చర్చ:జాన్ రిచర్డ్ హిక్స్
స్వరూపం
ఈ వ్యాసం తొలగించడం వల్ల తెవికీకి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందంటే తప్పకుండా తొలగించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:44, 24 మే 2020 (UTC)
- ఈ వ్యాసం నా తెలుగు విజ్ఞనసర్వస్వం బ్లాగులో చేర్చి అంతర్జాలంలో పాఠకులకు అందుబాటులో ఉంచాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:51, 24 మే 2020 (UTC)
- 2007 నుండి ఇప్పటికి ఈ వ్యాసం రెండు వరుసలు మాత్రమే. ఎటువంటి మూలాలు లేవు. 2013లో మనం ఆమోదించిన మొలకల నియంత్రణ విధానంప్రకారం దానిని తొలగించాలి. తెవికీలో ఏ వ్యాసం అనవసరంగా తొలగించడం నిర్వాహకుల ఉద్దేశ్యం కాదు. విస్తరించలేని, సమాచారం లభ్యం కాని వ్యాసాలు మొలకలుగా ఉండవచ్చని నా అభిప్రాయం. ఈ వ్యాసం 2007 నుండి అలాగే ఉంది. ఎవరూ విస్తరించలేదు. "ఇది తొలగించడం వలన వికీకి ఏదైనా ప్రయోజనం చేకూరుస్తుందంటే తప్పకుండా తొలగించవచ్చు" అని తెలియజేసారు. అవును, ప్రయోజనం చేకూరదు. కానీ ఈ రెండు వాక్యాలు గల వ్యాసాలను భవిష్యత్తులో ఇతర వాడుకరులు ప్రమాణంగా తీసుకొని విపరీతమైన మొలకలను సృష్టిస్తారు. మూలాలు లేని వ్యాసాలను పరిగణనలోకి తీసుకోవచ్చా? అందువలన మేము ఏప్రియల్ నెలలో అనేక వందల మొలక వ్యాసాలను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసాము. ఇందులో అందరి వాడుకరులు సృష్టించిన వ్యాసాలూ ఉన్నాయి. తొలగింపు మూస పెట్టడంలో ఉద్దేశ్యం దీనిని కొంతవరకు విస్తరించి మూలాలు చేరుస్తారని. నిర్వాహకులుగా మనం "మూలాలు లేకపోయినా ఫరవాలేదు. సమాచారం ఒకటి రెండు వాక్యాలు ఉన్నా ఫరవాలేదు" అని మనం సూచనలిస్తే చాలా మంది వాడుకరులు ఇలాంటి మొలకలను విపరీతంగా సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం అర్థంకాని గూగుల్ అనువాద వ్యాసాలను సృష్టిస్తూ, అనవసర వాదనలు చేస్తున్న వాడుకరులను చూస్తున్నాము. వ్యాసం శుద్ధి చేయండి అని అడిగితే మేము వ్యాసాలు ఎలాగో రాస్తూ పోతుంటాము, నిర్వాహకులుగా మీరు శుద్ధి చేయండి. అని ఒక వాడుకరి ప్రశ్నించాడు. ఎన్ని వ్యాసాలని నిర్వాహకులు సమీక్షించగలరు?
తెవికీ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఈ వ్యాసాన్ని విస్తరించాను. ప్రస్తుతం తొలగించనవసరం లేదు. తొలగింపు మూసను తొలగిస్తున్నను. K.Venkataramana(talk) 10:03, 24 మే 2020 (UTC)