Jump to content

చర్చ:తెలంగాణ అమరవీరుల స్మారకం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరు గురించిన చర్చ

[మార్చు]

దీన్ని తెలంగాణ అమరవీరుల జ్యోతి అనాలా? తెలంగాణ అమరవీరుల స్మారకం అనాలా? రెండోదే ఎక్కువ ప్రచారంలో ఉన్నట్టు నా గమనిక. ఇందుకోసం కోట్స్ పెట్టి సెర్చ్ చేస్తే తెలంగాణ అమరవీరుల స్మారకానికి 4,300కు పైగా ఫలితాలు వస్తే, తెలంగాణ అమరవీరుల జ్యోతికి 664కు పైగా ఫలితాలు వచ్చాయని గూగుల్ చెప్తోంది. ఇందులో ఏ పేరు ఉంచాలన్నదానిపై చర్చ ప్రారంభిస్తున్నాను. దయచేసి మీ సూచనలు చెప్పగలరు. పవన్ సంతోష్ (చర్చ) 05:18, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Pavan santhosh.s గారూ... నాకున్న సమాచారంమేరకు ప్రస్తుతానికి అధికారికంగా పేరు నిర్ణయం జరగలేదు అనుకుంటున్నా. ప్రారంభంలో 'తెలంగాణ అమరవీరుల జ్యోతి' అని కొన్ని పత్రికలలో చూసి ఆ శీర్షికతో వ్యాసాన్ని సృష్టించాను. అయితే, తెలంగాణ అమరవీరుల జ్యోతి అనేది నిర్థారణ పేరు కాదని ఈ గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలను చూస్తే తెలిసింది. మీరు చెప్పినట్టుగా 'తెలంగాణ అమరవీరుల స్మారకం' అనేది ప్రాచూర్యంలో ఉంది. ఈ విషయంలో మరికొంత స్పష్టత తీసుకొని వ్యాసపేరును మారుస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:09, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగే, తెలంగాణ ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆహ్వాన పత్రికలో పైన పెద్ద అక్షరాలలో 'అమరజ్యోతి' అని దాని కింద చిన్న అక్షరాలలో 'తెలంగాణ అమరుల స్మారకం' అని ఉంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:14, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pavan santhosh.s గారూ, దాని ముందర నిర్మించిన తోరణంపై ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ అని ఉంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:36, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985 గారూ, మన కామన్ నేమ్ పాలసీ ప్రకారం ఏ పేరైతే ప్రచారంలో ఉందో అదే వాడవలసి ఉంటుంది. పత్రికల్లో చూసినా, గూగుల్ చూసినా తెలంగాణ అమరవీరుల స్మారకం అన్నదే ఎక్కువగా కనిపిస్తోంది. తోరణంపై చూసినా కూడా ఆ పేరుతోనే ఉంది. కాబట్టి, నా అభిప్రాయంలో తెలంగాణ అమరవీరుల స్మారకం అని మార్చడమే సబబు. పవన్ సంతోష్ (చర్చ) 10:11, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
అలాగేనండీ @Pavan santhosh.s గారూ, ‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ అని మారుస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:36, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు @Pranayraj1985 గారూ! పవన్ సంతోష్ (చర్చ) 12:21, 22 జూన్ 2023 (UTC)[ప్రత్యుత్తరం]