చర్చ:నిజాయితీ
- నిజాయితీ వ్యాసాన్ని మొదట సృష్టించినది YVSREDDY
- YVSREDDY సృష్టించిన వ్యాసాన్ని ఎవరో దుర్మార్గంగా తొలగించారు. మంచి వ్యాసాలను తొలగించే విధానం తప్పు అని ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఈ వ్యాసాన్ని ఎప్పుడు ఎవరు మొదట సృష్టించారు. అందులో ఏమి సమాచారం ఉంది, అది ఎవరు తొలగించారు అనే విషయాలను తెలుసుకునే మార్గమే లేదు. కాని నేను సృష్టించిన ఈ వ్యాసంలోని సమాచారాన్ని దుర్మార్గంగా తొలగిస్తున్నారని తెలియడంతో నా ప్రత్యేక పేజీలలో భద్రపరచడం జరిగింది.
- వాడుకరి:YVSREDDY/నిజాయితీ పేరుతో 02:51, 20 మే 2020 న YVSREDDY గారు ఒక కొత్త పేజీ సృష్టించారు. నిజాయితీ వ్యాసం 2,329 బైట్లు తో ఉంది.
- YVSREDDY సృష్టించిన నిజాయితీ వ్యాసంలోని సమాచారం. ఈ క్రింది విధంగా వుంది.
- నిజమైన ఆయనంలో లేక అసలైన మార్గంలో నడుచుకోవడాన్ని నిజాయితీ అంటారు. నిజాయితీ అనేది నైతిక పాత్ర యొక్క ఒక విభాగాన్ని సూచిస్తుంది మరియు చిత్తశుద్ధి, యదార్ధం వంటి అనుకూల మరియు సద్గుణ గుణాలనే అర్థాన్ని ఇస్తుంది, అలాగే దురుసుతనం, అబద్ధం, మోసం, దొంగతనం వంటి దుర్గుణాలు లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా నిజాయితీ అంటే విశ్వసనీయత, విధేయత, నిష్పక్షపాతం, హృదయపూర్వకతనం కలిగి ఉండాలి. నిజాయితి అనేది అనేక జాతి మరియు మతపరమైన సంస్కృతులలో విలువైనదిగా ఉంది. తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసిన వ్యక్తి తన తప్పును తాను గ్రహించి సరిదిద్దుకొనే ప్రయత్నాన్ని నిజాయితీగా తన తప్పును తాను సరిదిద్దుకొంటున్నాడంటారు. నిజాయితీగా వ్యవహరించే వ్యక్తిని "నిజాయితీపరుడు" అంటారు.
బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక సామెత "నిజాయితీ అనేది ఉత్తమమైన విధానం"; థామస్ జెఫెర్సన్ కు ఆపాదించబడిన నాథానిల్ మకాన్ కు ఒక లేఖలో ఉపయోగించిన ఒక వ్యాఖ్య "నిజాయితీ అనేది జ్ఞానం యొక్క పుస్తకంలో మొదటి అధ్యాయం"
- ఎటువంటి తప్పులు లేని YVSREDDY/నిజాయితీ వ్యాసాన్ని తొలగించిన తరువాత
- 08:11, 20 జూన్ 2022 న Raomvss గారు నిజాయితీ వ్యాసాన్ని సృష్టించారు. అందులోని మొదటి వరుసల సమాచారం ఈ క్రింద
- నిజాయితీ ( సిన్సియారిటీ ) కల వ్యక్తులు ధర్మబద్ధంగా జీవననాన్ని కొనసాగిస్తూఉంటారు. తమ ఆకాంక్షలు, అభిప్రాయాలు, ఆలోచనలను సూటిగా, నిష్కల్మషంగాను వ్యక్తం చేస్తూ తదనుగుణంగా నిబద్ధత తో ప్రవర్తిస్తారు.
వ్యుత్పత్తి శాస్త్రం ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ, ఇంకా చాలా మంది విద్వాంసులు అభిప్రాయం ప్రకారం సిన్సియర్ నుండి సిన్సియారిటీ అన్న పదం వచ్చింది. లాటిన్ లో సిన్సిరస్ అంటే ఇంగ్లీషులో క్లీన్, ప్యూర్, అంటే శుభ్రమైన, సౌండ్ అనగా ప్రస్ఫుటమైన (1525–35) అనే పదాల నుండి ఉద్భవించిందని పేర్కొన్నారు. ఒకప్పుడు సిన్సిరస్ అంటే "ఒక ఎదుగుదల" (మిశ్రమం కాకుండా ఏకరీతిన ఎదగడం ),మరో రకంగా సిన్ - (ఒకటి) ; క్రెసెర్ (పెరగడం) అని అర్ధం. [1] క్రెసెర్-పెరుగుట అనేది ధాన్యం యొక్క దేవత అయిన " సెరెస్ "తో పోల్చుతూ "తృణధాన్యాలు" వలె పెరగడం అన్న అర్ధంలో వాడారు. [2]
అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ప్రకారం, [3] సిన్సిరస్ అనే లాటిన్ పదం ఇండో-యూరోపియన్ మూలమైన 'స్మొకిరోశ్ ' నుండి ఉద్భవించింది, స్మొకిరోశ్ అనేపదం సెమ్ ( ఒకటి ) యొక్క సున్నా- గ్రేడ్ కు 'కెర్ ' యొక్క పొడిగించబడ్డ ఇ గ్రేడ్ పదమైన కెయిర్ (పెరుగుట) ను కలుపుట ద్వారా ఉద్భవించింది. తద్వరా 'ఒకే పెరుగుదల ' అనే అంతరార్ధంతో స్వఛ్చమైన, పరిశుభ్రమైన అన్న అర్థాన్ని ధ్వనిస్తూ ఉంటుంది.
- అర్థవంతంగా YVSREDDY గారు నిజాయితీ వ్యాసాన్ని సృష్టిస్తే దాని తొలగించి ఈ విధంగా అర్థం కాని విధంగా వ్యాసాలను వ్రాయడం బాగాలేదు. కనుక మునుపు YVSREDDY గారు సృష్టించిన నిజాయితీ వ్యాసాన్ని పునఃస్థాపించగలరు. YVSREDDY (చర్చ) 07:00, 27 జనవరి 2023 (UTC)
YVSREDDY గారిచే సృష్టించబడి దుర్మార్గంగా తొలగించబడిన నిజాయితీ వ్యాసంలోని సమాచారం | 08:11, 20 జూన్ 2022 న Raomvss గారు సృష్టించిన నిజాయితీ వ్యాసంలోని మొదటి వరుసల సమాచారం ఈ క్రింద |
---|---|
నిజమైన ఆయనంలో లేక అసలైన మార్గంలో నడుచుకోవడాన్ని నిజాయితీ అంటారు. నిజాయితీ అనేది నైతిక పాత్ర యొక్క ఒక విభాగాన్ని సూచిస్తుంది మరియు చిత్తశుద్ధి, యదార్ధం వంటి అనుకూల మరియు సద్గుణ గుణాలనే అర్థాన్ని ఇస్తుంది, అలాగే దురుసుతనం, అబద్ధం, మోసం, దొంగతనం వంటి దుర్గుణాలు లేకపోవడాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా నిజాయితీ అంటే విశ్వసనీయత, విధేయత, నిష్పక్షపాతం, హృదయపూర్వకతనం కలిగి ఉండాలి. నిజాయితి అనేది అనేక జాతి మరియు మతపరమైన సంస్కృతులలో విలువైనదిగా ఉంది. తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేసిన వ్యక్తి తన తప్పును తాను గ్రహించి సరిదిద్దుకొనే ప్రయత్నాన్ని నిజాయితీగా తన తప్పును తాను సరిదిద్దుకొంటున్నాడంటారు. నిజాయితీగా వ్యవహరించే వ్యక్తిని "నిజాయితీపరుడు" అంటారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక సామెత "నిజాయితీ అనేది ఉత్తమమైన విధానం"; థామస్ జెఫెర్సన్ కు ఆపాదించబడిన నాథానిల్ మకాన్ కు ఒక లేఖలో ఉపయోగించిన ఒక వ్యాఖ్య "నిజాయితీ అనేది జ్ఞానం యొక్క పుస్తకంలో మొదటి అధ్యాయం" | నిజాయితీ ( సిన్సియారిటీ ) కల వ్యక్తులు ధర్మబద్ధంగా జీవననాన్ని కొనసాగిస్తూఉంటారు. తమ ఆకాంక్షలు, అభిప్రాయాలు, ఆలోచనలను సూటిగా, నిష్కల్మషంగాను వ్యక్తం చేస్తూ తదనుగుణంగా నిబద్ధత తో ప్రవర్తిస్తారు.
వ్యుత్పత్తి శాస్త్రం ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ, ఇంకా చాలా మంది విద్వాంసులు అభిప్రాయం ప్రకారం సిన్సియర్ నుండి సిన్సియారిటీ అన్న పదం వచ్చింది. లాటిన్ లో సిన్సిరస్ అంటే ఇంగ్లీషులో క్లీన్, ప్యూర్, అంటే శుభ్రమైన, సౌండ్ అనగా ప్రస్ఫుటమైన (1525–35) అనే పదాల నుండి ఉద్భవించిందని పేర్కొన్నారు. ఒకప్పుడు సిన్సిరస్ అంటే "ఒక ఎదుగుదల" (మిశ్రమం కాకుండా ఏకరీతిన ఎదగడం ),మరో రకంగా సిన్ - (ఒకటి) ; క్రెసెర్ (పెరగడం) అని అర్ధం. [1] క్రెసెర్-పెరుగుట అనేది ధాన్యం యొక్క దేవత అయిన " సెరెస్ "తో పోల్చుతూ "తృణధాన్యాలు" వలె పెరగడం అన్న అర్ధంలో వాడారు. [2] అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ప్రకారం, [3] సిన్సిరస్ అనే లాటిన్ పదం ఇండో-యూరోపియన్ మూలమైన 'స్మొకిరోశ్ ' నుండి ఉద్భవించింది, స్మొకిరోశ్ అనేపదం సెమ్ ( ఒకటి ) యొక్క సున్నా- గ్రేడ్ కు 'కెర్ ' యొక్క పొడిగించబడ్డ ఇ గ్రేడ్ పదమైన కెయిర్ (పెరుగుట) ను కలుపుట ద్వారా ఉద్భవించింది. తద్వరా 'ఒకే పెరుగుదల ' అనే అంతరార్ధంతో స్వఛ్చమైన, పరిశుభ్రమైన అన్న అర్థాన్ని ధ్వనిస్తూ ఉంటుంది. |
YVSREDDY గారిచే ముందుగా సృష్టించబడి తొలగించబడిన నిజాయితీ వ్యాసం పునఃస్థాపన చేసి దానిలో ఇటీవల సృష్టింపబడిన వ్యాసంలోని అదనపు సమాచారం చేర్చాలి. లేకపోతే వ్యాసం చరిత్ర చెడిపోతుంది. YVSREDDY (చర్చ) 07:32, 27 జనవరి 2023 (UTC)
- ఈ చర్చ సానుకూల దోరణిలో లేదు.కేవలం సముదాయ సభ్యులందరిని కించపరిచే వ్యాఖ్యలు వెలిబుచ్చటానికి, నిందారోపణలు చేయటానికి చర్చను మొదలు పెట్టినట్లుగా ఉంది."ఎవరో దుర్మార్గంగా తొలగించారు. మంచి వ్యాసాలను తొలగించే విధానం తప్పు అని ఏ ఒక్కరు మాట్లాడలేదు".అని ఈ చర్చలోని వాక్యం. ఇది సముదాయ సభ్యులందరిపై నిందారోపణ చేసినట్లుగా ఉంది.వైవిఎస్ రెడ్డి గారు ఈ వాక్యాలు ఉపసంహరించుకుని క్షమాపణ చేప్పేదాకా ఈ చర్చ కొనసాగకుండా పెండింగులో ఉంచాలని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 08:44, 27 జనవరి 2023 (UTC)
Raomvss గారు సృష్టించిన నిజాయితీ వ్యాసంలోని మొత్తం సమాచారం |
---|
ఒక స్త్రీ తను ఏమనుకుంటుందో తెలియచెప్పే సిల్హౌట్ డ్రాయింగ్ నిజాయితీ (సిన్సియారిటీ) కల వ్యక్తులు ధర్మబద్ధంగా జీవననాన్ని కొనసాగిస్తూఉంటారు. తమ ఆకాంక్షలు, అభిప్రాయాలు, ఆలోచనలను సూటిగా, నిష్కల్మషంగాను వ్యక్తం చేస్తూ తదనుగుణంగా నిబద్ధత తో ప్రవర్తిస్తారు.
అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ప్రకారం, [3] సిన్సిరస్ అనే లాటిన్ పదం ఇండో-యూరోపియన్ మూలమైన 'స్మొకిరోశ్ ' నుండి ఉద్భవించింది, స్మొకిరోశ్ అనేపదం సెమ్ ( ఒకటి ) యొక్క సున్నా- గ్రేడ్ కు 'కెర్ ' యొక్క పొడిగించబడ్డ ఇ గ్రేడ్ పదమైన కెయిర్ (పెరుగుట) ను కలుపుట ద్వారా ఉద్భవించింది. తద్వరా 'ఒకే పెరుగుదల ' అనే అంతరార్ధంతో స్వఛ్చమైన, పరిశుభ్రమైన అన్న అర్థాన్ని ధ్వనిస్తూ ఉంటుంది. వివాదం జానపద శబ్దవ్యుత్పత్తి శాస్త్రం ప్రకారం లాటిన్ సైన్ = కాకుండా, సెరా = మైనం నుండి సిన్సియర్ ఉద్భవించిందని ఒక ప్రతిపా దన. ఒక ప్రసిద్ధ వివరణ ప్రకారం, రోమ్ లేదా గ్రీస్‌లోని నిజాయితీ లేని శిల్పులు వారి పాలరాతి శిల్పాలలోని లోపాలను మైనంతో కప్పి ప్రజలను మోసగిస్తారని; ఆ కారణంగా, "మైనం లేని" శిల్పం మాత్రమే నిజాయితీని సూచిస్తుందని భావన. అంతకు ముందు రోజుల్లో " సిన్సియర్ వైన్" అనే పదాన్ని " కల్తీ చేయలేదని, లేదా అధునాతనమైనదని" ఒప్పించేందుకు గాను కొందరు ఉపయోగించేవారనేది ఒక అభిప్రాయం. మరొ కధనం ప్రకారం "గ్రీకుల మోసం, ద్రోహం బహుమతుల కథ" నుండి ఈ పదం వాడకం మొదలైంది. గతంలో రోమన్లు విజయం సాధించినందుకు, గ్రీకులు తమకు విధిగా బహుమతులు సమర్పించాలని రోమన్లు డిమాండ్ చేశారు. ఒక తప్పుడు సలహాను అనుసరించి, గ్రీకులు మైనం తో చేసిన కొన్ని నకిలీ పాలరాతి విగ్రహాలను ఇచ్చారు. ఇవి వెచ్చటి గ్రీకు ఎండలో వెంటనే కరిగిపోయాయి." [4] అయితే, ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం, "మైనం లేకుండా సైన్ సెరా - అన్న పాత వివరణలో ఎటువంటి సహేతుకత లేదు". మైనం లేని శిల్పాలు అన్న పదం - "1998 లో డాన్ బ్రౌన్ రచించిన థ్రిల్లర్ నవల డిజిటల్ కోటలో మైనర్ సబ్‌ప్లాట్‌గా ఉపయోగించడంలో "వితౌట్వాక్స్ " పదం ప్రాచుర్యం ప్రతిబింబిస్తుంది, అయితే బ్రౌన్ దీనిని లాటిన్ కు కాకుండా స్పానిష్ భాషకు ఆపాదించాడు, . తరువాత అతని 2009 నవల ది లాస్ట్ సింబల్‌లో ఈసారి లాటిన్‌కు ఈ పదం ఆపాదించబడింది. పాశ్చాత్య సమాజాలలో నిజాయితీ పదాన్ని తన నికోమాచియన్ ఎథిక్స్‌లో అరిస్టాటిల్ మొదట చర్చించాడు ఇది 17వ శతాబ్దంలోఇది "ఆదర్శంగా" ( ధర్మం ) యూరప్ , ఉత్తర అమెరికాలో రూపుదిద్దుకుంది. రొమాంటిక్ ఉద్యమం సమయంలో కళాత్మక , సాంఘిక ఆదర్శంగా ఇది గణనీయమైన ప్రత్యేకత సాధించింది. అమెరికాలో పంతొమ్మిదవ శతాబ్దపు మధ్య నుండి చివరి వరకు, నిజాయితీ మాట అలవాట్లు, కేశాలంకరణ, స్త్రీల దుస్తులు గురించి వివరించే సందర్భం లోను ఇంకా ఆ కాలపు సాహిత్యంలోను ఉపయోగించబడింది. సాహిత్య విమర్శకుడు లియూనెల్ త్రిల్లింగ్ వ్రాసిన -సిన్సియారిటీ అండ్ అథెంటిటీ అనే ఉపన్యాసాల లో నిజాయితీ, దాని మూలాలు, పరిణామం ఇంకా దాని నైతికత, ప్రామాణికత గురించి చర్చించారు. అరిస్టాటిల్ అభిప్రాయాలు అరిస్టాటిల్ అభిప్రాయంలో " నిజాయితీ లేదా నిష్కపటత్వంఅనేది ఆత్మన్యూనతకు ఇంకా మితిమీరిన అహంకారనికి మధ్య లోని ఒక సగటు స్థితి." ఇస్లామిక్ సాంప్రదాయల ప్రకారం, నిజాయితీ అంటే: ప్రాపంచిక విషయాల ప్రభావల నుండి విముక్తి పొందడం. అది కపటత్వానికి కూడా వ్యతిరేకం. [5] ఖురాన్‌లో, అన్నిరకాల ఆరాధనలు ఇంకా మానవ జీవన గమనం భగవంతుని సూచనలతో ప్రేరేపించబడాలి. జీవితంలోని అన్ని అంశాలలో నిజాయితీగల దాస్యాన్ని మనిషిని అవలంభించాలని దేవుని ప్రవక్తలు బోధించారు. ఇస్లాంలో నిజాయితీని విశ్వాసంలో చిత్తశుద్ధి ఇంకా కార్యాచరణలో చిత్తశుద్ధి అని విభజించడం జరిగింది. విశ్వాసంలో నిజాయితీ అనగా ఏకేశ్వరోపాసన ; దేవునితో భాగస్వాములను కలపడం చేయరాదు, [6] ఇంకా చర్యలో చిత్తశుద్ధి అంటే దేవుణ్ని మాత్రమే నిజాయితీగా ఆరాధించడం. [7] పాశ్చాత్య సంస్కృతికి భిన్నంగా, కన్ఫ్యూషియన్ సమాజాలలో ( చైనా, కొరియా , జపాన్ ) నిజాయితీ అనేది ఒక "ముఖ్య ధర్మంగా" అభివృద్ధి చెందింది. చెంగ్ (誠、诚) భావన — రెండు కన్ఫ్యూషియన్ క్లాసిక్‌లలో, డా జు , ఝాంగ్ యోంగ్‌లలో వివరించబడినట్లుగా — సాధారణంగా సిన్సియారిటీ అనగా నిజాయితీ అని అనువదించబడుతుంది. పాశ్చాత్య దేశాలలో వలె, ఈ పదం అంగీకారం ఇంకా అంతర్గత భావనల మధ్య సారూప్యతను సూచిస్తుంది, కాని అంతర్గత భావన ఆచార క్రమానికి సామాజిక పరిణామ క్రమానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుంది. ప్రత్యేకించి, కన్ఫ్యూషియన్స్ అనలెక్ట్స్ అధ్యాయం Iలో క్రింది ప్రకటనను కలిగి ఉంది: (主忠信。毋友不如己者。過,則勿憚改。) "విశ్వసనీయతను నిజాయితీ ని మొదటి ప్రాధాన్య సూత్రాలుగా ఉంచండి. అప్పుడు స్నేహితులు ఎవరూ మీలా ఉండరు (అందరూ మీలాగే విధేయులుగా ఉంటారు). తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి యేమాత్రం భయపడకండి." ఒక సమర్ధవంతుడు, వివేకవంతుడైన నాయకుడు ఇతర రంగాల నాయకులను "నిజాయితీపరులుగా" ప్రశంసిస్తాడు. వారు జీవితం లోని నాటకీయతను గ్రహించి అందులో తమ పాత్రను ఆ విధంగా పోషిస్తారు. జపనీస్ భాషలో చెంగ్ యొక్క అక్షరం మాకోటో అని ఉచ్ఛరిస్తారు. ఇది విశ్వాసపాత్రత ఇంకా నమ్మకం అనే భావాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తుంది., వార్విక్ డీపింగ్ రాసిన 1912 నవల సిన్సిరిటీ అని పిలువబడుతుంది. నిజాయితీ చిత్తశుద్ధి లేని ఆకర్షణ పర్రేసియా రాడికల్ నిజాయితీ కొత్త సిన్సియారిటీ |
YVSREDDY (చర్చ) 00:00, 2 ఫిబ్రవరి 2023 (UTC)
ఈ వ్యాసంలో దోషాలు
[మార్చు]- ఈ వ్యాసం నిజాయితీ గురించి, సిన్సియారిటీ గురించి కాదు. అంచేత సిన్సియారిటీ అనే మాటకు చెందిన వ్యుత్పత్తి రాయడం ఇక్కడ అనవసరం. వ్యుత్పత్తి రాయాల్సింది నిజాయితీ అనే మాటకు. ఆ విభాగాన్ని తీసెయ్యాలి.
- ప్రవేశికలో నిజాయితీ నిర్వచనాన్ని, వివరణలనూ రాసిన చోట మూలాల్లేవు.
- వ్యాసంలో ఇచ్చిన మూలాల్లో రెండు తప్ప మిగతావన్నీ సిన్సియారిటీ వ్యుత్పత్తికి సంబంధించినవే. ఆ విభాగాన్ని తీసేస్తే మిగిలే మూలాలు వ్యాసాన్ని వివరించేందుకు సరిపోవు.
- అనువాద దోషాలున్నాయి. మూలంలోని భావానికి వ్యతిరేకమైన అర్థాన్ని తీసుకువచ్చారు. ఉదా: అప్పుడు స్నేహితులు ఎవరూ మీలా ఉండరు (మూలంలో డబుల్ నెగటివు వాడారు. అనువాదకులు దాన్ని గమనించినట్టు లేదు.)
- భాష కృతకంగా ఉంది, సవరించాలి.