Jump to content

చంద్రముఖి బసు

వికీపీడియా నుండి
చంద్రముఖి బసు
జననం1860
డెహ్రాడూన్ , బ్రిటిష్ ఇండియా
మరణం3 ఫిబ్రవరి 1944
డెహ్రాడూన్ , బ్రిటిష్ ఇండియా
విద్యాసంస్థస్కాటిష్ చర్చ్ కాలేజీ
కలకత్తా విశ్వవిద్యాలయం
వృత్తివిద్యావేత్త
జీవిత భాగస్వామిపండిట్ కేశ్వరానంద్ మంగైన్

చంద్రముఖి బసు (బెంగాలీ: চন্দ্রমুখী; 1860 - 1944 ఫిబ్రవరి 3) బ్రిటిష్ రాజ్యంలో భారతీయ మహిళా గ్రాడ్యుయేట్లు ఇద్దరిలో ఒకరు. ఆమె డెహ్రాడూన్కు చెందిన బెంగాలీ క్రైస్తవ మహిళ. ఆమె అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔధ్ లో ఉండేది. 1882లో కాదంబినీ గంగూలీ, చంద్రముఖిలు భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయం నుండి కళలలో బ్యాచిలర్ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. 1883 లో విశ్వవిద్యాలయం యొక్క కాన్వొకేషన్ సందర్భంగా వారి అధికారిక డిగ్రీలు అందజేశారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె భూబన్ మోహన్ బసు కుమార్తె. ఆమె 1880 లో డెహ్రాడూన్ స్థానిక క్రిస్టియన్ స్కూల్ నుండి ఫస్ట్ ఆర్ట్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.[1] ఆ సమయంలో ఆమె ప్రవేశించాలనుకున్న బెతున్ స్కూల్; హిందూయేతర బాలికలను ప్రవేశాలను ఇచ్చేవారు కాదు. అందువలన ఆమె రెవరెండ్ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఉచిత చర్చి సంస్థ (ఇప్పుడు స్కాటిష్ చర్చి కళాశాల) లో ఫస్ట్ ఆర్ట్స్ (F.A.) స్థాయిలో ప్రవేశించింది.[2] 1876 ​​లో లింగ వివక్ష గల అధికారిక వైఖరి కారణంగా ఆమె ఎఫ్.ఏ. పరీక్షకు హాజరు కావడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వవలసి వచ్చింది. ఆ సంవత్సరం పరీక్షకు హాజరైన ఏకైక అమ్మాయిగా ఆమె మొదటి స్థానంలో నిలిచింది. కాని ఆమె ఫలితాలను ప్రచురించవచ్చో లేదో నిర్ణయించడానికి విశ్వవిద్యాలయం వరుస సమావేశాలను నిర్వహించాల్సి వచ్చింది. కాదంబినీ గంగూలీకి ముందు చంద్రముఖి బసు 1876 లో ఆమె ప్రవేశ పరీక్షను పూర్తి చేసింది. అయినప్పటికీ విశ్వవిద్యాలయం ఆమెను విజయవంతమైన అభ్యర్థిగా ప్రకటించడానికి నిరాకరించింది. ఆమె తన ఎఫ్.ఏ. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత 1878 లో విశ్వవిద్యాలయం తీర్మానాన్ని మార్చినందువల్ల ఆమె తర్వాత విద్యనభ్యసించడానికి అవకాశం వచ్చింది[3][4]. ఆమె కాదంబినీ గంగూలీతో పాటు డిగ్రీ కోర్సు కోసం బెతున్ కాలేజీలో చేరింది.[1] ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తరువాత కలకత్తా విశ్వవిద్యాలయంనందు, 1884 లో బ్రిటిష్ సామ్రాజ్యం నుండి ఎం.ఏ ఉత్తీర్ణత సాధించిన ఏకైక (, మొదటి) మహిళగా గుర్తించబడింది.[1]

వృత్తి జీవితం

[మార్చు]

ఆమె 1886లో బెతునే కళాశాల (ప్రస్తుతం బెతునే స్కూల్‌లో భాగం) లో అధ్యాపకురాలిగా చేరి తన వృత్తి జీవితాన్ని ప్రారంభించింది. ఆ కళాశాల స్కూలు నుండి 1888లో విడిపోయింది.[5] ఆమె ఆ కళాశాలకు ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసింది. దక్షిణాసియాలో అండర్ గ్రాడ్యుయేట్ అకాడెమిక్ విద్యాసంస్థలలో మొదటి మహిళా అధిపతి గా గుర్తింపు పొందింది.

ఆమె 1891లో అనారోగ్యం వలన పదవీవిరమణ చేసింది. తన జీవితాన్ని డెహ్రాడూన్ లో గడిపింది.[5]

సోదరీమణులు

[మార్చు]

ఆమె సోదరీమణులు బిధుముఖి, బిందువాసిని కూడా సుపరిచితులు. బిదుముఖి బసు, వర్జీనియా మేరీ మిత్రా (నంది) 1890 లో గ్రాడ్యుయేషన్ చేసారు. వారు కలకత్తా మెడికల్ కాలేజీలో మొట్టమొదట వైద్య గ్రాడ్యుయేట్లయిన మహిలలుగా చరిత్రలో నిలిచారు. 1891లో బిందువాసిని కూడా కలకత్తా మెడికల్ కాలేజీ నుండి వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్ చేసింది.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Bose152 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 Bose, Anjali (editor), Sansad Bangali Charitabhidhan (Biographical dictionary) Vol II, 1996/2004,(in Bengali), p215, 219, ISBN 81-86806-99-7
  3. Manna, Mausumi, (2008) Women's Education through Co-Education: the Pioneering College in 175th Year Commemoration Volume. Scottish Church College, page 108
  4. "Teaching girls to take on an unequal society". The Telegraph, Calcutta. The Telegraph, 2 April 2013. Retrieved 2013-04-02.
  5. 5.0 5.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Bose1522 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు

బాహ్య లంకెలు

[మార్చు]