చర్చ:కామసూత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేను దీనిని నెమ్మదిగా అనువదిస్తాను. తొలగించవద్దు. రెంటాల గోపాలకృష్ణ రచించిన కామసూత్రాల తెలుగు అనువాదం అందుబాటులో ఉన్నది.Rajasekhar1961 16:43, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

అలాగే. మూస తీసేస్తాను. సాయీ(చర్చ) 16:51, 17 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

విస్తరణ అవసరం

[మార్చు]

కొంత పరిశోధన తర్వాత నేను తెలుసుకొన్నవి.

  • కామసూత్రాలు కేవలం రతికి సంబంధించిన కరదీపిక కాదు. ఇందులో వాత్సాయనుడు కామము గురించి ఎంత చర్చించాడో, ధర్మము, అర్థము, మోక్షముల గురించి అంతే విపులంగా చర్చించాడని.
  • కామము అనగా కేవలం లైంగిక వాంఛ కాదు, ఇంకా విశాలమైన దృక్పథంతో అర్థం చేసుకొనవలెనని.
  • తంత్రము, కామసూత్రాలు కేవలం లైంగిక సూచికలుగా మన సంకుచిత మనస్తత్వాలతో ముద్ర వేశామని. ఈ అర్థాలని మించి వాటిలో తెలుసుకొనవలసినవి చాలా ఉన్నవని. అవి తెల్పే విధంగా తెవికీలో వీటి వ్యాసాలు ఉండాలని.
  • హంగేరియన్ వికీ లో కామసూత్ర విశేష వ్యాసంగా గుర్తింపబడినదని (ఈ వ్యాసంలో పెళ్ళి, ఖజురహో శిల్పాల చిత్రపటాలు వంటివి సదభిప్రాయాన్ని కలిగిస్తాయి). తెవికీ వ్యాసం కూడా ఆ నాణ్యతాప్రమాణాలని చేరుకోవాలని, వీలయితే దానిని మించి పోవాలని.

నా ప్రయత్నంగా నేను తంత్ర దర్శనముని సృష్టించాను. నవ తంత్రము మెల్లగా విస్తరిస్తాను. కామసూత్రని కూడా విస్తరిస్తాను. ఈ వ్యాసాన్ని ఇక్కడి దాకా తీసుకువచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు - శశి (చర్చ) 17:46, 1 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]