గోపాల్ రాయ్
గోపాల్ రాయ్ | |||
పదవీ కాలం 14 జూన్ 2016 – 2020 ఫిబ్రవరి 8 | |||
గవర్నరు | నజీబ్ జంగ్ , అనిల్ బైజల్ , వినయ్ కుమార్ సక్సేనా | ||
---|---|---|---|
ముందు | రాష్ట్రపతి పాలన | ||
పదవీ కాలం 2015 ఫిబ్రవరి 14 – 2016 జూన్ 14 | |||
గవర్నరు | నజీబ్ జంగ్ | ||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | కైలాష్ గహ్లోట్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2015 ఫిబ్రవరి 14 | |||
ముందు | నరేష్ గౌర్ | ||
నియోజకవర్గం | బాబర్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మౌ, ఉత్తరప్రదేశ్ , భారతదేశం | 10 మే 1975||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
పూర్వ విద్యార్థి | లక్నో విశ్వవిద్యాలయం (మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్) | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, |
గోపాల్ రాయ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు బాబర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ & వన్యప్రాణులు, అభివృద్ధి & సాధారణ పరిపాలన శాఖల మంత్రిగా పని చేశాడు.
జననం & విద్యాభాస్యం
[మార్చు]గోపాల్ రాయ్ 1975 మే 10న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మౌలో జన్మించాడు. ఆయన 1998లో లక్నో విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]గోపాల్ రాయ్ 1992లో లక్నో విశ్వవిద్యాలయంలోని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బాబర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నరేష్ గౌర్‌పై 35,271 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2] గోపాల్ రాయ్ 2016లో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆప్ ఇంచార్జిగా నియమితుడయ్యాడు.[3]
గోపాల్ రాయ్ 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బాబర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నరేష్ గౌర్‌పై 33,062 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5] ఆయన 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నరేష్ గౌర్‌పై 18994 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ "Delhi Assembly: Know your MLAs" (in ఇంగ్లీష్). The Indian Express. 11 February 2015. Archived from the original on 10 February 2025. Retrieved 10 February 2025.
- ↑ "Gopal Rai appointed as in-charge of AAP's MP unit" (in ఇంగ్లీష్). The Indian Express. 22 December 2016. Archived from the original on 14 February 2025. Retrieved 14 February 2025.
- ↑ The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
- ↑ Financialexpress (11 February 2020). "Delhi Election 2020: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.
- ↑ "Babarpur Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. Archived from the original on 14 February 2025. Retrieved 14 February 2025.