చర్చ:కస్తూరిబాయి గాంధీ
స్వరూపం
వ్యాసం పేరు
[మార్చు]హిందీలోనూ, ఇంగ్లీషులోనూ ఈ వ్యాసం పేరు కస్తూర్‌బా గాంధీ అని ఉంది. కాబట్టి మనం కూడా ఆ పేరుకు తరలించాలా లేక తెలుగులో ఇలానే రాయాలంటారా? - రవిచంద్ర (చర్చ) 06:08, 9 ఏప్రిల్ 2021 (UTC)
- కస్తూరిబా గాంధీ అని తరలింపు చేయవచ్చును.అమె పేరుతో భారత ప్రభుత్వం కస్తూరిబా గాంధీ అని స్టాంపు విడుదల చేసింది.ఇదే పేరుతో హైదరాబాదులో మెమోరియల్ ట్రష్టు,పాఠశాలలు ఉన్నవి.కావున తరలింపు చేయవచ్చును. యర్రా రామారావు (చర్చ) 11:07, 9 ఏప్రిల్ 2021 (UTC)
- ఆంగ్ల వికీ శీర్షిక "కస్తూరిబా గాంధీ" అని ఉన్నది. కానీ వ్యాసం ప్రవేశికలో కస్తూరిబాయి అని కూడా ఉన్నది. వాస్తవ పేరు "కస్తూరిబాయి" లా ఉంది. రెండూ సరియైన పేర్లే. దేశంలో ఉన్న KGBV పాఠశాలల "కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ" గా నామకరణం చేసారు. కొన్ని సంస్థలకు, భారత తపాలా స్టాంపుపై "కస్తూరిబా" అని ఉన్నది. మహాత్మా గాంధీ తన ఆత్మ కథ my experiments with truth లో "kasturbai" అనే పదాన్ని ఉపయోగించారు. ఆ గ్రంథాన్ని తెలుగు అనువాదం చేసిన వేమూరి రాథాకృష్ణ మూర్తి ఆ అనువాద గ్రంథం సత్య్హశోధన లో "కస్తూరిబా" అనే పదాన్ని ఉపయోగించాడు. కనుక "kasturbai" అనే పదాన్ని ఉచ్ఛారణలో "కస్తూరిబా" గా చదువుతారనుకుంటాను. కనుక "కస్తూరిబా గాంధీ" పేరుకు తరలించవచ్చును.-- K.Venkataramana -- ☎ 12:11, 9 ఏప్రిల్ 2021 (UTC)
- ఆంగ్ల పదాలు గూగుల్ శోధనలో kasturibai gandhi కు 33,40,000, kasturbai gandhi 34,50,000, kasturiba gandhi కు 2,56,000, ఉంటే, తెలుగు శోధనలో "కస్తూరిబాయి గాంధీ" కి 3,70,000, "కస్తూరిబా గాంధీ" కి 42,30,000, "కస్తూర్బా గాంధీ" కి 35,30,000 ఫలితాలు ఉన్నాయి. కనుక తెలుగులో "కస్తూరిబా గాంధీ" కి దారిమార్పుతో తరలిస్తే బాగుంటుంది. -- K.Venkataramana -- ☎ 12:20, 9 ఏప్రిల్ 2021 (UTC)