Jump to content

గోనుగుంట్ల సూర్యనారాయణ

వికీపీడియా నుండి
గోనుగుంట్ల సూర్యనారాయణ

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014- 2019
నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1967
వరదాపురం,ధర్మవరం అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు .నారాయణస్వామి ,జయమ్మ
నివాసం విద్యుత్ నగర్, అనంతపూర్
వృత్తి రాజకీయ నాయకుడు

గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో ధర్మవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుండి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతిలో 19,172 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2014లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై 14,211 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఎన్నికయ్యాడు.

వరదాపురం సూరి 2019లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతిలో 15,666 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019 జూన్ 28న తెలుగుదేశం పార్టీని విడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  2. The Hindu (28 June 2019). "Former TDP MLA joins BJP" (in Indian English). Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.