Jump to content

గో ఎయిర్

వికీపీడియా నుండి
GoAir
IATA
G8
ICAO
GOW
కాల్ సైన్
GO AIR
స్థాపన2005
మొదలుNovember 2005
Hub
  • Chhatrapati Shivaji International Airport (Mumbai)
Secondary hubs
  • Indira Gandhi International Airport (Delhi)
Focus cities
  • Kempegowda International Airport (Bangalore)
  • Srinagar Airport
Frequent flyer programGoClub[1]
Fleet size19
Destinations22
Parent companyWadia Group
కంపెనీ నినాదంFly Smart
ముఖ్య స్థావరంWorli, Mumbai, Maharashtra, India
ప్రముఖులుJehangir Wadia Managing Director
Giorgio De Roni (CEO)
Website: www.goair.in

భారతదేశంలోని ముంబయి కేంద్రంగా గోఎయిర్ విమానాయాన సంస్థ స్థాపించబడింది.[2][3] వాడియాగ్రూపు ఆధ్వర్యంలో నవంబరు 2005 నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. భారత వైమానిక మార్కెట్ వాటాలో ఇది ఐదో అతిపెద్ద విమానాయాన సంస్థ.[4] ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రధాన స్థావరాలుగా గో ఏయిర్ కార్యకలాపాలు సాగుతున్నాయి.

చరిత్ర

[మార్చు]

ప్రఖ్యాత భారతీయ పారిశ్రామిక వేత్త నుస్లీ వాడియా చిన్న కుమారుడైన జహంగీర్ వాడియా గో ఎయిర్ సంస్థను 2005లో ప్రారంభించారు. భారత వ్యాపార సామాజ్రంలో పేరుగాంచిన బాంబే డయింగ్, బ్రిటానియా ఇండస్ట్రీస్[5] సంస్థలను నిర్వహిస్తున్నవాడియా గ్రూపు[6] తొలిసారిగా వైమానిక రంగంలోకి అడుగుపెట్టింది. దీనికి జహంగీర్ వాడియా మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.[7] గో ఎయిర్, నవంబర్ 2005 ఎయిర్ బస్ ఎ320 విమానం ద్వారా తన సేవలను ప్రారంభించింది.[5]

గమ్యాలు

[మార్చు]

గో ఎయిర్ భారతదేశంలోని 22 ప్రాంతాలకు విమానాలకు నడిపిస్తోంది. దేశీయంగా ప్రతిరోజు 140 విమానాలతో సహా సగటున వారానికి 975 విమానాలు నడిపిస్తోంది.[8] చిన్న విమానాలుండటం వల్ల భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ నిబంధలన మేరకు గో ఏయిర్ అంతర్జాతీయంగా విమానాలు నడపడం లేదు. దరఖాస్తు చేసారు. అనుమతి రావాల్సి ఉంది.[9]

  • అండమాన్&నికోబార్ దీవులు
    • పోర్ట్ బ్లెయిర్–వీర్ సావర్కర్ విమానాశ్రయం
  • అస్సాం
    • గౌహతి– లోక్ ప్రియ గోపినాథ్ బోర్డోలో అంతర్జాతీయ విమానాశ్రయం
  • బీహార్
    • పట్నా– లోక్ నాయక్ జయప్రకాశ్ విమానాశ్రయం
  • చత్తీస్ గఢ్
    • ఛండీగర్ విమానాశ్రయం
  • ఢిల్లీ
    • ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(స్థావరం)
  • గోవా
    • గోవా అంతర్జాతీయ విమానాశ్రయం
  • గుజరాత్
    • అహ్మదాబాద్ –సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • జమ్ము -కాశ్మీర్
    • జమ్ము – జమ్ము విమానాశ్రయం
    • శ్రీనగర్– శ్రీనగర్ విమానాశ్రయం
    • లేహ్ – లేహ్ కుశోక్ బాకుల రింపోచీ విమానాశ్రయం
  • ఝార్ఖండ్
    • రాంచి – బిర్సా ముండా విమానాశ్రయం
  • కర్ణాటక
    • బెంగళూరు– కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
  • కేరళ
    • కోచి – కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • మహారాష్ట్ర
    • ముంబయి – ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం(స్థావరం)
    • నాగ్ పూర్ – డా.బాబా సాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం
    • పుణె – పుణె అంతర్జాతీయ విమానాశ్రయం
  • ఒడిషా
    • భువనేశ్వర్ – బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • రాజస్థాన్
    • జైపూర్ – సంగనర్ అంతర్జాతీయ విమానాశ్రయం
  • తమిళనాడు
    • చెన్నై – చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
  • ఉత్తర ప్రదేశ్
    • లక్నో – అమౌసీ విమానాశ్రయం
  • పశ్చిమ బెంగాల్
    • సిలిగురి–బగ్డోగ్రా విమానాశ్రయం
    • కోల్ కతా – నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం

విమానాలు

[మార్చు]

డిసెంబరు 2104 నాటికి గో ఎయిర్ ఈ క్రింది విమానాలను నడిపిస్తోంది.[10][11]

గో ఎయిర్ విమానాలు
విమానం పేరు సేవలో ఉన్నవి ఆర్డర్లు ప్రయాణికులు సూచనలు
ఎయిర్ బస్ A320-200 19 180 ఒకటి సొంతం, 15 తాత్కాలిక అద్దె, మరో ఐదు
షార్క్ లెట్స్ అమర్చారు(VT-GOL,VT-GOM,VT-GON,VT-GOO & VT-GOP)
ఎయిర్ బస్ A320 నియో 72 TBA 2015 లోవిడుదల
మొత్తం 19 72
GoAir Airbus A320 at Chhatrapati Shivaji International Airport

A320 ఎన్.ఇ.ఓ ఆర్డర్

[మార్చు]

ఎయిర్ బస్ ఎ320 ఎన్.ఇ.ఓ[12] (న్యూ ఇంజిన్ ఆప్షన్) రకం 72 విమానాల కోసం గో ఎయిర్ సంస్థ 324 బిలియన్లు(US $5.2 బిలియన్లు) కేటాయించింది. 2015 నుంచి ఏడాదికి 12-15 వరకు అందుబాటులోకి వస్తాయి.

ప్రత్యేక రంగులు

[మార్చు]

ప్రత్యేక రంగుల్లో కనిపించే విమాన తోకలపై ఆకర్షణీయమైన నీలం-తెలుగు రంగులతో సంస్థ లోగోను ముద్రించారు. గులాబీ, ఆకాశనీలం, లేతఆకుపచ్చ, ఊదా, గోదుమ వంటి రంగుల్లోనూ విమానాలున్నాయి. గో ఎయిర్ అధికారిక వెబ్ సైట్ ను ఇంజన్లపై ముద్రించారు.

సేవలు

[మార్చు]

గో ఎయిర్ విమానాల్లో ఉచిత భోజనం ఉండదు. కానీ డబ్బులు చెల్లించి భోజన వసతి పొందవచ్చు. స్నాక్స్, సాండ్ విచ్ లు, సమోస, కుకీస్, గింజలు, సాఫ్ట్ డ్రింక్స్, ఛాయ్, కాఫీ, మినరల్ వాటర్ అందుబాటులో ఉంటాయి.[13]

పురస్కారాలు

[మార్చు]

గో ఏయిర్ సంస్థ ఇప్పటి వరకు ఈ క్రింది పురస్కారాలు అందుకుంది:

  • 2008లో పసిఫిక్ ప్రాంత ప్రయాణ రచయితలసంఘం నుంచి నాణ్యత&అత్యుత్తమ సేవలందించినందుకు “ఉత్తమ దేశీయ ఎయిర్ లైన్స్ పురస్కారం” అందుకుంది.
  • 2011లో ఏయిర్ బస్ నుంచి “ఉత్తమ పనితీరు గల ఎయిర్ లైన్స్ సంస్థగా పురస్కారం” అందుకుంది[14]

గ్యాలరీ

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "GoAir frequent flyer program". Archived from the original on 2013-09-01. Retrieved 2014-12-25.
  2. "Go Air : Contact Us". Archived from the original on 2014-12-20. Retrieved 2014-12-25.
  3. "GoAir joins the profit league". Business Standard. Retrieved 24 January 2014.
  4. "Market share". Archived from the original on 2016-03-04. Retrieved 2014-12-25.
  5. 5.0 5.1 "GoAir : About us". Archived from the original on 2014-12-16. Retrieved 2014-12-25.
  6. "Flight International".
  7. "Stay small till customer has a need, not want: JehWadia". The Times of India. Retrieved 30 March 2013.
  8. "GoAir : Destinations". Archived from the original on 2014-12-20. Retrieved 2014-12-25.
  9. Mishra, Lalatendu (3 March 2013). "We will not sell under cost". Chennai, India: The Hindu Business Line. Retrieved 30 March 2013.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  10. "CH-Aviation – Airline News, Fleet Lists & More". Ch-aviation.ch. Retrieved 16 July 2010.
  11. "GoAir fleet". planespotters.net. Archived from the original on 21 అక్టోబరు 2013. Retrieved 21 October 2013.
  12. "GoAir orders 72 Airbus jets for Rs. 32,000 crore".
  13. "GoAir - Services and Baggage Allowance". Cleartrip.com.
  14. "GoAir ranked the Best Performing Airline by Airbus". Breaking Travel News. Retrieved 30 March 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=గో_ఎయిర్&oldid=4358973" నుండి వెలికితీశారు