Jump to content

చర్చ:అవధానం (సాహిత్యం)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికీప్రాజెక్టు సాహిత్యం ఈ వ్యాసం వికీప్రాజెక్టు సాహిత్యంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో సాహిత్యానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


ఈ విషయమై ఇక్కడ కొంత చర్చ జరిగింది. చూడ గలరు. ప్రస్తుతం క్రింది వ్యాసాలనుండి అవధానము వ్యాసానికి దార మళ్ళింపులు చేశాను.

అయితే ఇవి ఒక్కొక్కటీ ఒక్కొక్క వ్యాసంగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. కనుక "అవధానము" వ్యాసం నిడివి పెరిగినపుడు అయా విడి విడి వ్యాసాలుగా మళ్ళీ విభజించి, దారి మళ్ళింపులు తీసివేయవచ్చును.

అలాగే "అవధానులు" ప్రస్తుతం ఈ వ్యాసంలో ఒక విభాగంగా చేర్చాము. కాని వారిగురించి తగినంత సమాచారం ఉంటే ఒక్కొక్రి గురించి విడివిడి వ్యాసాలు వ్రాయవచ్చును. అలాంటి వ్యాసాలకు [[వర్గం:అవధానులు]] చేర్చండి. --కాసుబాబు 06:43, 28 మార్చి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును, వ్యాసంలో శతావధానం మరియు సహస్రావధానం విభాగాలు మరీ పెద్దవైపోయాయనుకున్నప్పుడు ప్రత్యేక వ్యాసాలుగా తీర్చిదిద్దవచ్చు. ప్రస్తుతానికి ఏమీ చెయ్యక్కర్లేదు. గణితావధానము మరియు పుష్పావధానము లాంటి విభాగాలు పెద్దగా విస్తరించే అవకాశం లేదని నాకనిపిస్తుంది. --వైజాసత్య 15:39, 7 ఆగష్టు 2007 (UTC)

@స్వరలాసిక and Bhaskaranaidu: అవధానము (సాహిత్యం) వ్యాసంలో అవధానుల జాబితాను ఒక పట్టికలో ఎక్కిద్దామని మొదలుపెట్టాను. అయితే, అలా మొదలుపెట్టి, చాలానే మార్పులు చేసాను. వ్యాసం స్వరూపం కూడా మారిస్తే బాగుంటుందనిపించింది. కొంత మార్చాను, ఇంకా చాలా మార్చాల్సి ఉంది. ఒకసారి చూస్తారా? నా ఉద్దేశంలో "అవధాన క్రమం" విభాగంలో మార్పుచేర్పులు చెయ్యాలి. "అవధానంలో అంశాలు" లో పాఠ్యాన్ని చేర్చాలి. మొతం వ్యాసంలోని భాషను ఏకరూపంలో ఉండేలా మార్చాలి. కొంత పాఠ్యాన్ని సంస్కరించాలి. నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరిల మధ్య తేడా గురించి రాయాలి. __చదువరి (చర్చరచనలు) 01:10, 30 ఆగష్టు 2016 (UTC)