Jump to content

చర్చ:తెలుగు సినిమా చరిత్ర

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.



ఈ వ్యాసం కూడా ఉపయోగ పడుతుందేమో చూడండి: http://www.cinegoer.com/telugucinema.htm --నవీన్ 11:16, 12 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]


రచయిత ఎస్.వి.రామారావు

[మార్చు]

ఈ వ్యాసంలో అత్యధిక భాగం http://www.totaltollywood.com/articles/history/index.php?id=0 లో ఎస్.వి.రామారావు వ్యాసాన్నుండి తిన్నగా అనువదించాను. ఈ విషయం మెయిల్ ద్వారా వెబ్‌సైటు వారికి తెలియబరచాను. ఆ రచయిత గురించి అదే వెబ్ సైటులో ఉన్న పరిచయ వాక్యాలు క్రింద వ్రాస్తున్నాను.


About the Author:

S.V.Ramarao, the author of award winning book Telugu Tera, is a script writer, film journalist, and also master of ceremonies. One of the most knowledgeable persons about Telugu Films, S.V.Ramarao wrote hundreds of articles and film reviews for Yuvaraktam, Andhra Prabha, Andhra Bhoomi, India Today, and Mohini (Special book on Telugu films).


S.V.Ramarao graduated from C.R.Reddy college, Eluru. By profession, he was a sub-registrar. Cinema has been his passion from his childhood. He scripted, acted and conducted plays. He also acted in films such as Sriranga Neetulu, Kaliraja kai etc. He provided the script for movies like Kalavari Kutumbam, Triloka Sundari, Aata Bomma, Attamechina Alludu, Sukravaram Mahalakshmi and Ee Prashnaku Baduledi(Associate director). By 1961, he became a film journalist.


His work, Telugu Tera, bagged Nandi award in 1999. Telugu Tera gives a comprehensive history of Telugu Cinema from 1930s. He received good number of felicitations - Best Film Critic award by A.P.Film Circle, Best Film Journalist by A.P.Cine Goers Association, Madras Telugu Academy award for his knowledge in Telugu films and many more. He is awarded Cine Vignana Visarada by Dr. C.Narayana Reddy.


Presently he is a multifaceted cultural personality, having good rapport with cultural organizations. He also authored the biography of Sri Gummadi and he is working on many more.


Note: The author would appreciate your feedback and also if you are interested in acquiring a copy of his award winning Telugu Tera, please send a mail to admin@totaltollywood.com



ముందు ముందు ఈ వ్యాసానికి మరిన్ని మార్పులు, చేర్పులు జరుగవచ్చును. కాని ప్రస్తుతానికి ఇది దాదాపుగా ఎస్.వి.రామారావు వ్యాసానికి అనువాదమే. --కాసుబాబు 20:24, 17 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కథాపరంగా సినీ చరిత్ర

[మార్చు]

చలన చిత్రాలకు బలం ముఖ్యంగా కథే. ఎంత చెత్త సినిమా అయినా ఏదో ఒక కథంటూ ఉంటుంది మిగిలినవి (నటన, దర్శకత్వం వంటి అల్ప విషయాలు) ఏమీ లేక పోయినా సరే . మన సినిమా చరిత్ర చూస్తే ఈ క్రింది విధంగా విభచించవచ్చు-

  • పురాణ కథలు {నిజమైన పురాణ కథలు, కల్పిత పురాణ కథలు (మాయా బజార్)}
  • జానపదాలు( మాయలున్నవి, మాయలు లేనివి) {ఇవ్వాల్టి సాంఘికాలు, రేపటి జానపదాలవుతాయనుకుంటాను}
  • చారిత్రాత్మ చిత్రాలు (బొబ్బిలి యుద్ధం,అల్లూరి సీతారామ రాజు, తెనాలి రామ కృష్ణ)
  • సాంఘికాలు
  • క్రైమ్ సినిమాలు(అపరాధ పరిశోధక, కౌబాయ్(!) చిత్రాలన్నీ)
  • ప్రేమ కథలు
  • ఎర్ర సినిమాలు (మాదాల రంగారావు, నారాయణ మూర్తి)

మన తెలుగు చిత్ర చరిత్ర పరిశీలిస్తే, 75 సంవత్సరాల పైబడిన తరువాత కూడ (2008 సంవత్సరానికి)మంచి చిత్రాలు ఏమిటి అని ఒక జాబితా వ్రాయటానికి మొదలు పెడితే (వీరాభిమానాలూ గట్రా పక్కనపెట్టి)అతి కష్టం మీద 100 పైచిలుకు చిత్రాల కంటే రావు.

కాబట్టి, తెలుగు సినీ చరిత్ర పైన ఉదహరించిన వరవడితో ప్రారంబించి వ్రాయటం మొదలు పెడితే ఎలా ఉంటుంది. వ్యాసాన్ని సీదాగా మొదలు పెట్టవచ్చును. కాని తెలుగు సినిమా చరిత్ర అని ఒక అనువాద వ్యాసం ఇప్పటికే ఉన్నది. కాబట్టి ఈ వ్యాఖ్య చర్చలో వ్రాస్తున్నాను. సభ్యుల స్పందన అభిప్రాయాల ప్రకారం కొత్త వ్యాసమా, లేక ఈ వ్యాసంలోనె పై విషయాలు జొప్పించటమా నిర్ణయుంచవచ్చు.--SIVA 18:37, 14 డిసెంబర్ 2008 (UTC)

"ఎర్ర సినిమాలు" తోఆపేశారేమి? తరువాత ఇప్పుడు వస్తున్నవి "తలా తోకా లేని సినిమాలు" గదా? -

తెలుగు సినిమా చరిత్ర - కధ, కధనం పరిణామాలు - అని వ్యాసం మొదలు పెడితే బాగుంటుందనుకొంటున్నాను. పనిలో పనిగా కధనం లో వచ్చిన మార్పులు (స్క్రీన్ ప్లే, ఫైటులు, మాటలు, పాటలు వంటివి) కూడా కవర్ చేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:49, 14 డిసెంబర్ 2008 (UTC)

కాసుబాబుగారూ! నా ఉద్దేశ్యం నావ్యాఖ్య మొదటి వాక్యంలోనే చెప్పాను. ఎంతటి చెత్త సినిమాకైనా కథంటూ ఉంటుంది. కాబట్టి కథా పరంగా సినీ చరిత్ర వ్రాయగలిగితే, తెలుగు సినిమాలు ఏ విధంగా పరిణామం చెందినాయో చక్కగా వ్యక్త పరచవచ్చు. ప్రస్తుతపు సినిమాలు కూడ పైన చెప్పిన కథా విభాగాల్లోకి ముఖ్యంగా సాంఘిక, క్రైమ్, ఎర్ర సినిమాల కిందకు వస్తాయి.అంతకంటే మరే ఇతర విభాగాలు నాకు తోచటంలేదు. మీరన్నట్టు ఎంత తలా తోకా లేక పోయినా, సినిమాలంటూ వస్తున్నాయి వాటిలో కొన్ని నిజంగా బాగుంటున్నాయి. తలా తోకా లేక పోవటం ఈ కాలపు గుత్తాధిపత్యమేమీ కాదు. బ్లాక్ & వైట్ రోజులలో కూడ అనేక మూస సినిమాలు వచ్చి ప్రేక్షకుల్ని విసిగించి బాధించాయి. మన సినిమాలు కథా యుగంనుంచి, కథా నాయకుల యుగానికి దిగజారాయి. హీరోలు వారి అభిమాన సంఘాలు విధించే చట్రాలను అధిగమించే ధైర్యం ఏ నిర్మాతకీ, దర్శకునికీ లేదు. ఇప్పుడిప్పుడే, హీరొ, అతని కీర్తి ప్రతిష్టలు(!)లెక్కలోకి తీసుకోకుండా కొన్ని సినిమాలు కొంతమంది యువ దర్శకుల చేత తీయబడుతున్నాయి. కథా యుగం నుంచి దర్శకుల యుగానికి సినిమా అభివృద్ధి చెందటానికి ఇది మొదటి దశ కావచ్చు.

తెలుగు సినీ కథా చరిత్ర అని ఒక విభాగం ప్రస్తుతపు తెలుగు సినినిమా చరిత్ర లొనె ఎర్పరిచి వ్రాయటం మొదలు పెడితే ఎలా ఉంటుంది. వ్యాసంలొ ఒక విభాగం కాల పరిథి ప్రకారం దశాబ్దాల వారిగా సినీ చరిత్ర, మరొక విభాగం కథా పరంగా సినిమా చరిత్ర విశదపరచవచ్చు. తెలుగు సినిమా విషయం మీద చాలా వ్యాసాలు ఉన్నాయి. వీటన్నిటినీ విజ్ఞాన సర్వస్వం(encyclopedical)గా ఒక దానికొకటి సంధించి (లింక్ చేసి) తెలుగు సినీ చరిత్రను సమగ్రంగా చదువరులకు తెలియచేయవచ్చునని నా అభిప్రాయం--SIVA 23:13, 16 డిసెంబర్ 2008 (UTC)