Jump to content

చద్దన్నం

వికీపీడియా నుండి
(చద్ది నుండి దారిమార్పు చెందింది)

రాత్రికి తినడానికి వండుకున్న అన్నం తినగా మిగిలిన దానిలో నీరు లేక మజ్జిగను పోసి నానబెడతారు. దీనిని ఉదయాన తినేందుకు ఉపయోగిస్తారు. ఈ విధంగా రాత్రంతా నానబెట్టిన అన్నంను చద్దన్నం అంటారు.వండుకున్న అన్నం తినగా మిగిలిపోయిన అన్నం అయిదారు గంటల్లో చల్లబడి బ్యాక్టీరియా చేరి చద్ది అన్నం అవుతుంది.మరీ ఎక్కువ గంటలు అలానే ఉంచితే పాచి పట్టి పాడై పోతుంది. ప్రో బ్యాక్టీరియా చేరినా పాడై పోని తినదగిన చల్లటి మేలైన అన్నమే చద్దన్నం.ఇది వంటికి చలువ చేస్తుందని అంటారు.రైతులు పొద్దున్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని (పెరుగన్నం) తిని పొలం పనులకు వెళతారు.ఆకలి కాకుండా కష్ట జీవులను కొన్ని గంటలు ఆదుకునేది చద్దన్నం.కడుపులో అల్సర్లు రాకుండా చద్దన్నం కొంతవరకు అడ్డుకొంటుంది.

చద్ది

[మార్చు]

రాత్రి వండుకున్న అన్నంలో పాలను పోసి దానిలో చేమురు అనగా కొద్దిగా మజ్జిగ లేక పెరుగును పాలు తోడుకునేందుకు అనగా గడ్డ కట్టుకునేందుకు వేస్తారు. ఈ విధంగా పాలు పోయడం ద్వారా గడ్డ కట్టుకున్న పెరుగన్నంను చద్ది అంటారు. ఈ చద్దికి తిరగమాతవేస్తే దానిని దద్ధోజనం అంటారు.

సామెతలు

[మార్చు]

పెద్దల మాట చద్దన్నం మూట

చద్దన్నం తిన్నమ్మ మొగుడి ఆకలెరుగదు


ఇవి కూడా చూడండి

[మార్చు]

దద్దోజనం

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చద్దన్నం&oldid=3878028" నుండి వెలికితీశారు