రామంలో పశువులు పోయినా మిట్టకానిలో దొరుకుతాయని వచ్చేవారు. అప్పుడే మిట్టకాని నుంచి కాని తొలిగిపొయి దొడ్డి కలిసి మిట్టదొడ్డిగా మరింది. రాను రాను మిర్ దొడ్డిగా, మిడిదొడ్డిగా మారిందీ. ఎక్కడకు వెల్లినా పశువులు దొరుకవని, మిర్దొడ్డీలోనే దొరుకుతాయని ఉద్దెశ్యంతొ తప్తె మిర్దొడ్డి అని పిలుస్తారు.
మిరుదొడ్డి గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. మిరుదొడ్డి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.