చక్రి తోలేటి
స్వరూపం
చక్రి తోలేటి | |
---|---|
జననం | |
వృత్తి | భారతీయ సినిమా రచయిత దర్శకుడు నటుడు విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టు |
చక్రి తోలేటి భారతీయ సినిమా రచయిత, దర్శకుడు, నటుడు, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో పనిచేశాడు.[1][2] నీరజ్ పాండే 2008లో తీసిన ఎ వెన్స్ డే హిందీ చిత్రాన్ని 2009లో తమిళంలో ఉన్నిపోల్ ఒరువన్ పేరుతో, తెలుగులో ఈనాడు పేరుతో తీశాడు. దర్శకుడిగా చక్రికి ఇది తొలి సినిమా. 2012లో బిల్లా 2 అనే గ్యాంగ్ స్టర్ సినిమాకి దర్శకత్వం వహించాడు.[3][4]
జీవిత విషయాలు
[మార్చు]చక్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1983లో వచ్చిన సాగర సంగమం సినిమాలో తొలిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఆ తరువాత దాదాపు 14 సినిమాల్లో నటించాడు. సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఫిల్మ్, విఎఫ్ఎక్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. 2008లో వచ్చిన దశావతారం సినిమాతో మళ్ళీ దక్షిణ భారతీయ సినిమారంగంలోకి వచ్చాడు.
సినిమాలు
[మార్చు]దర్శకుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | నటులు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2009 | ఉన్నిపోల్ ఒరువన్ | కమల్ హాసన్, మోహన్ లాల్, దగ్గుబాటి వెంకటేష్ | తమిళం | |
2009 | ఈనాడు | తెలుగు | ||
2012 | బిల్లా 2 | అజిత్ కుమార్ | తమిళం | |
2018 | వెల్ కం టూ న్యూయార్క్ | సోనాక్షి సిన్హా, దిల్జిత్ దోసాంజ్ | హిందీ | |
2019 | కోలైయుతిర్ కలాం | నయన తార | తమిళం | |
2019 | ఖామోషి | తమన్నా, ప్రభుదేవా | హిందీ |
నటుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1983 | సాగర సంగమం | ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్ | తెలుగు | |
1985 | చిన్న వీడు | చక్రవర్తి | తమిళం | |
1985 | మయూరి | మయూరి సోదరుడు | తెలుగు | |
2008 | దశావతారం | సాయిరామ్ | తమిళం | |
2012 | బిల్లా 2 | గ్యాంగ్ స్టర్ | తమిళం |
మూలాలు
[మార్చు]- ↑ "Billa 2 - 25 days box office collection". Tamilcinema24. Archived from the original on 13 July 2015. Retrieved 11 April 2021.
- ↑ "Billa 2 Review - Tamil Movie Billa 2 Review". NOWRUNNING. Retrieved 11 April 2021.
- ↑ "Review : (2012)". www.sify.com. Retrieved 11 April 2021.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చక్రి తోలేటి పేజీ