గోమఠం శ్రీనివాసాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోమఠం శ్రీనివాసాచార్యులు
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, నాటక రచయిత

గోమఠం శ్రీనివాసాచార్యులు రంగస్థల నటుడు, నాటక రచయిత. 1880లో మద్రాస్ లో ది మద్రాసు ఓరియంటల్ డ్రమాటిక్ కంపెనీ అనే నాటక సంస్థసు స్థాపించాడు.[1]

నాటకరంగ ప్రస్థానం

[మార్చు]

రచించిన నాటకాలు

[మార్చు]
  1. హరిశ్చంద్ర, ది మైర్టీర్ టూ ట్రూత్ (ఆంగ్లం) : హరిశ్చంద్ర ఆంగ్ల నాటకం 1892-93 మధ్యకాలంలో జగన్నాథవిలాసినీసభ వారిచే ప్రదర్శించబడి, 1897లో ముద్రించబడింది. ఈ నాటకంలో మూడు అంకాలు, అనేక రంగాలు ఉన్నాయి.
  2. కమలాపహరణము: ఇది పది అంకాల నాటకం. పార్శీ నాటక సమాజంవారు మద్రాస్ వచ్చిన సమయంలో ప్రదర్శించిన గులేబకావలి అనే హిందుస్థానీ నాటకాన్ని చూసిన శ్రీనివాసాచార్యులు ఆ కథను స్వీకరించి తెలుగులో కమలాపహరణము నాటకంగా రాశాడు. ఇది 1919లో ముద్రించబడింది.
  3. అసంపూర్ణ నాటకం: ఈ నాటకంలోని 3 అంకాలు మాత్రమే లభించాయి. ఆ భాగాలు 1955 జూలై-ఆగస్టు నెలలో ఆంధ్రదిన పత్రికలో ప్రచురితమయ్యాయి. ఇది వ్యవహారిక భాషలో రాయబడిన కల్పిత కథ.

మూలాలు

[మార్చు]
  1. గోమరం శ్రీనివాసాచార్యులు, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 277-278.