చర్చ:ఆలమూరు (ఆలమూరు మండలం)
ఆలమూరు గ్రామ దేవత ఆవేదన
[మార్చు]ఆలమూరు గ్రామ దేవత ఆవేదన అయ్యా! నా పేరు రావులమ్మ నేను ఆలమూరు గ్రామ దేవతను ,ఆలమూరు గ్రామం తెలుగు వారికి పరిచయం చేయలేనట్టి గ్రామం. అయినప్పటికీ నా గ్రామ పుట్టుపూర్వోత్రాలూ మీకు నా ఆవేదన ద్వారా తెలియపరుస్తాను. నా గ్రామం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో గౌతమి గోదావరి నది వడ్డున National High Way 16 (జొన్నాడ)కు కేవలం రెండు కిలో మీటర్లు. మీకు తెలిసే ఉంటుంది చిన్నప్పుడు మనం చదువుకున్న చందమామ పుస్తకం నందు బేతాళకథల్లో బట్టివిక్రమార్కుడు శవం భుజం పై వేసుకొని శవంలో ఆవహించి ఉన్న బేతాలుడు, "రాజా, నీకు వినోదంగా ఉండటానికి ఒక కథ చెబుతాను విను" అంటూ ఒక కథ చెప్తాడు. కథ చివర ప్రశ్న వేసి, "ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పక పొయ్యావో, నీ తల పగిలి పోతుంది" అంటాడు. విక్రమార్కుడు తన మౌనం వీడి ప్రశ్నకు తగిన సమాధానం చెపుతాడు. ఆ విధంగా, విక్రమార్కుడికి మౌనభంగం జరగగానే, బేతాళుడు శవంతో సహ మాయవుతాడు.ఈ బేతళ కథ ధారావాహిక చందమామ పుస్తకంలో కొన్ని దశాబ్దాలు పాటు వచ్చింది. ఉజ్జాయనిని పాలించిన ఆ భట్టి విక్రమార్కుడు ద్వాపర యుగాంతంలో ఆలమూరు గ్రామమునకు వచ్చి శివాలయం నిర్మించినట్లు పురాణం గాధలు కలవు. ప్రపంచంలోనే భట్టి విక్రమార్కుడు స్థాపించిన భట్టి విక్రమార్క శివాలయం ఆలమూరు గ్రామంలో కలదు. నా గ్రామంలో ఎన్నో గుళ్ళు గోపురాలు కలవు.
- దేశంలో ప్రథమంగాఇక్కడే వ్యవసాయ సహకార ఉద్యమం నకు బీజం పడింది ఆలమూరు గ్రామంలోనే, ఇప్పటికి మార్కెట్ సెంటర్లో అతిపురాతన ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ భవనం కలదు
- ఆలమూరు గ్రామం 15 గ్రామాలకు మండల హెడ్ క్వార్టర్ గా కలదు, ఆనాడు బ్రిటీష్ వారు నిర్మిచిన ట్రెసరి, కోర్టు, తహశీల్దార్, పోలీస్ స్టేషన్ కార్యాలయ బిల్డింగ్ సముదాయంలోనే ఇప్పటికి ప్రభుత్వకార్యాలయాలు పనిచేస్తున్నవి. ఈ కార్యాలయాలు తరలించుకు పోవాలని చాలామంది ప్రయత్నించారు, కానీ నేను గ్రామతను నా గ్రామ వైభవంను కోల్పోనివ్వను. ఈ మద్యే నా గ్రామం నుండి Primary Health Nutrition Center తరలించుకు పోయారు... నాకు ఎంతో భాధ కలిగింది. బ్రిటీషు వారు కట్టిన ప్రభుత్వ కార్యాలయ కాంప్లెక్స్ ద్వారం వద్ద క్షేత్ర పాలకునిగా వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇప్పటికి ఉన్నాయి.కానీ వాటి ఆలనా పాలన లేక శిథిలం అవుచున్నాయి... నా బిడ్డలు(ఊరి ప్రజలు)కు అది పట్టదు.
- ఎందరో మహానుభావులు ప్రాఖ్యత సినీ రచయత, రవీంద్రనాధ్ ఠాగూర్ అవార్డ్ గ్రహీత పోలప్రగడ సత్యనారాయణ మూర్తి మరియు న్యాయవాది ,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత కవి,రచయత పోతాకూచి సాంబశివరావు నా బిడ్డలే (ఆలమూరు వాస్తవ్యులే)
- భారత దేశం అంతా స్వచ్ఛ భారత్ అని, క్లీన్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో పరిశుభ్రతలో పచ్చదనంలో పోటీ పడుచుంటే నా గ్రామంలో ఎక్కడ చూసినా దుమ్ము, చెత్త, డ్రైన్లు మురుగునీరు నిలిచి పరిసరాలు అపరిశుభ్రముగా ఉన్నాయి.ఎంతో చారిత్రక వైభవం గల నా ఊరు అపరిశుభ్రంగా ఉండడంతో ఎంతో ఆవేదన చెందుతున్నాను.
- నా బిడ్డలకు (ఊరి ప్రజలకు) ఒక్కటే చెప్పదలిచాను... ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని.. ఎదురు చడకండి... అధికారులు, ప్రజాప్రతినిధులు వస్తారు.. వెళతారు... కానీ ఈ ఊరు మనది.. మన ఊరిని మనమే బాగుచేసుకోవాలి .. స్వచ్ఛ ఆలమూరుకు శ్రీకారం చుట్టండి.. ఈసారి తిరునాళ్ళు పరిశుభ్రమైన వాతవరణం లో పచ్చని గ్రామ ముంగిట్లో జరగాలి...
నా ఆవేదన తీరుస్తారు కదూ...
ఇట్లు ప్రేమతో....మీ అమ్మ ...
రావులమ్మ, ఆలమూరు గ్రామదేవత తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఈ ఆర్టికల్ వ్రాసిన వారు ...గ్రామానికి నివసించకపోయాన మా ముత్తాత గారి ఊరు .. నా ఆలమూరు... Kakinada Venugopalarao (చర్చ) 06:59, 8 మార్చి 2018 (UTC)