చర్చ:జీవ ఇంధనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జీవ ఇంధనం వ్యాసం అబివృద్ధి గురించి

[మార్చు]

చదువరి గారూ ఈ ప్రాజెక్టు క్రింద జీవ ఇంధనం వ్యాసం అభివృద్ఝి చేయుట ఆరంభించాను.కొంత భాగం ఆంగ్ల వ్యాసం నుండి అనువదించగా జీవద్రవ్య ఇంధనాలు అనే మరొక వ్యాసం కనుగొనుట జరిగింది.ఈ రెండూ ఒకే కోవకు చెందిన వ్యాసాలు అనే సందేహం తలెత్తింది.విలీనం చేయవలసి ఉంటుందోమోనని అభిప్రాయం.జీవద్రవ్య ఇంధనాలు అనే వ్యాసం Palagiri గారిచే సృష్టించి దాదాపుగా పూర్తి అభివృద్ధి చేసిన వ్యాసం ఉంది.దీని వికీ డేటా లింకు పరిశీలించగా మరోక ఆంగ్ల వ్యాసం లేదు.జీవ ఇంధనం వ్యాసం కేవలం రెండు వాఖ్యాలుతో సృష్టించబడింది.దారి మార్పు చేస్తెే సరిపోతుందని నా అభిప్రాయం. సందేహం నివృత్తి చేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 15:48, 1 ఏప్రిల్ 2020 (UTC)

యర్రా రామారావు గారూ, రెండు వ్యాసాలూ ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. జీవద్రవ్య ఇంధనాలు పేజీలో సమాచారం బాగుంది, అదే ముందు తయారుచేసినది కూడా. నా అభిప్రాయం - జీవద్రవ్య ఇంధనాలు పేజీ లోకి జీవ ఇంధనం పేజీని విలీనం చెయ్యాలి. రివర్సులో చెయ్యరాదు. పేరు మాత్రం "జీవ ఇంధనం" సరైనదనిపిస్తోంది. జీవద్రవ్యం ఏమిటో నాకు తెలీలేదు. జాలంలో చూస్తే అది కణాల్లో ఉండే పదార్థమేదో నని అనిపించింది. ఈ సందర్భానికి సరిపోతుందో లేదో తెలీదు. పాలగిరి గారే చెప్పాలి. __చదువరి (చర్చ • రచనలు) 17:05, 1 ఏప్రిల్ 2020 (UTC)

యర్రా రామారావుగారూ, ఈ రెండు వ్యాసాలు ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. biomass అనగా జీవద్రవ్యం. కనుక రెండు వ్యాసాల శీర్సిక ఒక్కటే. శీర్షిక "జీవ ఇంథనం" అంటే బాగుంటుంది. కనుక విలీనం చేయవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 17:27, 1 ఏప్రిల్ 2020 (UTC)

సందేహం నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.ఈ రెండు వ్యాసాలును వెంకటరమణ గారిని పై అభిప్రాయాలకు అనుగుణంగా సరియైనరీతిలో సవరించగలందులకు కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 03:53, 2 ఏప్రిల్ 2020 (UTC)

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/వ్యాసాల అభివృద్ధి ఉద్యమం 2020 ఏప్రియల్ పేజీలో జరిగిన చర్చలను ఈ పేజీలో కూర్పు చేయటమైనది.--యర్రా రామారావు (చర్చ) 16:01, 15 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

రెండు వేర్వేరు వ్యాసాలని నా అభిప్రాయం

[మార్చు]

జీవ ఇంధనం (Biofuel - బయోఫ్యూయల్) అనగా కొత్తగా నిర్జీవమైన లేదా సజీవమైన జీవసంబంధిత పదార్థం నుంచి లభించే ఇంధనం. ఇది యెన్నాళ్ళ కిందటో మరణించిన జీవసంబంధిత పదార్థం నుంచి లభించే శిలాజ ఇంధనాలకు భిన్నమైంది. (YVSREDDY ప్రారంభించినది)

శిలాజ ఇంధనాకు ఉదాహరణ - డీజీల్, పెట్రోలు
జీవ ఇంధనం (Biofuel - బయోఫ్యూయల్) కు ఉదాహరణ - కొత్తగా నిర్జీవమైన లేదా సజీవమైన జీవసంబంధిత పదార్థం నుంచి లభించే పెట్రోలు వంటి ఇంధనం
జీవ పదార్థాలు లేదా జీవద్రవ్య ఇంధనాలు (biomass) కు ఉదాహరణ - వ్యవసాయ వ్యర్థాలు, కొ్య్య, బొగ్గు, పిడకలు వంటివి వివిధ జీవపదార్థం(బయోమాస్) వనరులు.

  • జీవద్రవ్య ఇంధనాలు ప్రారంభించిన పాలగిరి గారు ఏ విషయం తెలపకుండానే జీవ ఇంధనం వ్యాసాన్ని తొలగించిగారు. పాలగిరి గారు ఏదోఒక విషయం తెలిపిన తరువాత జీవద్రవ్య ఇంధనాలు కు జీవ ఇంధనం పేరు మార్చి ఉంటే బాగుండేది. YVSREDDY (చర్చ) 05:43, 17 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:K.Venkataramana గారూ YVSREDDY గారు వెలిబుచ్చిన అభిప్రాయాలపై స్పందించగలరు.జీవద్రవ్య ఇంధనాలుకు జీవఇంధనం అని పేరును పైన జరిగిన చర్చలకు అనుగుణంగా నేను మార్చాను. పాలగిరి గారు కాదు.ఏమైనా ఇంకా సవరణలు అవసరమైతే చేయగలరు.--యర్రా రామారావు (చర్చ) 05:45, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
"జీవ ఇంధనం", "జీవ ద్రవ్య ఇంధనం" అనే రెండూ ఒకే విషయానికి చెందినవి. ఈ లింకు ప్రకారం "Biofuel, any fuel that is derived from biomass—that is, plant or algae material or animal waste. Since such feedstock material can be replenished readily, biofuel is considered to be a source of renewable energy, unlike fossil fuels such as petroleum, coal, and natural gas." అని ఉంది పరిశీలించండి.--కె.వెంకటరమణచర్చ 06:53, 20 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]