Jump to content

గ్రేట్ మొగల్ డైమండ్

వికీపీడియా నుండి
గ్రేట్ మొగల్
గ్రేట్ మొఘల్ వజ్రం ప్రతిరూపం
బరువు280 క్యారట్లు (56 గ్రా.)
వెలికితీసిన దేశంభారతదేశం
వెలికితీసిన గనికొల్లూరు గని, ఆంధ్రప్రదేశ్

గ్రేట్ మొగల్ వజ్రం దక్షిణ భారతదేశంలోని గోల్కొండ ప్రాంతంలోని కోళ్లూరు గనుల్లో 1650 లో కనుగొని ఉండవచ్చని భావిస్తున్నారు. టావెర్నియర్ ఈ వజ్రాన్ని "ఒక గుడ్డును మధ్య నుంచి కోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది" అని వర్ణించాడు. [1]

చరిత్ర

[మార్చు]

రెండు కుటుంబాల మధ్య దౌత్యంలో భాగంగా 5 వ మొఘల్ చక్రవర్తి షాజహాన్కు 787 క్యారట్ల ఈ ముతక వజ్రాన్ని[2] ఎమిర్ జెమ్లా బహుమతిగా ఇచ్చాడు. [3] [4] జెమ్లా దీనిని "పరిమాణం లోను, అందంలోనూ అసమానమైనదిగా భావించే ప్రసిద్ధ వజ్రం" అని అన్నాడు. [5]

ఓర్టెన్సియో బోర్జియో అనే ఒక వెనిస్‌కు చెందిన రత్నాల కళాకారుడికి ఈ రత్నాన్ని కోసే పని అప్పగించారు. సంబంధ రాతి కట్ కేటాయించిన జరిగింది. గ్రేట్ మొగల్ వజ్రంలో అనేక మాలిన్యాలు ఉండేవని భావిస్తున్నారు. ఆ మాలిన్యాలు పోయేందుకు సాధారణంగా రాళ్ళను చిన్నచిన్ వజ్రాన్ని అనేక చిన్న చిన్న వజ్రాలుగా కోస్తారు. కానీ ఈ వజ్రాన్ని అలా కోసేందుకు బోర్జియో తిరస్కరించాడు. ఆ లోపాలు పోయే వరకు దాన్ని గ్రైండింగు చేసి మాలిన్యాల సమస్యను పరిష్కరించాలని అతడు నిర్ణయించుకున్నాడు. కానీ బోర్జియో మొత్తం పనిని చెడగొట్టి పెట్టాడు. వజ్రం బరువు కూడా బాగా తగ్గిపోయింది. షాజహాన్ గొప్ప సంయమనం చూపిస్తూ, బోర్గియో తల తీయకుండా వదిలేసాడు. దాని బదులు అతని అసమర్థతకు గాను అతనికి 10,000 రూపాయలు (అతని వద్ద ఉన్న మొత్తం డబ్బంతా అదే) జరిమానా విధించాడు. అయితే బోర్జియో ఈ వజ్రాన్ని కోసే ఈ కథ తప్పని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. క్రెమ్లిన్‌లోని కేథరీన్ ది గ్రేట్ యొక్క ఇంపీరియల్ రష్యన్ రాజదండంలో భాగమైన ఓర్లోవ్‌ వజ్రపు కథా ఇదీ కలిసిపోయాయి. [6]

1665 ప్రాంతంలో షాజహాన్ కుమారుడు, ఔరంగజేబు, ప్రసిద్ధ స్వర్ణకారుడు, ప్రపంచ యాత్రికుడూ అయిన జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ కు ఈ రాయి చూపించాడు. ఆ సమయంలో టావెర్నియర్ తన సిక్స్ వాయేజెస్‌లో ఇలా రాశాడు: "అకెల్ ఖాన్ (చక్రవర్తి ఆభరణాల అధికారి) నా చేతుల్లో ఉంచిన మొదటిది గొప్ప వజ్రం. ఇది గులాబీ కట్. గుండ్రంగా ఉంది, ఒక వైపు చాలా ఎత్తుగా ఉంది. దిగువ అంచున కొంచెం పగులు ఉంది. అందులో కొద్దిగా లోపం ఉంది. దీని నీరు బాగుంది. బరువు 319-1 / 2 రేటి లు, ఇది మా క్యారెట్లలో 280 అవుతుంది. ఒక రేటి అంటే క్యారెట్‌లో ⅞ వంతు." [7]

తరువాత, గ్రేట్ మొగల్ వజ్రాన్ని లాహోర్ సుబాకు తీసుకువెళ్ళారు. పర్షియన్ పాలకుడు నాదిర్ షా మొఘల్ ఇండియాపై దాడి చేసి, లాహోర్, ఢిల్లీలను ఆక్రమించినప్పుడు, అతడు దోచుకున్న సంపదలో ఇది కూడా ఉంది. 1739 లో నాదిర్ షా పంజాబ్ నవాబుల నుండి ఈ వజ్రాన్ని తన స్వస్థలం ఇస్ఫహాన్‌కు తీసుకువెళ్ళాడు. అయితే, నాదిర్ షా వద్ద ఇది ఉన్నది స్వల్పకాలమే. 1747 లో అతడు హత్యకు గురయ్యాడు. ఈ వజ్రం అదృశ్యమైంది.  

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Spring 1941, Important Diamonds of the World - The Great Mogul; Star of South Africa (or Dudley), Robert M Shipley, p. 143, 2pp.
  2. Spring 1941, Important Diamonds of the World - The Great Mogul; Star of South Africa (or Dudley), Robert M Shipley, p. 143, 2pp.
  3. "George John Younghusband - The jewel house : an account of the many romances connected with the royal regalia, Page 9". Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-24.
  4. http://www.langantiques.com/university/index.php/Great_Mogul_Diamond
  5. Orpen, Mrs. Goddard. Stories about Famous Precious Stones Boston: D. Lothrop Company, 1890. pp. 204
  6. "Koh-i-Noor: Six myths about a priceless diamond". BBC News. 9 December 2016. Retrieved 2 August 2018.
  7. Streeter, Edwin W. The Great Diamonds of the World: Their History and Romance London: George Bell and Sons, 1882. pp. 69-72

వెలుపలి లంకెలు

[మార్చు]