చర్చ:నిజామాబాదు పట్టణ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కొందరు కొత్త సభ్యులు ఈ వ్యాసంలో అంకెలను మారుస్తున్నారు. ఈ వ్యాసం ఆ సభ్యుడు చేరక చాలా కాలం నుంచే ఉన్నది. తెవికీలో ప్రవేశించిన ప్రతి సభ్యుడు తన వాదాన్ని వినిపిస్తూ వ్యాసాలను మారుస్తూ ఉంటే తెవికీ గమ్యం తప్పుతుంది. ఉన్న పద్దతికి భిన్నంగా పోవాలంటే ఇతర సభ్యుల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తగిన కారణం కూడా ఉండాలి. వ్యాసాలను అభివృద్ధిపర్చి తెవికీకి తోడ్పడాలి కాని ఒకరు చేసిన మార్పులను రద్దుచేయడం తగదు. నేను యధాస్థితికి చేశాను. సి. చంద్ర కాంత రావు - చర్చ 17:24, 20 ఆగష్టు 2010 (UTC)
- మీరు చేసిన దిడుభాటును రధుచేశాను, మీరు అనటుగా నేను అంకెలను మార్చి గందరగోళం ఏమి సృస్టించుట లేదు. తెవికిలో ఆంగ్ల అంకెల స్తానంలో తెలుగు అంకెలను చేర్చాను, ఈది మీకు ఇభందిగా వుంటే నేను ఏమిచేయలేను. తెలుగు బాష మరియు అంకెలకు విరుదముగా ప్రస్తుతము వున శైలి అంటూ బిన్నంగా వేలుతునది మీరే, కావున ఇతర సబ్యుల సహకారం నాకంటే మీకే ఎకువ అవసరము. తెవికిలో లేదా ఇంకే వికి ప్రాజెక్టులోని ప్రత్రి సబ్యుడు వ్యాసాలను మారిచే సౌలభ్యం వుంది, మరి ఇంకేకడ లేని ఇబంది ఇకడే వస్తుంది. ఆంగ్ల అంకెల స్తానంలో తెలుగు అంకెలు చేర్చి నేను వ్యాసాలను అభివృది పరిచాను కానీ అందువల తెవికి గమ్యం తపలేదు. --Ranjithsutari 10:58, 21 ఆగష్టు 2010 (UTC)
- మీరు అంకెలను మార్చి గందరగోళం ఖచ్చితంగా సృష్టిస్తున్నారు. మీకు ఎంతచెప్పిననూ అర్థం కావడం లేదు. ఇక్కడ తెలుగు అంకెలకు ఎవ్వరూ వ్యతిరేకం కాదు కాని అవి పాఠకులకు అర్థం కాకుండా ఉంటేయనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ వాడడం లేదు. తెవికీలో వ్యాసాలు రచించేది మనకోసం కాదు, మన వ్యాసాలను చూసి మనం మురిసిపోవడం అంతకన్నా కాదు. పాఠకులకు అర్థం కానప్పుడు మనం చేసే ప్రయత్నం ఖచ్చితంగా వృధానే. వ్యాసాలు వృద్ధిచేసేది ఏ ఒకరిద్దరిని దృష్టిలో ఉంచుకొని కాదు, లక్షలు, కోట్ల మంది తెలుగు వారిలో ఎందరికి తెలుగు అంకెలపై అవగాహన ఉందో తెలుసుకుంటే మంచిది. మీరు ఇక్కడ దిద్దుబాట్లు రద్దుచేయడం కన్నా ప్రజల్లో తెలుగు అంకెల వాడుక పట్ల చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తే సంతోషిస్తా. తెలుగు అంకెల వాడుక పట్ల ప్రజల్లో అవగాహన వస్తే ఒకటీ, రెండూ కాదు వేల వ్యాసాలు మార్పులకు లోనౌతాయి. ఈ రోజు మీ వాదన వినిపించి తెలుగు అంకెలు వేస్తారు, రేపు మరో ఎల్లయ్య వచ్చి ఇవేమి అంకెలు, అర్థం కాకుండా ఉన్నాయని చెప్పి మార్పుచేస్తాడు. ఈ మార్పులు చేర్పులు చేసి సంతోషించడం ( ! ? ) కన్నా కొన్ని నాణ్యమైన వ్యాసాలు రచించి తెవికీ/తెలుగువారికి తోడ్పడితే చాలు. సి. చంద్ర కాంత రావు - చర్చ 17:58, 21 ఆగష్టు 2010 (UTC)
- తెలుగు బాషలో అంకెలను వాడడం తప్పు కాదని కామెంట్ రాశారు. ఇక్కడ తప్పు ఒప్పుల గురించి ఎవ్వరూ చెప్పడం లేదు. చదువురాని పల్లె రైతు కూడా ఆంగ్ల అంకెలు గుర్తిస్తాడు. పట్టణ యువత తెలుగులో మాట్లాడుతూ ఫ్యాషన్ కొరకు మధ్య మధ్యలో ఆంగ్ల పదాలు ఉపయోగిస్తున్నట్లు కాదు కాని ఇది (ఆంగ్ల అంకెలు వాడడంలో) తెలుగు ప్రజలలో బలమైన ముద్ర పడింది. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:15, 21 ఆగష్టు 2010 (UTC)
- ఈ అంకెల గురించి గతంలో చర్చ జరిగినట్టు గుర్తు. వైజా ఎమన్నా చెప్పగలరేమో. నా ఓటు మాత్రం ఆంగ్ల అంకెలు వాడటానికే, తెలుగు అంకెలు వాడాలంటే అవి ఇంకా ప్రాచుర్యం పొందాలి, ఆ తరువాత ఏముంది అంతకు కావాలంటే బాటు ఉపయోగించి ఆంగ్ల అంకెలన్నీ తెలుగు అంకెలగా సులభంగా మార్చవచ్చు. తెలుగు అంకెలు ప్రాచుర్యం పొందేవరకు ఆంగ్ల అంకెలు వాడటమే వికికి మంచిది. Chavakiran 01:39, 22 ఆగష్టు 2010 (UTC)
- తెలుగు బాషలో అంకెలను వాడడం తప్పు కాదని కామెంట్ రాశారు. ఇక్కడ తప్పు ఒప్పుల గురించి ఎవ్వరూ చెప్పడం లేదు. చదువురాని పల్లె రైతు కూడా ఆంగ్ల అంకెలు గుర్తిస్తాడు. పట్టణ యువత తెలుగులో మాట్లాడుతూ ఫ్యాషన్ కొరకు మధ్య మధ్యలో ఆంగ్ల పదాలు ఉపయోగిస్తున్నట్లు కాదు కాని ఇది (ఆంగ్ల అంకెలు వాడడంలో) తెలుగు ప్రజలలో బలమైన ముద్ర పడింది. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:15, 21 ఆగష్టు 2010 (UTC)
- మీరు అంకెలను మార్చి గందరగోళం ఖచ్చితంగా సృష్టిస్తున్నారు. మీకు ఎంతచెప్పిననూ అర్థం కావడం లేదు. ఇక్కడ తెలుగు అంకెలకు ఎవ్వరూ వ్యతిరేకం కాదు కాని అవి పాఠకులకు అర్థం కాకుండా ఉంటేయనే ఉద్దేశ్యంతోనే ఇక్కడ వాడడం లేదు. తెవికీలో వ్యాసాలు రచించేది మనకోసం కాదు, మన వ్యాసాలను చూసి మనం మురిసిపోవడం అంతకన్నా కాదు. పాఠకులకు అర్థం కానప్పుడు మనం చేసే ప్రయత్నం ఖచ్చితంగా వృధానే. వ్యాసాలు వృద్ధిచేసేది ఏ ఒకరిద్దరిని దృష్టిలో ఉంచుకొని కాదు, లక్షలు, కోట్ల మంది తెలుగు వారిలో ఎందరికి తెలుగు అంకెలపై అవగాహన ఉందో తెలుసుకుంటే మంచిది. మీరు ఇక్కడ దిద్దుబాట్లు రద్దుచేయడం కన్నా ప్రజల్లో తెలుగు అంకెల వాడుక పట్ల చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తే సంతోషిస్తా. తెలుగు అంకెల వాడుక పట్ల ప్రజల్లో అవగాహన వస్తే ఒకటీ, రెండూ కాదు వేల వ్యాసాలు మార్పులకు లోనౌతాయి. ఈ రోజు మీ వాదన వినిపించి తెలుగు అంకెలు వేస్తారు, రేపు మరో ఎల్లయ్య వచ్చి ఇవేమి అంకెలు, అర్థం కాకుండా ఉన్నాయని చెప్పి మార్పుచేస్తాడు. ఈ మార్పులు చేర్పులు చేసి సంతోషించడం ( ! ? ) కన్నా కొన్ని నాణ్యమైన వ్యాసాలు రచించి తెవికీ/తెలుగువారికి తోడ్పడితే చాలు. సి. చంద్ర కాంత రావు - చర్చ 17:58, 21 ఆగష్టు 2010 (UTC)
- Chavakiran, మీకు చాల దన్యవాదాలు నేను తెలుగు అంకెలను తెవికిలో ఎలా చేర్చాలో సతమతము అవుతుండగా చాల మంచి సలహా ఇచారు, అదే బాటు సహాయంతో తెలుగు అంకెలను చేర్చడము. బహుశా ఈ అంకెలను మార్చడము ఇంతకంటే సులబమయ్న మార్గము లేదు.
- Chandra Kanth Rao, మీరు ఈకడ తపు-ఒప్పు, మంచి-చెడు లాంటివి మాట్లాడే టపుడు దయచేసి దానికి సంబంధిత వికీ policies ను చేపగలిగితే చాల బాగుంటుంది, అయితే నేను గందరగోళం సృష్టిస్తున అని అన్నారు బహుశా దానికికుడా వికి policies ను చేపగలిగితే బాగుండేది. నేను తెలుగు అంకెలను చేర్చుటకు ఉద్యమము చేయమని ఉచిత సలహా ఇచారు దీనికి కూడా వికి policies ను చేపగలిగితే బాగుండేది, లేని పక్షాన మీ వాదన మరియు మీ బావోద్వేగాలను మీవరకే పరిమితం చేసుకుంటే బాగుంటుంది.
- మీరు అన్నటుగ ఎల్లయాలు-ప్లుల్లయాలు అన్ని వికి ప్రోజేక్టులోను ఉనారు కానీ ఎవనికి లేని సమస్య తెవికికే వస్తుంది అంటే, నేను నమను. ఈకడ నేను తెవికీని కేవలం వికి సోదర ప్రోజేక్టులతోనే పోల్చగలను, ఎందు కంటే మీరు చెపిన లక్షలు, కోట్ల మంది తెలుగు వారితో కానీ వారి విజ్ఞానము-పరిజ్ఞ్యనముతో పోలచుట సాధ్యము కాదు ఎందుకంటే వారిలో ఎందరు తెవికి లేదా అంతర్జాలం(Internet) వాడుతారు, కనీసం కంప్యూటర్ ఎందరు వాడుతారు బహుశా ఈ link చుస్తే అర్తమవుతుంది.--Ranjithsutari 08:38, 22 ఆగష్టు 2010 (UTC)
- రంజిత్ గారూ, మీరు ఖచ్చితంగా వికీ పాలసీలు అడిగారు కాబట్టి చెబుతున్నా. 1) పదాలైనా, అంకెలైనా మరేదైనా వికీ వాడుకను ప్రతిఫలిస్తుంది, వాడుకకు దోహదం చెయ్యదు. 2) ఏ వికీకి ఆ వికీకి శైలి విషయాల్లో స్వయంనిర్ణయాధికారం ఉంది. మరే ఇతర వికీపీడియా పాలసీలతో సంబంధం లేదు. --వైజాసత్య 09:17, 22 ఆగష్టు 2010 (UTC)
- రంజిత్, నేను ఏమి రాస్తే మీరు ఏంఅర్థం చేసుకుంటున్నారు? రాయని దానికి పాలసి, పాలసి అంటున్నారు కాని ఉన్న పద్దతికి వ్యతిరేకంగా మార్పులు ఏ పాలసి ప్రకారం చేస్తున్నారు చెప్పగలరా? ఏకపక్షంగా మార్పులు చేయడానికి ఇదేమీ మీ సొంత బ్లాగు కాదు. కొత్త సభ్యుడు అని ఓపిక పడుతున్నాం. ఇలా అనవసరంగా వ్యాసాలలొ మార్పులు చేస్తూ, ఎన్నిసార్లు చెప్పిననూ వినకుండా (అర్థం అవుతున్నదో లేదో మరి ! ) ఇక్కడి సభ్యుల విలువైన సమయాన్ని వృధాచేస్తూ ఉంటే ఏమి చేయాలో దానికీ పాలసీలు ఉన్నాయి. తెవికీని సోదర వికి ప్రాజెక్టులతో పోల్చే పనిలేదు. ఎల్లయ్య, పుల్లయ్యల వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడ అనవసరం. తెవికీలో వ్యాసాలను వృద్ధిచేసి తోడ్పడాలని కాకుండా ఉన్న వ్యవస్థలో గందరగోళం సృష్టించాలనే ఇక్కడికి వచ్చినట్లు భావించవల్సి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 11:27, 22 ఆగష్టు 2010 (UTC)
- రంజిత్ గారూ, మీ పాయింటు నిరూపించుకోవటానికి వివిధ వ్యాసాల్లో అంకెలు మార్చేస్తున్నారు. వికీ నిర్వాహకులకు వాటిని రద్దు చేసే వీలుంది. మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తుకుంటున్నారు. ముందు ఈ పాలసీ, దీన్ని, దీన్నీ చదవండి. ఇంకా ఇలానే మొండిగా వ్యవహరిస్తే బహిష్కరణకు గురయ్యే అవకాశముంది. ఆ తర్వాత తెలుగు అంకెలు వాడుతుంటే నన్ను తెవికీలో నుండి బహిష్కరించారని చెప్పుకొని తిరుగుతారు. ఈ సినిమా ఇంతకు ముందు చాలాసార్లు చూసిందే. వైజాసత్య 17:18, 22 ఆగష్టు 2010 (UTC)
- పైన వైజాసత్య గారు ఇచ్చిన వివరణకు పూర్తిగా ఏకీభవిస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఈ సభ్యుడి ఏకపక్ష ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెవికీని వృద్ధి చేయాలనే అభిప్రాయం ఆ సభ్యుడికి ఏ కోశాన ఉన్నట్టు లేదు. వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, అతను కొత్తగా చేర్చినది ఒకేఒక్క వ్యాసం, అదీ పట్టిక రూపంలో, దాన్ని కూడా సొంతంగా వ్రాసాడా అంటే లేదు, అసెంబ్లీ వెబ్సైట్నుంచి కాపీ చేసి ఎక్కడో తర్జుమా చేసి ఇక్కడ అతికించాడు. పట్టికను చేర్చడానికి ప్రధాన ఉద్దేశ్యం తెలుగు సంఖ్యలు చేర్చాలనేదే కావచ్చు. మరో విషయం ఇతనికి తెవికీపై కంటె సోదర వికీ ప్రాజెక్టులపైనే మంచి అభిప్రాయం ఉన్నట్టుంది. అలాంటప్పుడు అతను ఇక్కడ ఏ ఉద్దేశ్యంతో వచ్చాడో క్రమక్రమంగా స్పష్టంగా అర్థమౌతోంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 17:50, 22 ఆగష్టు 2010 (UTC)
- Chandra kath Rao, Let us stick to point. వ్యక్తిగత దూషణలవైపు వెళ్లవద్దు. తెలుగు అంకెలు వాడకం గురించి రంజిత్ , రచ్చబండలో ఒక చర్చ మొదలు పెడితే బాగుంటుంది. అప్పటి వరకు అతను చేసిన మార్పులు రద్దు చెయ్యవచ్చు. Chavakiran 01:16, 23 ఆగష్టు 2010 (UTC)
- పైన వైజాసత్య గారు ఇచ్చిన వివరణకు పూర్తిగా ఏకీభవిస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఈ సభ్యుడి ఏకపక్ష ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెవికీని వృద్ధి చేయాలనే అభిప్రాయం ఆ సభ్యుడికి ఏ కోశాన ఉన్నట్టు లేదు. వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, అతను కొత్తగా చేర్చినది ఒకేఒక్క వ్యాసం, అదీ పట్టిక రూపంలో, దాన్ని కూడా సొంతంగా వ్రాసాడా అంటే లేదు, అసెంబ్లీ వెబ్సైట్నుంచి కాపీ చేసి ఎక్కడో తర్జుమా చేసి ఇక్కడ అతికించాడు. పట్టికను చేర్చడానికి ప్రధాన ఉద్దేశ్యం తెలుగు సంఖ్యలు చేర్చాలనేదే కావచ్చు. మరో విషయం ఇతనికి తెవికీపై కంటె సోదర వికీ ప్రాజెక్టులపైనే మంచి అభిప్రాయం ఉన్నట్టుంది. అలాంటప్పుడు అతను ఇక్కడ ఏ ఉద్దేశ్యంతో వచ్చాడో క్రమక్రమంగా స్పష్టంగా అర్థమౌతోంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 17:50, 22 ఆగష్టు 2010 (UTC)
- రంజిత్ గారూ, మీ పాయింటు నిరూపించుకోవటానికి వివిధ వ్యాసాల్లో అంకెలు మార్చేస్తున్నారు. వికీ నిర్వాహకులకు వాటిని రద్దు చేసే వీలుంది. మీరు అనవసరంగా సమయాన్ని వృధా చేస్తుకుంటున్నారు. ముందు ఈ పాలసీ, దీన్ని, దీన్నీ చదవండి. ఇంకా ఇలానే మొండిగా వ్యవహరిస్తే బహిష్కరణకు గురయ్యే అవకాశముంది. ఆ తర్వాత తెలుగు అంకెలు వాడుతుంటే నన్ను తెవికీలో నుండి బహిష్కరించారని చెప్పుకొని తిరుగుతారు. ఈ సినిమా ఇంతకు ముందు చాలాసార్లు చూసిందే. వైజాసత్య 17:18, 22 ఆగష్టు 2010 (UTC)
- తెగు మీద తెలుగు అంకెల మీద రంజిత్ సూత్రి గారికి ఉన్న అభిమానం మంచిదే కాని అది హద్దు మీరటం మాత్రం మంచిది కాదు. " అతి సర్వత్రా వర్జయేత్ " అన్న పెద్దల మాటను గుర్తు చేసుకూంటే పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. రంజిత్ సూత్రి గారు తెలుగు అంకెలను గురించి సమగ్ర వ్యాసము అందించవచ్చు. తెలుగు అంకెలను తన వ్యాసాలలో ఉపయోగించ వచ్చు కాని మిగిలిన వ్యాసాలలోని అంకెలను మార్చడం హద్దు మీరుటయే. తెలు అంకెలను సభ్యులు వారు ప్రత్యేకంగా రాసిన వ్యాసాలలో వారికి ఇషటం ఉంటే ఉపయోగించడం వరకే సబబుగా ఉంటుంది. మొత్తం తెవీకీ వ్యాసాలలో అది సాధ్యం కాదు. ప్రపంచం అంతా గుర్తింపు పొంది అత్యద్ధికుల నిత్య జీవితాలలో చోటు చేసుకున్న రోమన్ అంకెల వాడకం పూత్రిగా తేవీకీలో వాడకుండా ఉండడం సాధ్యం కాని పని కనుక ఈ విషయంలో చర్చ కొనసాగించడం నిరర్ధకం. తేవీకీ సభ్యుల మద్య సంయమనం చాలా అవసరం. ప్రారంభం నుండి తేవీకీ అభివృద్ధికి పాటు పడుతూ తమ విలువైన సమయాన్ని తేవీకీ కొరకు వెచ్చిస్తూ సేవలందిస్తున్న రవి వైజాసత్య గారిని నిందించడం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదు. తేవీకీ అధికారం సభ్యులకు కార్యభారమే కాని స్వప్రయోజనాలను అందించదు. అది రంజిత్ సూత్రి గారు అర్ధం చేసుకుని ఈ చర్చలను ముగించాలని కోరుకుంటుంన్నాను. ఇది రంజిత్ సూత్రి మీద ఉన్న అభిమానంతో చెప్తున్నాను. రంజిత్ సూత్రి సహృదయంతో అర్ధం చేసుకుని సంయమనం పాటించి తమ తెలుగు భాషాభిమానాన్ని తేవీకీ అభివృద్ధికి ఉయోగిస్తారని ఆశిస్తున్నాను.--t.sujatha 17:22, 23 ఆగష్టు 2010 (UTC)
- చర్చ ఎలాగూ రచ్చబండకు కదిలేట్టు లేదు కనుక నా అభిప్రాయం ఇక్కడే వ్రాస్తున్నాను. సుజాత గారు మీరు రంజిత్ గారి స్వంత వ్యాసాల్లో తెలుగు అంకెలు వాడవచ్చు అని అన్నారు, ఆ విషయంలో కూడా నాకు అభ్యంతరం ఉంది. వ్యాసాలన్నింటిలో రోమన్ అంకెలే వాడాలి అనేది నా ఉద్దేశ్యం. Chavakiran 01:22, 24 ఆగష్టు 2010 (UTC)
- ఇదే విషయంపై రంజిత్ గారి వాడుకరి పేజీలో జరిగిన చర్చను నేను వికీపీడియా:రచ్చబండ_(పాలసీలు)#తెలుగు అంకెలు లో కూడా అతికించాను. చూడండి --వైజాసత్య 02:12, 24 ఆగష్టు 2010 (UTC)
- చర్చ ఎలాగూ రచ్చబండకు కదిలేట్టు లేదు కనుక నా అభిప్రాయం ఇక్కడే వ్రాస్తున్నాను. సుజాత గారు మీరు రంజిత్ గారి స్వంత వ్యాసాల్లో తెలుగు అంకెలు వాడవచ్చు అని అన్నారు, ఆ విషయంలో కూడా నాకు అభ్యంతరం ఉంది. వ్యాసాలన్నింటిలో రోమన్ అంకెలే వాడాలి అనేది నా ఉద్దేశ్యం. Chavakiran 01:22, 24 ఆగష్టు 2010 (UTC)
నిజామాబాదు పట్టణ శాసనసభ నియోజకవర్గం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. నిజామాబాదు పట్టణ శాసనసభ నియోజకవర్గం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.