చర్చ:జన సాహితితో మా విభేదాలు
స్వరూపం
Untitled
[మార్చు]అసలు ఈ వ్యాసం వికీపీడియాలో ఉండదగ్గదే కాదు. ఎక్కడ చూసినా విమర్శలు, విమర్శలు అంటూ తప్ప ఒక్క పాజిటివ్ అంశమూ లేదు. ఒకరిపైన ఒకరు చేసుకునే విమర్శల పర్వం. విజ్ఞానాన్ని పెంచేది కాదు. మిగతా సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించి అంగీకరిస్తే తుడిచివేయవచ్చు. రవిచంద్ర(చర్చ) 10:51, 19 డిసెంబర్ 2008 (UTC)
- ఈ అభిప్రాయంతో నేను కొంతవరకు విభేదిస్తాను. (1) జన సాహితితో మా విభేదాలు అన్న రచనే విమర్శనాత్మకమైనది గనుక దాన్ని గురించి వ్రాస్తే ఇలాంటి విషయాలే ఉంటాయి. (2) ఈ విషయాల గురించి అప్పట్లో పత్రికలలో నేను చదివాను కాని ఇప్పుడు వాటిని సంపాదించలేను. ఇది ఆ పుస్తకం గురించి వ్రాసిన unbalanced partial article గా భావిస్తాను. (3) అయితే "పాజిటివ్ అంశాలు" వ్రాయాలని నిబంధన లేదు. కాని పుస్తకం గురించిన విషయాలకంటే దాని పూర్వాపరాలు ఎక్కువ వ్రాశారు గనుక వ్యాసంలో తుల్యత లేదు. (4) రచయిత మూలాలు చూపలేదు గనుక అధిక భాగం తొలగించే అవకాశం ఉంది. (5) ఈ లోపాలు సరిదిద్దమని రచయితకు సూచిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:43, 19 డిసెంబర్ 2008 (UTC)
- తొలగించనవసరం లేదనిపిస్తుంది. కొంత చర్చ రెండు వైపుల నుండీ రచిస్తే సరిపోతుంది.Rajasekhar1961 11:45, 19 డిసెంబర్ 2008 (UTC)
- ఇప్పుడు మనకివన్నీ ఫ్రింజ్ అభిప్రాయాలు ( fringe views) గా అనిపిస్తున్నాయి కానీ అప్పట్లో ఆంధ్రదేశాన్ని ఇలాంటి భావజాలాలు ముంచెత్తాయన్న సంగతి మనకిప్పుడు స్ఫురణకే రాదు. ఇప్పుడివన్నీ ధృవీకరించాలంటే మళ్ళీ ఎవరో ఒకరు పుస్తకాన్ని చదవాలి, లేకపోతే భావజాలపు అద్దాలు తగిలించుకోకుండా చదివినవాళ్లనెవరినైనా పరిశీలించమనాలి. ఈ వ్యాసంలో నిజాలు లేవని నేనను కానీ కాసుబాబు గారన్నట్టు సమతుల్యత, శైలిలో దెబ్బతిన్నదనుకుంటా --వైజాసత్య 20:30, 19 డిసెంబర్ 2008 (UTC)
- కాసుబాబు గారు చెప్పింది కరెక్ట్. వ్యాసంలో పుస్తకంగురించి మృగ్యం. వ్యాసం పేరు చూస్తే ఒక పుస్తకం పేరు. వ్యాసంలోనేమో పుస్తకంలోని విషయాలగురించి వ్రాయనప్పుడు, ఇక ఆ వ్యాసం దేనికి???--SIVA 22:01, 24 డిసెంబర్ 2008 (UTC)