Jump to content

గౌండ్ల మల్లీశ్వరి

వికీపీడియా నుండి
గౌండ్ల మల్లీశ్వరి
జననం
జాతీయతభారతీయురాలు
వృత్తితొలి మహిళా వీడియో జర్నలిస్ట్‌

గౌండ్ల మల్లీశ్వరి తెలంగాణ రాష్ట్రానికి చెందిన తొలి మహిళా వీడియో జర్నలిస్ట్‌. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

జననం

[మార్చు]

మల్లీశ్వరి, శరణయ్య, మొగులమ్మ దంపతులకు సంగారెడ్డి జిల్లా, మునుపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో జన్మించింది.[2]

తొలి జీవితం

[మార్చు]

మల్లీశ్వరి తల్లిదండ్రులకు ఐదుమంది కూతుర్లు, ఒక్క అబ్బాయి. అబ్బాయి పుట్టిన పదిహేడు రోజులకే వాళ్లు చనిపోయారు. అప్పటినుంచి మేనమామల దగ్గర పెరిగి, కర్రపట్టి పశువుల కాపరి అయింది.

విద్యాభ్యాసం

[మార్చు]

వికారాబాద్ లోని ఎంవీఎఫ్ ఫౌండేషన్ సహకారంతో వికారాబాద్ లో 7వ తరగతి, రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలంలోని బాలికల వసతిగృహంలో 74శాతం మార్కులతో 10వ తరగతి పాసై, వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అటుతర్వాత చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీ.ఎస్‌.సీ.లో 68 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.

వీడియో జర్నలిస్ట్‌ గా

[మార్చు]

వీడియోగ్రఫీపై ఉన్న అభిరుచితో వీడియోలు తీయడం నేర్చుకుంది. వివిధ వేడుకలకు వీడియోలు తీస్తూ వచ్చిన డబ్బుతో డిగ్రీ పూర్తిచేసింది. వీడియో టెక్నిక్‌లు నేర్చుకుని 2008లో హెచ్ ఎమ్ టివిలో వీడియో జర్నలిస్ట్‌గా చేరింది.[3] ప్రస్తుతం జై తెలంగాణ న్యూస్ ఛానల్‌లో వీడియో జర్నలిస్ట్‌గా పనిచేస్తుంది.

బహుమతులు - పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 9 March 2017. Retrieved 4 April 2017.
  2. నమస్తే తెలంగాణ. "నాడు కాపరి.. నేడు ఉత్తమ మహిళ". Retrieved 4 April 2017.
  3. "కెమెరాతో కలిసి ... వీడియో జర్నలిస్టు మల్లీశ్వరి | Prajasakti". www.prajasakti.com. 2021-04-27. Archived from the original on 2021-04-28. Retrieved 2022-01-18.