చర్చ:అర్నేష్ కుమార్ వరకట్న వేధింపు వ్యాజ్యం
శశి గారూ, ప్రస్తుతం కోర్టులలో అనేక మైన 498a సెక్షన్ క్రింద కేసులున్నాయి.అవి ప్రతి రోజూ వందల సంఖ్యలలో నమోదవుతున్నాయి.వాటిలో కొన్ని నిజంగా గృహహింస అనుభవించే స్త్రీ కూడా పెట్టవచ్చు! లేదా మగవారిపై నేరారోపణ చేసి చట్టాల ముసుగులో బ్లాక్ మెయిల్ కూడా చేయవచ్చు! వారి ఉద్దెశ్యం ఎలా తెలుస్తుంది? ప్రతీ కేసులో స్త్రీ యొక్క తప్పు మాత్రమే ఉండదు కదా! కొన్నింటిలో ఉండవచ్చు! సమాజంలో ఎక్కువ శాతం మంది స్త్రీలు పురుషుల వల్ల బలైపోతున్నట్లు వార్తాకథనాలు వస్తున్నవి కదా! పురుషులపై స్త్రీల హింస కూడా ఉన్న కేసులున్నాయి. వాటితో పోల్చినపుడు ఈ శాతం తక్కువ. వాటిలో అనేకమైన కేసులు నేరారొపణ ఋజువు కానందున కొట్టివేయబడుతున్నవి. ఆ కేసులన్నింటికీ వ్యాసాలు అవసరమంటారా? ఒకవేళ స్త్రీ గెలిచిన పక్షంలో ఆ కేసును కూడా వికీలో చేర్చాలా? దయచేసి తెలియజేయగలరు. యిలాంటి కేసులు కోకొల్లలు అని గమనించగలరు.--కె.వెంకటరమణ⇒✉ 12:18, 20 జూలై 2015 (UTC)
- స్త్రీ అంటే ఎవరు? కేవలం భార్యేనా?
- అత్త, ఆడపడుచులు స్త్రీలు కారా?
- భార్యని రక్షించే చట్టాలే చట్టాలా?
- చట్టాలు అత్త రూపంలో/ఆడపడుచు రూపంలో ఉన్న మహిళలని రక్షించనవసరం లేదా? స్త్రీకి స్త్రీయే శత్రువా?
- వంటి అనేకానేక ప్రశ్నలకి చలించిపోయి, అత్యున్నత స్థానం అతి కీలకమైన తీర్పులని వెలువరించిన వ్యాజ్యాలు కావటంతోనే ఈ వ్యాసాలని చేర్చాను. ఈ వ్యాసం ఉండాలా? వద్దా? అనేది బహుశా ఇది పూర్తిగా విస్తరిస్తేగానీ ఒక అభిప్రాయానికి రాలేమని నా అభిప్రాయం. ప్రతి కేసుని చేర్చాలని నేను చెప్పను గానీ, కాలప్రవాహంలో మైలురాళ్ళ వంటి కేసులు, అవి జరిగిన సందర్భాలు తీరుతెన్నులని వివరిస్తే దుర్భేద్యంగా ఉన్న చట్ట/న్యాయవ్యవస్థలు సామాన్య మానవునికి మరింత చేరువౌతాయని నా ఉద్దేశ్యం. నా స్పందనని మరింత స్పష్టంగా చర్చ:శిల్పా రెడ్డి పతిహత్య వద్ద తెలియజేశాను. గమనించగలరు. - శశి (చర్చ) 17:57, 21 జూలై 2015 (UTC)
- శశి గారూ, కాలప్రవాహంలో మైలు రాళ్ళవంటి కేసులు చేర్చండి.మూలాలతో చేర్చితే నా కేమీ అభ్యంతరంలేదు. మీ కృషిని కొనసాగించండి. మీరెలా పై ప్రశ్నలకు చలించిపోయారో ఆ ప్రశ్నలకి నేను కూడా చలించిపోయాను. నిజజీవితంలో అనుభవించాను కూడా. సంచలనం సృష్టించిన కేసులపై వ్యాసాలు వ్రాయవచ్చు. కానీ ప్రతీ రోజూ కోర్టులో పురుషులకు అనుకూలంగా వచ్చిన ప్రతీ కేసును వికీలో చేర్చితే బాగుండదేమో అని నా అభిప్రాయాన్ని తెలియజేసాను. మీరు మీ కృషిని కొనసాగించండి. ధన్యవాదాలు.--కె.వెంకటరమణ⇒✉ 01:13, 22 జూలై 2015 (UTC)
- శశి గారూ, ఈ వ్యాసం తొలగించమంటారా? లేదా సరైన మూలాలను చేర్చి విస్తరించగలరా! తెలియజేయగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 02:48, 7 అక్టోబరు 2015 (UTC)
- కె.వెంకటరమణగారు, ఈ వ్యాసం గురించి ఇప్పటికే భర్త పట్ల క్రౌర్యం లో విపులంగా చర్చించాను. కావున మీరు ఈ వ్యాసాన్ని నిస్సంకోచంగా తొలగించవచ్చును. ఇదే కాక, నేనే సృష్టించి, నేనే తొలగింపు మూసలు ఉంచిన మనీషా పొద్దార్ వరకట్న వేధింపు వ్యాజ్యం (దీని గురించి కూడా భర్త పట్ల క్రౌర్యం లో విపులంగా చర్చించాను) మరియు శిల్పా రెడ్డి పతిహత్య (దీనిని భర్త పట్ల క్రౌర్యం లో ఒక మూలంగా పేర్కొన్నాను) వ్యాసాలను కూడా మీరు నిస్సందేహంగా తొలగించవచ్చును. నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. వీటిపై ఏ విస్తరణ అయినా ఆ వ్యాసంలోనే సంబంధిత సబ్ హెడ్ క్రింద చేపడతాను. సంప్రదింపుకు ధన్యవాదాలు! - శశి (చర్చ) 07:23, 7 అక్టోబరు 2015 (UTC)