గ్నోమ్(GNOME)
గ్నోమ్ | |
---|---|
గ్నోమ్ 3.4 డెస్కుటాప్ | |
అభివృద్ధిచేసినవారు | గ్నోమ్ ప్రోజెక్టు |
మొదటి విడుదల | 3 మార్చి 1999 |
ప్రోగ్రామింగ్ భాష | C (GTK+) |
నిర్వహణ వ్యవస్థ | యునిక్స్ వంటిది |
భాషల లభ్యత | 166 భాషలలో |
ఆభివృద్ది దశ | క్రియాశీలము |
రకము | డెస్కుటాప్ పర్యావరణం |
లైసెన్సు | గ్నూ లెస్సర్ జనరల్ పబ్లిక్ లైసెన్స్ గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
వెబ్‌సైట్ | gnome.org |
జిఎన్ యు డెస్క్ టాప్ ఎన్విరోన్మెంటు కు చిన్న పేరు గ్నోమ్(GNOME). ఇది లినక్స్ నిర్వహణ వ్యవస్థ కొరకు వాడే ఒక డెస్కుటాప్ పరిసరం/గ్రాఫికల్ వాడుకరి అంతరవర్తి. మన కంప్యూటర్ తెర రూపం, దానిలోని మన పనికి అవసరమైన రకరకాల అనువర్తనాల సమూహమే ఇది. దీనిని "గ్నోమ్" లేదా "జినోమ్" అని పలుకుతారు. ఇది మెక్సికన్ ప్రోగ్రామర్లు అయిన మిగ్వెల్ డి కాజా, ఫెడెరికో మేన రూపొందించారు. ఇది పూర్తిగా ఉచిత, ఓపెన్ సోర్సు సాఫ్టువేరుపై ఆధారపడి రూపొందించబడింది. ఇది ఒక అంతర్జాతీయ యోజన ఇందులో భాగంగా సాఫ్టువేర్ అభివృద్ధి ఫ్రేమ్ వర్కులను సృష్టించడం, డెస్కుటాప్ కొరకు అనువర్తన సాఫ్టువేర్ ఎంచుకొనుట, అనువర్తన ప్రారంభించుట, దస్త్ర నిర్వహణ, విండో, కార్య నిర్వహణ వంటి వాటి పై పనిచేస్తుంది.
గ్నోమ్ గ్నూ యోజనలో భాగంగా ఉంది, దీనిని యునిక్స్ వంటి నిర్వహణ వ్యవస్థలతో వాడవచ్చు, ముఖ్యంగా లినక్స్, సొలారిస్ నందు భాగమైన జావా డెస్కుటాప్ వ్యవస్థ ఉపయోగించవచ్చు.
చరిత్ర
[మార్చు]1996 లో, కెడియి యోజన ప్రారంభమైంది. ప్రారంభం నుండే కెడియి ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ యోజన, కానీ గ్నూ యోజన సభ్యులు కెడియీ వారితో సంప్రదించగా వారు ట్రోల్టెక్ యాజమాన్యంలో ఉన్న ఒక జిపియల్ కాని Qt విడ్జెట్ ఉపకరణసామాగ్రి పై ఆధారపడటం గురించి ఆలోచించారు. ఆగస్టు 1997లో, ఈ సమస్యకు రెండు యోజనలు ప్రతిస్పందనగా ప్రారంభించారు: హార్మోనీ ఉపకరణసామాగ్రి క్యూటి లైబ్రరీలకు ఒక ఉచిత ప్రత్యామ్నాయం, నోమ్ క్యూటి వాడని ఒక విభిన్న డెస్కుటప్ ఇది జిటికె+ పై నిర్మించబడి, గ్నూ లెస్సర్ జనరల్ పబ్లిక్ లైసెన్సు కింద లైసెన్సు చేయబడింది. ఒక ఉచిత సాఫ్టువేర్ జిపియల్-అనుకూలత లేని సాఫ్టువేరుతో దీన్ని లింక్ చేయడానికి అనుమతిస్తుంది. నోమ్ డెస్కుటాపు దానికదే లైబ్రరీల కొరకు ఎల్ జిపియల్ క్రింద లైసెన్సు చేయబడింది, నోమ్ యోజనలో భాగంగా ఉన్న అనువర్తనాల కోసం జిపియల్ లైసెన్స్ వాడారు. ఉపకరణసామాగ్రి, లైబ్రరీలు ఎల్ జిపియల్ లైసెన్సు క్రింద లభించబడం వలన నోమ్ కొరకు వ్రాయబడిన అనువర్తనాలకి విసృతమైన లైసెన్సులను వాడవచ్చు (యాజమాన్య సాఫ్టువేర్ లైసెన్సులు కూడా). మిగ్వెల్ డి కాజా, ఫెడెరికో మేనలు నోమ్ ప్రాథమిక యోజన నాయకులు.
2000 లో, క్యూటి గ్నూ జిపియల్ షరతుల క్రింద అందుబాటులో ఉంచారు. ట్రోల్టెక్ క్యూపియల్ షరతులు, గ్నూ జిపియల్ లైసెన్సుల క్రింద ద్వంద్వ లైసెన్సింగ్ ఆఫర్ చేసాడు, అపాచీ వంటి ఇతర ప్రత్యేక లైసెన్సుకు మినహాయింపులు అనుమతించాడు. క్యూటీ గ్నూ జిపియల్ లైసెన్సు ఉద్భవించినప్పటికీ, అనియత యాజమాన్య సాఫ్టువేరుతో క్యూటీని జతచేయుట పై ఆంక్షలు కొనసాగించింది. జిటికె+ యొక్క ఎల్ జిపియల్ లైసెన్స్ ఈ నియంత్రణ విధించలేదు. 2000 సంత్సరం చివరిలో, హార్మొనీ యోజనను నిలిపివేసారు, ఇకపై కెడియి ఏ మాత్రం జిపియల్ కాని సాఫ్టువేరుపై ఆధారపడలేదు. నోమ్ యొక్క అభివృద్ధి (2011 నాటికి) కొనసాగుతుంది. మార్చి 2009 లో ట్రోల్టెక్ ను నోకియా కొనుగోలుచేసింది, క్యూటి 4.5 విడుదలచేసి ఎల్ జిపియల్ లైసెన్సును మూడవ ఐచ్ఛికముగా చేర్చారు.
పేరు
[మార్చు]యోజన నిర్మాణం
[మార్చు]లక్ష్యాలు
[మార్చు]విడుదల చరిత్ర
[మార్చు]మునుపటి విడుదల
[మార్చు]ప్రస్తుత విడుదల
[మార్చు]మునుపటి నోమ్ మైలురాయి విడుదలల యొక్క తెరపట్టులు
[మార్చు]-
గ్నోమ్ 1, మార్చి 1999
-
గ్నోమ్ 2.6, మార్చి 2004
-
గ్నోమ్ 2.20, సెప్టెంబరు 2007
-
గ్నోమ్ 2.30, మార్చి 2010