గోళ్ళమూడిపాడు
గోళ్ళమూడిపాడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°07′45″N 80°30′59″E / 16.129086°N 80.516265°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | పొన్నూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి పెరుగు వెంకట లక్ష్మి. |
పిన్ కోడ్ | 522 212 |
ఎస్.టి.డి కోడ్ | 08644 |
"గోళ్ళమూడిపాడు" గుంటూరు జిల్లా పొన్నూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామములోని విద్యాసౌకర్యాలు
[మార్చు]నాట్కో లెర్నింగ్ స్కూల్:- గ్రామంలోని నాట్కో లెర్నింగ్ స్కూలు విద్యార్థిని వట్టికూటి పూజిత , ఇటీవల రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో బంగారు పతకం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికైనది. 2013 నవంబరు 6 నుండి 11 వరకూ, రాజస్థానులో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలలో ఈమె పాల్గొనుచున్నది.
గ్రామములోని మౌలిక సదుపాయాలు
[మార్చు]త్రాగునీటి సౌకర్యం
[మార్చు]నన్నపనేని లోకాదిత్యుడు, సీతారామమ్మ దంపతుల ఙాపకార్ధం, నాట్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో, ఈ గ్రామములో, 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రక్షిత మంచినీటి పథకానికి, నాట్కో ట్రస్ట్ అధ్యక్ష్లులు శ్రీ నన్నపనేని వెంకయ్య చౌదరి, వారి సతీమణి దుర్గాదేవి, 2017, మార్చి-28న శంకుస్థాపన నిర్వహించారు.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా పెరుగు వెంకటలక్ష్మి ఎన్నికైంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ కోదండరామస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, 2014, సోమవారంనాడు, వేదపండితులు, మంగళవాద్యాల నడుమ, అంగరంగవైభవంగా నిర్వహించారు. వేదపండితులు తెల్లవారుఝామునుండియే, ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించారు. [4]
గ్రామములోని ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామములోని ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం.వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]ఈ గ్రామానికి చెందిన శ్రీ నన్నపనేని వెంకయ్య చౌదరి గారు, ప్రముఖ "నాట్కో ఫార్మా" అను కంపెనీకి ఛైర్మను మరియూ మేనేజింగ్ డైరెక్టరు. వీరు తమ గ్రామ పాఠశాల నిర్మాణానికి నిధులిచ్చారు. తరువాత తను చదువుకున్న కావూరులోని పాఠశాల అభివృద్ధికి గూడా విరాళాలిచ్చారు. వీరు హైదరాబాదులోని కొన్ని ఆసుపత్రులకు విరాళాలిచ్చారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, దానికి గూడా నిధులిచ్చే ఉద్దేశంతో ఉన్నారు.[1]
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామంలోని నాట్కో లెర్నింగ్ స్కూలు విద్యార్థిని వట్టికూటి పూజిత , ఇటీవల రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో బంగారు పతకం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికైనది. 2013 నవంబరు 6 నుండి 11 వరకూ, రాజస్థానులో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలలో ఈమె పాల్గొనుచున్నది.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు గుంటూరు సిటీ, అక్టోబరు 14, 2013. 2వ పేజీ.