చర్చ:మహామృత్యుంజయ మంత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్తోత్రాల విషయంలో గమనించవలసిన విషయం - ఇక్కడ స్తోత్రాల "గురించి" వ్రాయవచ్చును కాని స్తోత్రాలు వ్రాయడం సరి కాదు. స్తోత్రాలు వ్రాయడానికి వికీసోర్స్ సరైన స్థలం. ఇప్పటికే ఉన్న కొన్ని స్తోత్రాలు కూడా వికీసోర్స్‌కు తరలించబడుతాయి. ఇక తెలుగు వికీలో స్తోత్రాల గురించిన వ్యాసాలు మాత్రం వ్రాయవచ్చును. ఇందుకు ఉదాహరణగా సౌందర్య లహరి, విష్ణు సహస్రనామ స్తోత్రము, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, కనకధారా స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం వంటి వ్యాసాలు ఒకమారు పరిశీలించండి. ----కాసుబాబు 16:52, 30 ఆగష్టు 2009 (UTC)
బంధనాత్ = బంధనం నుంచి ( అంటే తీగనుంచి లేదా తొడిమనుంచి ); ఉర్వారుకమివ = దోసకాయను వలె ; మృత్యోః = చావునుంచి ; ముక్షీయ = విడివడిన వాడను అగుదును గాక; అమృతాత్ = మోక్షము నుంచి; మా = వద్దు ( వదిలిపెట్టబడినవాడను కాకుండా ఉందునుగాక )
తాత్పర్యం: తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. మోక్షము నుంచి నన్ను వేరుచేయవద్దు.
ఈ భావము వ్యాసము లో చేసిన మార్పు వల్ల రాలేదని నా అభిప్రాయం.--కంపశాస్త్రి 11:02, 11 సెప్టెంబర్ 2009 (UTC)