చర్చ:బాపు
స్వరూపం
బాపుగారి బొమ్మ ఏదో వెబ్ సైటులోదిలా ఉన్నది. ఆ వెబ్ సైటు పేరు కనపడుతున్నది. బాపుగారి బొమ్మ కోసం వారిని ఇ మైలు ద్వారా సంప్రదించి, వారిని ఒక బొమ్మ పంపమని కోరటం ఉత్తమం. వారి చిన్నప్పటి బొమ్మ మరియు ఇప్పటి బొమ్మ విడివిడిగా అప్‌లోడ్ చేస్తే బాగుంటుంది.--S I V A 14:54, 25 జనవరి 2009 (UTC)
జన్మస్థలం ఏది?
[మార్చు]ఫోటో కింద వివరాలలో ఈ తేడా సరిచేయండి:
- జననం డిసెంబరు 15,1933 చెన్నై, తమిళనాడు
స్వస్థలం కంతేరు, పశ్చిమ గోదావరి జిల్లా లోని ఇరగవరం,నర్సాపురం మండలాలు రెంటిలో ఏది?
- ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడు శ్రీ శంకు (వీరి గురించి ప్రత్యేక వ్యాసం మొదలు పెడుతున్నాను)దూరదర్శన్ కోసం స్వీయ దర్శకత్వంలో 'Eminent Cartoonists' అన్న ధారావాహిక తీశారు. వారు తీసిన ఆ ధారావాహికలో, బాపు గురించిన సి.డి పంపారు. ఆ సి.డి నుండి బాపుగారి చిత్రం సేకరించి, వ్యాసంలో పొందు పరచాను. సి.డి. పూర్తిగా అధ్యయనం చేసి, బాపు గురించిన మరింత సమాచారం వ్యాసంలో త్వరలో ఉంచగలను. బాపుగారి మీద తీసిన డాక్యుమెంటరీ సిడి పంపిన శంకు గారికి కృతజ్ఞతలు.--S I V A 06
- 10, 22 మార్చి 2009 (UTC)
స్నేహానికి మారు పేరు బాపు-రమణ కానీ ఈ వ్యాసం లో రమణ గారి గురించి చర్చించక పోవటం భాదాకరం.
వ్యాసం విభజన
[మార్చు]బాపు(చిత్రకారుడు), బాపు(దర్శకుడు) అని రెండు వ్యాసాలుగా విడగొడితే బాగుంటుందని నా అభిప్రాయం.--S I V A 06:07, 22 మార్చి 2009 (UTC)
- బాపుగారు ఇటు చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, అటు చిత్ర దర్శకునిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు గడించారు. వారి గురించి రెండు వ్యాసాలు, అంటే, బాపు (చిత్రకారుడు) మరియు బాపు (దర్శకుడు) అని విడివిడిగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ విషయాన్ని, వ్యాస చర్చలో చాలా కాలంకింద వ్రాశానుగాని, సభ్యులు ఎవరూ స్పందించ లేదు. మీరు ఒక సారి చూసి మీ అభిప్రాయం చెప్పగలరు.--S I V A 06:19, 22 మార్చి 2009 (UTC)
- అలా వ్రాయడం వ్యాసం నిడివిని బట్టి, అందులో ఉన్న విషయం లోతును బట్టి నిర్ణయించాలి. మీరు సూచించిన పేర్లు నాకు అంత సరి అనిపించడంలేదు. ఆ విధానం మనం ఇద్దరు వేర్వేరు వ్యక్తుల గురించిన పేర్లకు ఇంతవరకూ వాడుతున్నాము. మరింత సరైన విధానం అని నేను భావించేది ఏమంటే - బాపు, బాపు చిత్రకళ, బాపు చలనచిత్ర దర్శకత్వం అనే మూడు వ్యాసాలు ఉండడం ఉచితం. మొదటి వ్యాసం ప్రధానంగా వ్యక్తి జీవితం గురించి, తక్కినవి రెండూ టెక్నికల్‌గాను ఉండాలి. అయితే అలా వ్యాసాలు అభివృద్ధి చేయడం కష్టమే. ఏమైనా మీకు తోచిన విధానంలో ముందుకు వెళ్ళండి. తరువాత మార్చుకోవడం కష్టం కాదు గదా. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:09, 22 మార్చి 2009 (UTC)
ఈ వారం వ్యాసం పరిగణన
[మార్చు]వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- ఇంకా విలువకట్టని భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- ఇంకా విలువకట్టని తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- ఇంకా విలువకట్టని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు ప్రముఖుల వ్యాసాలు
- ఈ వారం వ్యాసాల చర్చలు - Y2016
- ఈ వారం వ్యాసాల చర్చలు - W50