Jump to content

ఘంటా మల్లికాంబ, రాఘవయ్య

వికీపీడియా నుండి
ఘంటా మల్లికాంబ
జననం
ఘంటా మల్లికాంబ

గుంటూరు జిల్లా, నర్సరావుపేట మండలం, లక్ష్మీపురం
వృత్తిగృహిణి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధురాలు
జీవిత భాగస్వామిరాఘవయ్య
పిల్లలురామ్మోహనరావు

రాఘవయ్య, మల్లికాంబ, పల్నాడు జిల్లా, నర్సరావుపేట మండలం, లక్ష్మీపురానికి చెందిన దంపతులు, ఇద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు. రాఘవయ్య వ్యవసాయ కుటుంబానికి చెందినవారి నుండి ఉద్బవించాడు. మల్లికాంబ మామ, రాఘవయ్య తండ్రి గాంధేయవాది.[1] దంపతులిద్దరూ అతనిని ఆదర్శంగా తీసుకుని గాంధీ ఆదర్శాలకు, సిద్దాంతాలకు లోనై రాఘవయ్య, మల్లికాంబ దంపతులు ఇద్దరూ స్వాతంత్ర్యోఉద్యమం బాటలో నడిచారు.

ఆసందర్బంగా జరిగిన పలు ఉద్యమాలలో పాల్గొన్నారు.దాని పలితంగా బ్రిటీషుపాలకులు అప్పటికి ఆరు మాసాలు కుమారుడుతో కలిగిఉన్న మల్లికాంబను తమిళనాడులోని వెల్లూరు కారాగారంలో, భర్త రాఘవయ్యను రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బందించారు. మల్లికాంబతో జైలు పాలైన అప్పటికి ఆరుమాసాల వయస్సుఉన్న కుమారుడు రామ్మోహనరావు వచ్చీరాని మాటలు, తప్పటడుగులు వెల్లూర్ సెంట్రల్ జైలులోనే నేర్చుకున్నాడు. రామ్మోహనరావు చిన్న పిల్లవాడు కావటాన జైలు సిబ్బంది అతనిపట్ల ప్రత్వేక శ్రద్ద తీసుకున్నారు.[1]

మల్లికాంబ ఆరోగ్యం

[మార్చు]

2015 జనవరి నాటికి మల్లికాంబకు 105 సంవత్సరాలు గడిచావి.[2]అయినా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏమీలేవు. అందరిలాగానే స్వీట్లు,  హాట్లు తింటుంది. ఇప్పటికీ ఆమెకు అందరి కుటుంబ సభ్యులతో కలసితింటుంది.105 ఏళ్ల వయసులోనూ కళ్లుబాగా కనిపిస్తున్నాయి. చెవులు వినిపిస్తున్నాయి.జ్ఞాపకాలు అలానే ఉన్నాయి.[1]

ప్రస్తుత నివాసం

[మార్చు]

మల్లికాంబ తన కుమారుడు, కోడలితో కలిసి ఆమె విశాఖపట్నం శివారు పరదేశిపాలెం దగ్గర నివసిస్తుంది.[1]

తామ్రపత్రాలను ప్రదానం

[మార్చు]

స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న రాఘవయ్య, మల్లికాంబల సేవలను గుర్తించి 1972 ఆగస్టు 15న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీరికి ప్రతిష్టాత్మక తామ్రపత్రాలను ప్రదానం చేసింది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Those memories are safe! - Sakshi". web.archive.org. 2021-10-03. Archived from the original on 2021-10-03. Retrieved 2021-10-03.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "At 104, she did not feel it a burden to vote". The Hindu. Special Correspondent. 2014-05-08. Retrieved 2021-10-09.{{cite news}}: CS1 maint: others (link)

వెలుపలి లంకెలు

[మార్చు]