Jump to content

గ్రామ పంచాయితీ కార్యదర్శి

వికీపీడియా నుండి

గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికి, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయితీకి ఒక గ్రామ పంచాయితీ కార్యదర్శి పదవిని కేటాయించింది. ఇది 2002-01-01 నుంచి అమలులోకి తెచ్చింది.[1]

ఉద్యోగ విధులు

[మార్చు]
  • పంచాయితీ కార్యదర్శ గ్రామపంచాయితీ అధీనంలో పనిచేయాలి. [2]
  • గ్రామ సర్పంచ్‌ ఆదేశాల మేరకు పంచాయితీని సమావేశ పరచాలి.
  • గ్రామపంచాయితీ సమావేశాలు, ఇతర కమిటీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలి.
  • గ్రామ పంచాయితీ, కమిటీల తీర్మానాలను అమలుచేయాలి. ఒకవేళ కార్యదర్శి దృష్టిలో ఏదైనా తీర్మానం చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా, లేదా పంచాయితీరాజ్‌ చట్ట పరిధిని దాటి ఉన్నా లేదా ప్రజాభద్రతకు, జీవితానికి, ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే విధంగా ఉన్నా అలాంటి విషయాన్ని కమిషనరుకు తగు ఆదేశాల కోసం లేదా తీర్మానం రద్దు కోసం నివేదిక పంపించాల్సి ఉంటుంది.
  • ప్రభుత్వ, పంచాయితీ ఆస్తులకు, భూములకు రక్షణ కల్పించాలి. గ్రామ చావడిలను నిర్వహించాలి.
  • ప్రభుత్వ భూములను, భవనాలను ఇతర ఆస్థులు అన్యాక్రాంతం అయినప్పుడు లేదా ఇతరులు దుర్వినియోగం చేసినప్పుడు పైఅధికారులకు తెలియజేయాలి.
  • గ్రామపంచాయితీకి అవసరమైన రిజిస్టర్లు నిర్వహించాలి. పంచాయితీ పన్నులను సక్రమంగా నూటికి నూరుపాళ్లు వసూలు చేయాలి.
  • ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేయాలి. గ్రామ రికార్డులు, అకౌంట్లు సక్రమంగా సకాలంలో నిర్వహించాలి.
  • 100% పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ చేయాలి.
  • వివాహ ధృవీకరణ పత్రం, నివాసం, ఆస్థి విలువ, భూమి హక్కు సర్టిఫికేట్ (పహాణీ) జారీ చేయాలి.
  • కుల ధృవీకరణ, ఆదాయం, సాల్వెన్సీ సర్టిపికెట్లు ఇచ్చేసమయంలో ప్రాథమిక రిపోర్టు సమర్పించాలి.
  • ఏదైనా సర్టిఫికెట్టుకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేకపోతే నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి.
  • గ్రామంలో పారిశుధ్యాన్ని నిర్వహించాలి. రోజూ విధులు తనిఖీ చేసి, కనుగొన్న లోపాలను సిబ్బందితో సరిచేయించాలి.
  • గ్రామపంచాయితీ తన కర్తవ్యాలను నిర్వహించడంలో పూర్తి సహకారమందించాలి.
  • అగ్ని ప్రమాదాలు, వరదలు, తుపానులు, ఇతర ప్రమాదాలలో ముందు జాగ్రత్త చర్యలు, సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి సహకరించాలి.
  • అధీకృత ప్రకటన ద్వారా కనీసవేతన చట్టం 1948 ప్రకారం గ్రామపంచాయితీ సెక్రెటరీ ఇన్స్పెక్టరు హోదాలో కనీసవేతనాల అమలుకు చర్యలు తీసుకోవాలి.
  • జనన మరణాల రిజిష్టర్లను సంబంధిత చట్టం ప్రకారం నిర్వహించాలి.
  • సంబంధిత చట్టం ప్రకారం వివాహాలకు సంబంధించిన విధులను నిర్వహించాలి. వివాహాలను రిజిష్టర్లలో నమోదు చేయాలి. బాల్య వివాహాలు జరగకుండా చూడాలి. అట్లా జరిగితే పోలీసు రిపోర్టు ఇవ్వాలి.
  • లబ్ధిదారులను గుర్తించడంలోనూ, రుణాల పంపిణీ, వసూళ్లలోనూ గ్రామసభకు సహాయపడాలి.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001
  2. జి.ఓ.ఎం.ఎస్‌ నెం.4 పంచాయితీ గ్రామ శాఖ (మండల) శాఖ తేదీ : 7.1.2002

వెలుపలి లంకెలు

[మార్చు]