Jump to content

గోపాలకృష్ణ గాంధీ

వికీపీడియా నుండి
గోపాలకృష్ణ గాంధీ
గోపాలకృష్ణ గాంధీ


బీహార్ గవర్నర్
పదవీ కాలం
31 జనవరి 2006 – 21 జూన్ 2006
ముందు బూటాసింగ్
తరువాత అర్. ఎస్. గవాయ్

పదవీ కాలం
14 డిసెంబరు 2004 – 14 డిసెంబరు 2009
ముందు వీరేన్ జె. షా
తరువాత దేవానంద్ కొన్వార్

వ్యక్తిగత వివరాలు

జననం (1945-04-22) 1945 ఏప్రిల్ 22 (వయసు 79)
ఢిల్లీ, బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ ఇండిపెండెంట్
ఇతర రాజకీయ పార్టీలు యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అల్లియన్స్ (యు.పి.ఎ)
తల్లిదండ్రులు దేవదాస్ గాంధీ
లక్ష్మీ గాంధీ
జీవిత భాగస్వామి తారా గాంధీ
సంతానం 2 కుమార్తెలు
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తి అశోకా విశ్వవిద్యాలయంలో చరిత్ర, రాజనీతి శాస్త్రాల అధ్యాపకుడు.

గోపాలకృష్ణ దేవదాస్ గాంధీ (జ.1945 ఏప్రిల్ 22) పదవీ విరమణ చేసిన ఐ.ఎ.ఎస్ అధికారి. అతడు 2004 నుండి 2009 మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేసాడు. [1] అతడు మహాత్మా గాంధీ మనుమడు. మాజీ ఐ.ఎ.ఎస్. అధికారిగా అతడు భారత రాష్ట్రపతికి సెక్రటరీగా పనిచేసాడు. శ్రీలంక, దక్షిణ ఆఫ్రికా దేశాలకు హై కమీషనర్ గా ఉన్నారు. [2] అతడు 2017లో భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలలో యునైటెడ్ ప్రొగ్రెస్సివ్ అలియన్స్ చే నామినేట్ చేయబడ్డాడు. [3] కానీ ఎన్.డి.ఎ అభ్యర్థి వెంకయ్యనాయుడు చేతిలో 244 ఓట్లతో ఓడిపోయాడు. వెంకయ్యనాయుడుకు 5116 ఓట్లు లభించాయి.

ప్రారంభ జీవితం

[మార్చు]

అతడి పితృసంబంధమైన తాతగారు మహాత్మా గాంధీ, మాతృసంబంధమైన తాతగారు చక్రవర్తి రాజగోపాలాచారి (రాజాజీ) [4]. అతడు మహాత్మా గాంధీ కుమారుడైన దేవదాస్ గాంధీ, లక్ష్మీ గాంధీలకు జన్మించాడు. గోపాలకృష్ణ గాంధీ రాజ్ మోహన్ గాంధీ, రామచంద్ర గాంధీ, శ్రీమతి తారా భట్టాచర్జీ (గాంధీ) లకు తమ్ముడు. అతడు ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ డిగ్రీని పొందాడు. [5]

జీవితం

[మార్చు]

అతడు 1968 లో ఐ.ఎ.ఎస్. అధికారిగా చేరి 1985 వరకు తమిళనాడు రాష్ట్రంలో తన సేవలనందించాడు. తరువాత 1985 - 1987 కాలంలో భారత ఉపరాష్ట్రపతికి సెక్రటరీగా ఉన్నాడు. 1987 - 1992 కాలంలో భారత రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా పనిచేసాడు.

1992లో అతడు యునైటెడ్ కింగ్‌డంలోని భారత హై కమిషన్ లో మంత్రి (సంస్కృతి) గా ఉన్నాడు. లండన్ లోని నెహ్రూ సెంటర్ కు డైరక్టరుగా కూడా పనిచేసాడు. తరువాత అతడు వివిధ దౌత్య, పరిపాలనా స్థానాలలో పనిచేసాడు. దక్షిణ ఆఫ్రికా, లెసొంతో (1996) దేశాలకు భారత హై కమీషనర్ గా, 1997-2000 కాలంలో భారత రాష్ట్రపతికి సెక్రటరిగాను, 2000లో శ్రీలంక దేశంలో భారత హైకమీషనరుగా, నార్వే, ఐస్‌లాండ్ దేశాలకు భారత అంబాసిడర్గా పనిచేసాడు. 2003లో ఐ.ఎ.ఎస్ నుండి పదవీవిరమణ చేసాడు. [6]

2004 డిసెంబరు 14 న పశ్చిమ బెంగాల్ గవర్నర్గా నియమింపబడ్డాడు. పశ్చిమబెంగాల్ కు అతని కంటే ముందు వీరేన్ జె.షా, అతని తరువాత దేవానంద్ కొన్వార్ లు గవర్నర్‌లుగా పనిచేసారు. కొద్ది నెలల తరువాత 2006లో బీహార్ గవర్నరుగా అదనపు బాధ్యతలు స్వీకరించాడు. [7]

అతడు చెన్నైలోని కళాక్షేత్ర పౌండేషన్ కు చైర్మన్ గా డిసెంబరు 2011 నుండి మే 2014 వరకు ఉన్నాడు.[8] అతడు భారత ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీకు చైర్మన్ గా వ్యవహరించాడు. ఆ సంస్థకు అధ్యక్షునిగా 2012 మార్చి 5 నుండి మే 2014 వరకు సేవలంచిందాడు.[6][9]

అతడు అశోకా విశ్వవిద్యాలయంలో బోధిస్తుంటాడు. అచట చరిత్ర, రాజనీతి శాస్త్రాలకు ప్రొఫెసర్ గా ఉన్నాడు.[10]

వివాదాలు

[మార్చు]

అతడు సి.బి.ఐ కొరకు "ఎలిప్స్ ఎట్ నూన్: షాడోస్ ఓవర్ ఇండియాస్ కాన్‌సైన్స్" అనే అంశంపై సుమారు 3000 మంది సి.బి.ఐ అధికార్లు ప్రేక్షకులుగా గల సభలో 15వ డి.పి.కోహ్లి మెమోరియల్ ఉపన్యాసం చేసినపుడు అతడు " సి.బి.ఐ నిజాయితీగా ఉండే కంటే ప్రభుత్వ చేతిలో గొడ్డలిగా ఉంది. దీనిని తరచుగా DDT అని పిలుస్తారు - దాని అర్థం "డైక్లోరో డైఫినైల్ ట్రిక్లోరో ఈథేన్" కాదు, రంగులేని, రుచిలేని, వాసన లేని క్రిమిసంహారక ఉండాలి. కానీ ఇది డిపార్టుమెంటు ఆఫ్ డర్టీ ట్రిక్స్" అని వివాదస్పద వ్యాఖ్యలు చేసాడు. [11]

1993లో జరిగిన ముంబయి వరుస ప్రేలుళ్ళలో ప్రధాన నిందితుడైన యాకూబ్ మెమొన్కు క్షమాభిక్ష తిరస్కరించడాన్ని పురరాలోచించాలని 2015లో అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాసాడు.[12][13]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

గోపాలకృష్ణ గాంధీ వివాహం తారాగాంధీతో జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు.

మూలాలు

[మార్చు]
  1. "At farewell, Gopalkrishna Gandhi calls for change in mindsets - The Hindu". December 13, 2009. Retrieved 2013-11-29.
  2. Gopal Gandhi outlookindia.com. Apr 23, 2007. Retrieved 15 January 2014
  3. "Gopalkrishna Gandhi is opposition's nominee for vice president: He lost the Vice Presidential elections miserably Report - Times of India".
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; gg12 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. "Hon'ble Governor of Bihar - Gopalkrishna Gandhi Profile". Governor of Bihar website. Retrieved 2013-11-30.[permanent dead link]
  6. 6.0 6.1 "Chairman's Profile: Shri Gopalkrishna Gandhi". Indian Institute of Advanced Study. Archived from the original on 2013-09-14. Retrieved 2018-04-28.
  7. "Veteran politician R S Gavai new Bihar Governor". One India. Greynium Information Technologies Pvt. Ltd. 22 June 2006. Archived from the original on 24 September 2015.
  8. "Gopalkrishna steps down as chairman of Kalakshetra, IIAS".
  9. "Gopal Gandhi is IAAS chairman". The Hindu. March 6, 2012. Retrieved 2013-11-29.
  10. University, Ashoka. "Faculty/Staff - Ashoka University". Ashoka University. Archived from the original on 2018-06-15. Retrieved 2018-04-28.
  11. "Former Bengal governor Gopalkrishna Gandhi calls CBI 'department of dirty tricks', RIL a parallel state - Times of India".
  12. "Pardoning Yakub Memon will be a tribute to Dr. Kalam: Gopalkrishna Gandhi". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2017-07-17.
  13. "Gopalkrishna Gandhi tried to save Yakub Memon, claims Sena: Here's what Congress Vice-Presidential candidate said in 2015". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-07-17. Retrieved 2017-07-17.

బయటి లంకెలు

[మార్చు]