ఘటశ్రాద్ధ
స్వరూపం
ఘటశ్రాద్ధ | |
---|---|
దర్శకత్వం | గిరీష్ కాసరవల్లి |
రచన | యు.ఆర్.అనంతమూర్తి |
స్క్రీన్ ప్లే | గిరీష్ కాసరవల్లి |
దీనిపై ఆధారితం | యు.ఆర్.అనంతమూర్తి రాసిన ఘటశ్రాద్ధ నవల |
నిర్మాత | సదానంద సువర్ణ |
తారాగణం | మీనా కుట్టప్ప నారాయణ భట్ అజిత్ కుమార్ |
ఛాయాగ్రహణం | ఎస్. రామచంద్ర |
కూర్పు | ఉమేష్ కులకర్ణి |
సంగీతం | బి.వి. కారంత్ |
పంపిణీదార్లు | సువర్ణగిరి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 1977 |
సినిమా నిడివి | 108 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | కన్నడ |
ఘటశ్రాద్ధ, 1977లో విడుదలైన కన్నడ సినిమా. కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి రాసిన ఘటశ్రాద్ధ నవల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాకు గిరీష్ కాసరవల్లి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మీనా కుట్టప్ప, నారాయణ భట్, అజిత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.[1] భారతదేశపు 'న్యూ సినిమా' హోరిజోన్ లో కన్నడ సినిమా కూడా వచ్చింది.[2]
1977లో జరిగిన 25వ భారత జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ చలనచిత్రం, ఉత్తమ సంగీత దర్శకత్వం (బి.వి. కారంత్), ఉత్తమ బాలనటుడు (అజిత్ కుమార్) అవార్డులను గెలుచుకుంది.
2002లో జరిగిన సినిమా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నేషనల్ ఆర్కైవ్ ఆఫ్ పారిస్ చేత ఎంపిక చేయబడిన 100 సినిమాలోని ఏకైక భారతీయ చిత్రం ఘటశ్రాద్ధ.[3][4] 2009 అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 1.6 మిలియన్ ఓట్లను అందుకున్న 20 భారతీయ ఉత్తమ చిత్రాలలో ఒకటిగా ప్రకటించబడింది.[5][6]
నటవర్గం
[మార్చు]- మీనా కుట్టప్ప (యమున)
- నారాయణ భట్ (శాస్త్రి)
- అజిత్ కుమార్ (నానీ)
- రామకృష్ణ
- శాంత
- రామస్వామి అయ్యంగార్
- జగన్నాథ్
- బి. సురేషా
- హెచ్.ఎస్ పార్వతి
అవార్డులు
[మార్చు]- ఉత్తమ చలన చిత్రం
- ఉత్తమ సంగీత దర్శకత్వం - బి.వి. కారంత్
- ఉత్తమ బాల కళాకారుడు - అజిత్ కుమార్
- 1977–78 కర్ణాటక రాష్ట్ర సినిమా పురస్కారాలు
- ఉత్తమ చిత్రం
- ఉత్తమ కథ - యు.ఆర్.అనంతమూర్తి
- ఉత్తమ స్క్రీన్ ప్లే - గిరీష్ కాసరవల్లి
- ఉత్తమ బాల నటుడు - అజిత్ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ "Ghattashraddha (1977)". Indiancine.ma. Retrieved 2021-06-18.
- ↑ "southasiancinema". Archived from the original on 2011-07-16. Retrieved 2021-06-18.
- ↑ "Asiatic Film Mediale". asiaticafilmmediale.it. Archived from the original on 16 November 2008.
- ↑ "Girish Kasaravalli to be felicitated". The Hindu. 25 April 2011. Retrieved 2021-06-18.
- ↑ "Ghatashraddha, one of the 20 best movies". The Times of India. 4 December 2009. Retrieved 2021-06-18.
- ↑ https://www.thehindu.com/entertainment/music/a-film-festival-organised-to-celebrate-the-70th-birthday-of-girish-kasaravalli/article30185472.ece