Jump to content

చర్చ:భువనవిజయం (రూపకం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
భువనవిజయం (రూపకం) వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2015 సంవత్సరం, 42 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


మూలాలు కావాలి

[మార్చు]

భువనవిజయం అనే సాహితీ రూపకం ఇలా ప్రారంభమైందన్న విషయం నాకు ఇప్పటివరకూ తెలీదు. ఈ వారం మీకు తెలుసాలో భువన విజయం ఎవరు ప్రారంభించారన్న ఆలోచన రానందుకు తిట్టుకున్నాను, ఈ విషయం తెలుసుకుని సంతోషించాను. ఇందుకు వ్యాసం ప్రారంభించి, అభివృద్ధి చేసిన స్వరలాసిక గారికి ధన్యవాదాలు, అభినందనలు. ఐతే మూలాలు లేకపోవడం వ్యాసానికి లోటుగా ఉంది. దయచేసి మూలాలు ఇస్తే వ్యాసం నాణ్యత, విలువు పెరుగుతుంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:06, 17 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసానికి మూలం ప్రసాదరాయ కులపతి (ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వర భారతిస్వామి) రచించిన భువనవిజయము సాహితీరూపకచరిత్ర అనే పుస్తకం అనుకుంటాను. మరొక సారి నిర్ధారించుకుని మూలాలు జతచేయగలను.--స్వరలాసిక (చర్చ) 12:28, 17 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలండీ --పవన్ సంతోష్ (చర్చ) 03:45, 18 అక్టోబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

భువన విజయం గురించి మాట్లాడే అల్పులందరూ ఆ సాహితీ రూపకాన్ని రాజమండ్రిలో ఆంధ్రకేసరి యువజన సమితి వారు ఎంత అద్భుతంగా ప్రదర్శ్తారో తెలుసుకుని మాట్లాడడం మంచిది. యెఱ్ఱాప్రగడ రామకృష్ణ గారు ధూర్జటి గానూ, రిటైర్ రీడరైన డా యస్వీ రాఘవేంద్రరావుగారు మాదయ్యగారి మల్లన లాగానూ సీబీవీఆర్కే శర్మ గారు శ్రీకృష్ణ దేవరాయలుగానూ రూపకాన్ని ప్రదర్శిస్తుంటే చూడడానికి రెండుకళ్ళు చాలవు అన్నమాట గమనించాలి. ఒకే ఒకసారి ఆరూపకంలో పెద్దనగా అనుగ్రహించిన పీసపాటి వారు తెనాలిరామలింగడుగా అనుగ్రహించిన సినీనటుడు స్వర్గీయ పద్మనాభం రాజమండ్రి దేవీచౌక్ లో ఆహూతులను ఒకనాటి చల్లటి దసరా రాత్రంతా ఉర్రూతలూగించిన విషయం తెలుసుకుని మాట్లాడాలి. ఎక్కడో గుంటూరులో పుట్టేహేసింది అని పేటెంట్లు తీసేసుకునే ఆ సాహితీ రూపక రాజాన్ని కొన్ని వేలసార్లు ప్రదర్శించిన రాజమండ్రి కవులని ఒక్కసారన్నా కలిసి మాట్లాడాలన్న ఙ్ఞానం ఈ (అ)ఙ్ఞానులకి లేకపోవడం దురదృష్టకరం. 192.8.254.10 --- సహచరుడు

  • ఈ విజ్ఞానాన్ని పంచినందుకు ధన్యవాదాలు. ఐతే తెలుగువారికి వేలాది వ్యాసాలను స్వచ్ఛందంగా అభివృద్ధి చేస్తూ తమ కృషి కొనసాగిస్తున్న వ్యక్తులను అజ్ఞాతంగా ఉండి అవహేళన చేయడానికి బదులు నిజానికి ఇది ఎక్కడ ప్రారంభమైందో ఆ మూలాలను ఏ పుస్తకాల నుంచో, ఇంటర్వ్యూల నుంచో, మరేదైనా పరిశోధనల నుంచో ఇచ్చి రాసివుంటే సరిగ్గా ఉండేది. మీరు పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు ప్రస్తావించారు, మీరు ప్రస్తావించిన మహానుభావులందరి పట్లా గౌరవం ఉంది. ఐతే ఆ విషయాన్ని కనీసం మర్యాదపూర్వకంగా మాట్లాడే విజ్ఞత మీరు ప్రదర్శించనందుకు చాలా బాధాకరంగా ఉంది. మొదటిమారు కనుక మర్యాదపూర్వకంగా సూచించదలిచింది ఏంటంటే - తోటి సభ్యుల అభిప్రాయాలను వ్యతిరేకించవచ్చు, వ్యాసాల్లో అంశాన్ని ప్రశ్నించవచ్చు కానీ సగౌరవంగా చేయండి. ఎవరితోనైనా విభేదించండి, కానీ మర్యాదగా చేయండి. --పవన్ సంతోష్ (చర్చ) 19:31, 18 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
అజ్ఞాత సహచరునికి మరో సూచన ఏమంటే, వికీపీడియా వ్యాసాల శైలి విజ్ఞాన సర్వస్వపరమైన శైలిలో ఉండాలి. మీరు చెప్తున్న అంశాలను విజ్ఞాన సర్వస్వ శైలిలో రాసి మీరు ఏ పుస్తకం నుంచి, ఇంటర్వ్యూ నుంచి, పత్రిక నుంచి ఈ అంశం తెచ్చి రాస్తున్నారో మూలాన్ని ఇచ్చి చక్కగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. ఏం చేసినా తోటి సభ్యుల పట్ల, వారి స్వచ్ఛంద కృషి పట్ల గౌరవంతో, పైన లింకులో సూచించిన వికీపీడియా మూల సూత్రాలను అనుసరిస్తూ చేయమని సూచన. వ్యాసాల్లో ఇమడని శైలిలో రాయడం, వ్యక్తిగత దాడులకు దిగడం వల్ల ప్రయోజనం ఉండదు. --పవన్ సంతోష్ (చర్చ) 19:41, 18 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

ఆర్యా నా వాదనని అంగీకరించినందుకు ధన్యవాదాలు. 10 లైన్లకి పైబడి మీ సమాధానం లో నన్నూ నా శైలినీ విమర్శించడానికి సిమ్హభాగం కేటాయించినందుకు ధన్యోస్మి. మీరు వ్యవహరించిన ఆ పెద్దపెద్దవారు సైతం ఉత్సాహం గా ఈ రూపకంలో మారు మారు పాలుపంచుకునే వారన్న సంగతి మీలాంటి అనుభవఙ్ఞులకి తెలియకపోవడం బాధాకరం. భువనవిజయ వైభవం రాజమండ్రి కవులకి ఎంత ముఖ్యమైనదో కంటితో చూసిన నా అనుభూతి సాక్షి వేరే గ్రంధాల్లో చదవాల్సిన అవసరాం లేదు, ఇప్పటికైనా రాజమండ్రి కవులతో మాట్లాడి వారి వారి అనుభవాలని గ్రంధస్థం చేసి భూవన విజయ రూపక వైభవాన్ని సంపూర్ణంగా చదువరులకి అందించాల్సింది గా ప్రార్ధన -- సహచరుడు