Jump to content

చర్చ:దక్షిణ తీర రైల్వే జోన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

చదువరి గారు, ఈ వ్యాస రచయిత తెలుగు భాష చాలా ఎబ్బెట్టుగా ఉంది. నేను దక్షిణ తీరం రైల్వే వ్యాసం విడిగా అన్ని అధికారికంగా జోను ఏర్పడిన తదుపరి వ్రాస్తాను. దయచేసి ఈ వ్యాసం గురించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి.JVRKPRASAD (చర్చ) 01:27, 2 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, అవును, భాషను సవరించాల్సి ఉంది. అయితే వ్యాసం ఎలాగూ మొదలు పెట్టారు, పెద్దగా పాఠ్యాన్ని చేర్చలేదు కాబట్టి, దీన్నే సవరిస్తే పోతుంది. ఎలాగూ మీరు రాయదలచారు కాబట్టి ఈ వ్యాసంలోనే సవరణలు చేస్తే సరిపోతుంది గదా! (నేనీ పేజీని యథాలాపంగా చూసాను. ఈ చర్చలో మీరు నా పేరు ఉదహరించినా.., నోటిఫికేషను రాలేదేంటబ్బా అని అనుకున్నాను. మీరు నా చర్చ పేజీని ఉదహరించారు. అందుచేత, నాకు నోటిఫికేషను రాలేదు. ) __చదువరి (చర్చరచనలు) 05:58, 2 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మీ స్పందనలకు ముందుగా ధన్యవాదములు. ఇప్పుడు ఈ జోను పేజీ దక్షిణ తీరం రైల్వే అని కూడా మార్చాలి. మీరు సూచించిన సలాహ సమంజసమే కానీ, పేరు మార్చాలి, ఇప్పటిలో ఈ జోను రూపుదాల్చటం, దాని పరిధి అధికారికంగా ఏర్పడటం వివరాలు, అసలు అమలులోకి వస్తుందా లేదా రాదా అనే వివరాలు చాలాకాలం పట్టవచ్చును. ఇది హడావిడిగా వచ్చిన జోను. రాబోయే రోజులలో ఎలక్షన్లు తదుపరి ఏర్పడే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీద ఈ జోను వివరాలు స్థిరమవుతాయి అని అనిపిస్తున్నది. ఈ పేజీ చూసి ప్రజలు పొరపాటు పడవచ్చును. ఖచ్చితంగా జోను వివరాలు అధికారికంగా అమలు అవుతుంటే మనము వ్యాసం పొందుపరిచితే బావుంటుంది అని నా అభిప్రాయం. JVRKPRASAD (చర్చ) 06:37, 2 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, పేజీని సరైన పేరుకు తరలించాను. మీ సందేహాలకు అనుగుణంగా పేజీలొ కొన్ని మార్పులు చేసాను. ప్రస్తుత ప్రభుత్వ ప్రకటనకు సంబంధించిన వివరాలు మాత్రమే ఉంచాను. మూలాలు చేర్చాను. పోతే రైలు మార్గాలకు సంబంధించిన సమాచారం కొంత పేజీలో ఉంది. దానికి సంబంధించి నా దగ్గర తగు సమాచారం లేదు కాబట్టి దాన్ని అలాగే ఉంచేసాను. __చదువరి (చర్చరచనలు) 10:06, 2 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, మీరు తెవికీ అధికారిగా ఈ వ్యాసాన్ని అధికారికంగా స్థిరీకరించి, మీరు మార్పులు చేసి, దారిమార్పు చేసి, సమాచారం చేరవేసి, మూలాలు ఉంచి, ధృవీకరించారు. కాబట్టి ఇందుకు కొత్త జోనుకు అనుగుణంగా పాత వ్యాసాలు మార్పులు చేయవలసి ఉన్నది, ఆ పని నేను ఒక్కడిని చేస్తాను. ఆందుకు మీరు అనుమతి నాకు ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను. JVRKPRASAD (చర్చ) 11:29, 2 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, "తెవికీ అధికారిగా" - నేను ఒక వాడుకరిగానే ఈ పని చేసాను. ఈ పని చెయ్యడానికి ఎవరూ అధికారి కానవసరం లేదు. "మీరు అనుమతి నాకు ఇవ్వమని"- అనుమతి ఎందుకు సార్? అసలా అవసరం ఏముంది? ఏ సంరక్షణా లేని ఓ వికీపీడియా విజ్ఞాన సర్వస్వ వ్యాసాన్ని అభివృద్ధి చెయ్యాలంటే ఎవరో అధికారి అనుమతి తీసుకోవాలనే నియమ నిబంధనలేమీ లేవు నాకు తెలిసి. అలాంటిది ఏదైనా ఉంటే సూచించండి, ఆ నియమం ప్రకారమే అనుమతి ఇస్తాను. __చదువరి (చర్చరచనలు) 13:35, 2 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, అధికారంలో ఉన్న ఎవరైనా మీలా అందుబాటులో ఉంటూ, ప్రోత్సహిస్తుంటే ఇతరుల నుండి నాలాంటి వారికి ఎటువంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా, మీరు అండగా ఉంటారన్న మానసిక ధైర్యం ముందు ఏర్పడి ఉంటుంది, అవసరమైతే ఆదుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది, అలాంటివి అనేకం పరిష్కరించినవి, మీరు చురుకుగా ప్రస్తుత కాలంలో ఉన్న దగ్గర నుండి అనేకం గమనించాను. నిజానికి (ఏ)ఒకరి అనుమతి అవసరం లేకపోయినా, కొందరి వల్ల అవసరం తప్పనిసరిగా మార్చే చర్చలు క్రింత కాలంలో నా విషయంలో అనుభవం అయ్యాక, జాగ్రత్తగా ఉంటున్నాను. ఏది ఏమయినా, మీ అభిప్రాయము తెలియజేసినందులకు చాలా సంతోషం, మీకు ధన్యవాదములు. JVRKPRASAD (చర్చ) 05:30, 8 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అయ్యా, JVRKPRASAD మీరు క్రొత్త పుట సృష్టిస్తే దానికి దక్షిణ తీరం రైల్వే అని కాక దక్షిణ తీర రైల్వే అని పేరు పెట్టండి. ఇది నా మనవి. Hydkarthik (చర్చ) 09:29, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
  • వాడుకరి:Hydkarthik గారూ, మీకు ఇదివరకు అనేకసార్లు చెప్పాం. మళ్ళీ చెప్తున్నాను - తెలుగు వికీపీడియాలో భాష వ్యవహారికంలోనే ఉండాలి. వికీపీడియా:శైలి/భాష ఒకసారి చదువుకుని రండి. మీరు ఎప్పటికప్పుడు ఆ నియమాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు. ఈ వ్యాసంలో చూస్తే, ఉండెను, బడును, ఉండును తరహాలో రాస్తున్నారు. ఇది తగదు. వ్యవహారికంలోనే రాయండి. తెలుగు వికీపీడియాకంటూ కొన్ని విధానాలు ఉన్నాయి, వాటిని అనుసరించి మార్గదర్శకాలూ ఉన్నాయి. వీటిని అమలుచేయాల్సిన క్రమంలో మీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతవరకు వెళ్ళకుండా దయచేసి ఇక్కడితో మీరు ఉద్దేశపూర్వకంగా గ్రాంథికం, సరళ గ్రాంథికం రాయడం మానండి. సాధ్యమైనంత వ్యవహారికం రాయండి. --పవన్ సంతోష్ (చర్చ) 03:33, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Pavan santhosh.s పవన్ సంతోష్ గారూ, వ్యావహారికం అంటే మాట్లాడేడప్పుడు వాడే పదములు. అవి ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగ వాడెదరు. నేను మాట్లాడేడప్పుడు ఉండెను, బడును, ఉండును అనియే మాట్లాడుదును. అవి ఒక ప్రాంతమునకును మరియొక ప్రాంతమునకును మారును. కనుక ఏయే పదములు/పద స్వరూపములు వాడదగినవో, ఏయే పదములు నిషేధితములొ దయచేసి ఒక పట్టికను రూపొందించుడి. ఉండును, ఉన్నవి, ఉన్నాయి, ఉన్నై వంటి పద స్వరూప అంతరములకు ఇంతటి రాద్ధాంతము చేయుచుంటిరి. వ్యావహారికమంటే అందరికి అర్థమగులాగున ఉంటే చాలు. ఉండును అని అన్నప్పుడు అర్థము కాకుండా పోదు. గమనించగలరు.Hydkarthik (చర్చ)Hydkarthik (చర్చ) 06:34, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
Hydkarthik మీరు సమాధానం చదివాకా రెండు విషయాలు చెప్తున్నాను:
1) వ్యవహారికం అంటే ఎలావుండాలన్న అంశంపై నేనిచ్చిన పేజీలో స్థూలమైన సూచనలు ఉన్నాయి. ""వెళ్ళుచుండెను" "వెళ్ళుచున్నాడు" "వెళ్తున్నాడు" వంటి క్రియాప్రయోగాలు భాషలో ఉన్నాయి." అన్నవి ఇచ్చి వెళ్తున్నాడు అని రాయాలని అందులో ఉంది. చదివి చూడండి. వ్యవహారికం అంటే మీరొక్కరూ మాట్లాడే మాటలు అని కాదు. ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మారే మాండలీక ధోరణిలో రాయమనీ కాదు. సాధారణంగా ప్రస్తుతం చలామణిలో ఉన్న "పత్రికల్లో రాసే భాషను అనుసరించాలి." అని అక్కడ ఇచ్చాం. అందుకు భిన్నమైన వికీపీడియా:ఏకవచన ప్రయోగం, కొత్తపదాలను సృష్టించరాదన్న నియమం వంటివి అక్కడే క్లుప్తంగా అందించాం. కాబట్టి అలా ముందుకుపోవాలి. పట్టిక రూపొందించడం గురించి మీరు అడగడానికి ముందు రూపొందించిన నియమాలను అనుసరించి తర్వాత కోరడం బావుంటుంది. మీరు పాలసీపై చర్చించడానికి ఆ పాలసీ చర్చ పేజీ వాడండి. అసలు నేను ఇచ్చిన లింకు చదివి ఉంటే మీరివన్నీ అడిగి, అక్కడున్నవాటినే నాతో మళ్ళీ చెప్పించుకునేవారు కాదు.
2) మరో ముఖ్యమైన సంగతి: గతంలో చెప్పినా ఇలా మళ్ళీ చేస్తున్నారని తెలిసినా, నేను మీకు విధానాలు తెలియకపోవడం రాయట్లేదని మీ వైపునుంచి సద్భావంతో లింకులు ఇచ్చి, వివరిస్తూంటే: "ఇంతటి రాద్ధాంతము చేయుచుంటిరి" అనడం ఏమీ బాగోలేదు. ఇది చర్చించే పద్ధతి కాదు. --పవన్ సంతోష్ (చర్చ) 07:28, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చర్చా పుటలోనుండును గాక. ఉండెను, ఉన్నది, ఉంది--ఇవి మారినంత మాత్రమున ఏదో ఉపద్రవము ముంచుకొచ్చినట్లు ఏందుకనుచూనారు? Hydkarthik (చర్చ) 07:43, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాకొక శైలి ఉండాలని అక్కడ నియమాలున్నాయి. మీరు నియమాలు అడిగారు, నేనిచ్చాను. ఉపద్రవం ముంచుకొచ్చిందో, లేదో అనవసరం. విధానాలు ఉన్నప్పుడు, ఉన్నాయని చెప్పినప్పుడు అనుసరించాలి. లేకపోతే ఎవరికి తోచింది వారు రాస్తారు, వికీపీడియా వ్యాసాలకొక రూపూ రేఖా ఉండవు. చర్చను ఇక వేరే దోవ పట్టించవద్దు. మీరడిగిన నిబంధనలకు, నేనిచ్చిన పేజీకి లంకె సరిపోయింది. అందులో నే చెప్పిన నియమాలు ఉన్నాయా లేదో చెప్పండి. ఆపైన అనుసరించండి, సరికాదు అనుకుంటే ఆ విధానపు చర్చా పేజీలో సమస్యలు లేవనెత్తండి. ఇంతే సంగతులు, చిత్తగించండి. --పవన్ సంతోష్ (చర్చ) 08:05, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

దక్షిణ తీర రైల్వే

[మార్చు]

చదువరి గారి చర్చా పేజీ లోని ఈ చర్చ [1] తదుపరి చర్చలు వ్యాస పేజీ లోనే చేయమని అయన సూచించడం వలన, ఇక్కడకు యదాతథంగా అతికించడ మైనదని వాడుకరులు గమనించ గలరు.


చదువరి గారు, దక్షిణ తీర రైల్వే వ్యాసంలో వాడుకరి:Hydkarthik గారు, కొత్త సమాచారం కొంత సమాచారం చేర్చారు. అందులో చరిత్ర విభాగంలో ఊహాతీతమైనది కూడా ఉన్నది. సరైన మూలాలు వాటికి లేవు. వీరు నాతో నేను నిర్వాహకునిగా ఉన్నకాలంలో రైల్వే వ్యాసాల విషయములో అనేక ఘర్షణలు పడి ఉన్నారు. అందువలన నా నిర్వాహకత్వం తొలగింపబడటానికి కారణంలో వీరిది ముఖ్య కారణంపాత్రగా కూడా ఉంది. కాబట్టి నేను వీరికి నేను ఏమి చెప్పినా అర్థం చేసుకోరు, పాత రైల్వే వ్యాసాలకు సరియైన లింకులు కూడా ఇవ్వరు, తిరిగి నాతో ఘర్షణకు దిగుతారు. దయచేసి వారు వ్రాసిన ప్రతి రైల్వే వ్యాస సమాచారాలను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి సరైన రీతిలో సలహాలు సూచనలు మీరు ఇవ్వవలసినదిగా కోరుతున్నాను. నాకు, తెవికీకి సంబంధించిన చర్చా, సలహాలు, సూచనలు, విషయాలు ఏవైనా, ఎప్పుడైనా ఉంటే మాత్రం, తప్పకుండా నా చర్చా పేజీలో ఒక కాపీ కూడా అవకాశం ఉంటే పెట్టండి.JVRKPRASAD (చర్చ) 02:46, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD అయ్యా JVRKPRASAD గారూ, దయచేసి ఊహాతీతమైన విషయమేమిటో తెలుపగలరు. తొలగించెదను లేక మార్చెదను. Hydkarthik (చర్చ)
చదువరి గారు, మీరు దక్షిణ తీర రైల్వే వ్యాసంలో చరిత్ర, పరిధి విభాగాలలో Hydkarthik వ్రాసిన వాక్యాలు సూక్ష్మంగా పరిశీలించండి. ప్రతి వాక్యానికి మూలం తప్పనిసరి. అలాగే మీకు అనిపించిన ఊహాతీతమైన వాక్యాలు ఉంటే మీరే వారికి తెలియజేయండి. నన్ను అయ్య, గారు అని సంభోదనలతో నేనంటే పెద్దల వంటి వారి మనసులో నా స్థానం చాలా చిన్నదిగా ఇంకా ప్రస్తుతం ఉన్నది కావున, నేను వివరించి చెప్పినా వాదనలు జరగవచ్చును అన్న అభిప్రాయముతో మధ్యవర్తిగా మిమ్మల్ని కలగజేసుకోమని విన్నవించుకుంటున్నాను.JVRKPRASAD (చర్చ) 06:30, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, మొదట చరిత్ర విభాగములో ఊహాతీతమైన అని అన్నారు. ఇప్పుడేమో చరిత్ర మరియు పరిధి రెంటిలోనూ ఊహాతీతములనుచున్నారు. సరిగా చెబితే సరిచేయుదును. మరొక్క మాట. ఆయన ఉద్దేశ్యము ఊహాతీతము కాదు. ఊహాజనితము.Hydkarthik (చర్చ) 06:54, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, నేను మిమ్మల్ని మొదట చరిత్ర విభాగం చూడమని అందులో విశాఖపట్టణం వరకు ఉన్న రైళ్ళన్నిటినీ భువనేశ్వర్ వరకూ తరలించడం వంటి చర్యలతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పక్షపాతంతో పనిచేస్తున్నదన్న అభిప్రాయం కలిగింది.' అనే ఊహాతీత వాక్యం గురించి చూడమని చెప్పాను. ఆ తదుపరి అన్ని విభాగాలు చూడమని చెప్పాను. అంటే పరిధి అనే విభాగంలో కూడా ఈ రైల్వే మండల ఏర్పాటునకు పూర్వము తూర్పు కోస్తా రైల్వే పరిధిలోనున్న వాల్తేరు రైల్వే విభాగము రెండుగా విభజింపబడి ఒక భాగము విజయవాడ విభాగములో విలీనము చేయబడును. మిగిలిన మార్గముతో రాయగడ కేంద్రముగా క్రొత్త విభాగము ఏర్పరచబడును. రాయగడ విభాగము తూర్పు కోస్తా రైల్వే మండలములో భాగముగానుండును. అనే వాక్యం కూడా ఊహాజనితం కాదా ? ఎందుకండి ఈ అనవసర చర్చలు ? నేను మీకు వ్రాస్తే దానికి నాకు జవాబు చెబుతున్నట్లు ఆయన వ్రాయడంలా ఉంది. మీరే వెంటనే కల్పించుకొని తగు సమాధానముతో చర్య తీసుకొనగలరు, లేదా ఎవరికయినా సరైన సమాధానం సూచించేలా చర్యలు తీసుకునేందుకు అయినా అవకాశం కల్పించ గలరు. ఈ పని వెంటనే చేయకపోతే అనవసర చర్చలకు దారి తీయవచ్చును, అందరి సమయం, శ్రమ వృధా అయ్యే అవకాశం ఉండవచ్చును. ఆయన కెవికీలో కన్నడ తెలుగు వర్గ విభాగం పెట్టి వ్రాయవచ్చునేమో ? JVRKPRASAD (చర్చ) 07:31, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, మీ అభ్యంతరాలను వివరంగా అ వ్యాసపు చర్చా పేజీలో రాయండి. అక్కడే చర్చ చేద్దాం.__చదువరి (చర్చరచనలు) 07:36, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారు, ఈ చర్చా విభాగం మొత్తం ఆ వ్యాసంలో ఒక విభాగంగా పోస్ట్ చేస్తాను. నేను అవసరమయితేనే తప్పకుండా అక్కడే మీతో స్పందిస్తాను.JVRKPRASAD (చర్చ) 07:50, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, భాష విషయమై ఇప్పటికే పైన Hydkarthik గారికి వివరించడమూ హెచ్చరించడమూ కూడా అయ్యాయి. ఇక ఊహాజనితమైనవని మీరనుకున్నవి ఊహాజనితం కావు. ఆ ముక్కకి నేను మూలాలిచ్చాను. పరిశీలించండి. ఒకవేళ ఏదైనా మూలాలు లేకుండా ఉంటే మూలాలు కావాలన్న మూస పెట్టండి సరిపోతుంది. ఎవరమైనా దిద్దవచ్చు. నాకు అర్థమైనంతలో ఈ కార్తీక్ గారితో సమస్య అంతా ఆయన భాష విషయంలోనే. --పవన్ సంతోష్ (చర్చ) 08:02, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారు, మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 08:06, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు,మీరు ఈస్ట్ కోస్ట్ జోన్ అని వ్రాశారు. దయచేసి దాన్ని తూర్పు కోస్తా రైల్వే అని మార్చండి. నాకు ఈస్ట్ కోస్ట్ జోన్ అంటే ఏంటో అర్థం అవ్వట్లేదు. దయచేసి అందరికి అర్థం అయ్యేలా రాయుండ్రి 08:25, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుక భాష

[మార్చు]

పవన్ సంతోష్ గారు, JVRKPRASAD గారూ, ఈ వ్యాస ప్రథమ భాగములో ప్రసాద్ గారు ఒక వివరణనిచ్చారు. అందులో ప్రెస్ మీట్ నందు అని అన్నారు. అందు/నందు మొదలగు పదములు గ్రాంథిక పదలుములుగా మీరిరువురు భావించుచున్నారా? లేక అవి వాడుక భాషాపదములా? అదే విధముగా వివరణ చివర్లో 'భావించ వలదు ' అని ఉంది. ఇది కూడా వ్యావహారికమేనా? 09:20, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది ఒక సమస్య, దీనికొక చర్చ అవసరమా ? సరిచేసాను.JVRKPRASAD (చర్చ) 12:24, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@Hydkarthik: అయ్యా, భాష ఎవరి సొత్తు చెప్పండి. JVRKPRASAD గారికైనా, నాకైనా శైలి ఉల్లంఘనలే జరగవా? జరుగుతాయి. మీరు దిద్దకూడదా? దిద్దవచ్చు. కానీ, నేను రాసినా, ప్రసాదు గారు రాసినా, మీరు రాసినా ఎవరు రాసినా ఉల్లంఘన ఉల్లంఘనే అవుతుంది, సరి సరే అవుతుంది. వికీపీడియానే అటువంటిది కదా. వ్యక్తిని బట్టికాదు రాసిందేమిటన్నది ఇక్కడ పాయింటు. ఇది మీమీదో మరెవరి మీదో వ్యక్తిగత దాడి కాదు, కారాదు. ఇది మీకు అర్థమైందనే అనుకుంటాను. ప్రసాదు గారు రాసిన వ్యాసాల్లో పొరబాటున గ్రాంథికం చోటుచేసుకుంటే మీరు హాయిగా దిద్దవచ్చు. నా వ్యాసంలో పొరబాటున అక్షరదోషాలుంటే సరిజేయనూ వచ్చు. మరిక శెలవు. --పవన్ సంతోష్ (చర్చ) 21:04, 23 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]