గొడవ
గొడవ | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఎ. కోదండరామిరెడ్డి |
రచన | పరుచూరి సోదరులు (మాటలు) |
నిర్మాత | ఎ. కోదండరామిరెడ్డి, ఎ. భారతి, సునీల్ రెడ్డి (సమర్పణ) |
తారాగణం | వైభవ్ రెడ్డి, శ్రద్ధా ఆర్య |
ఛాయాగ్రహణం | దినేష్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | డిసెంబరు 7, 2007 |
సినిమా నిడివి | 146 ని. |
భాష | తెలుగు |
గొడవ ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 2007లో విడుదలైన చిత్రం. ఇందులో వైభవ్, శ్రద్ధ ఆర్య ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు కోదండరామి రెడ్డి కొడుకు వైభవ్ నటుడిగా పరిచయమయ్యాడు. కథానాయిక శ్రద్ధ ఆర్యకు కూడా ఇది తెలుగులో తొలి చిత్రం. ఈ చిత్రాన్ని కోదండరామి రెడ్డి కుటుంబం కె. ఫిల్మ్స్ అనే పేరుతో నిర్మించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. దినేష్ కెమెరా బాధ్యతలు నిర్వహించగా, మార్తాండ్ కె. వెంకటేష్ కూర్పు బాధ్యతలు నిర్వహించాడు.
కథ
[మార్చు]నటవర్గం
[మార్చు]- వైభవ్ రెడ్డి
- శ్రద్ధా ఆర్య
- అశ్విని
- బబ్లూ
- బ్రహ్మానందం
- చలపతిరావు
- వేణు మాధవ్
- ఎం. ఎస్. నారాయణ
- సునీల్
- సాయాజీ షిండే
- జయప్రకాశ్ రెడ్డి
- అన్నపూర్ణ
- ఢిల్లీ రాజేశ్వరి
- ఎ. వి. ఎస్
- రఘుబాబు
- చిత్రం శ్రీను
- నాగేంద్రబాబు (అతిథి పాత్ర)
- జబినా ఖాన్ (ప్రత్యేక నృత్యం)
నిర్మాణం
[మార్చు]ఈ చిత్ర కథానాయకుడు వైభవ్ అసలు పేరు సుమంత్. అక్కినేని వారసుడు సుమంత్ అప్పటికే పేరు తెచ్చుకున్న నటుడు కావడంతో కోదండ రామిరెడ్డి తన కుమారుడు తెరమీద కనిపించడం కోసం ఎంపిక చేసుకున్న పది పేర్లలో ఒకదానిని సూచించమని చిరంజీవిని అడిగాడు. చిరంజీవి వైభవ్ అనే పేరు సూచించాడు.[1][2] ఈ సినిమా నిర్మాణం సెప్టెంబరు 2007 కి పూర్తయింది.[3]
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
- మాటలు: పరుచూరి సోదరులు
- కెమెరా: దినేష్
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
మూలాలు
[మార్చు]- ↑ "Sumanth Reddy is actor Vaibhav's real name". The Times of India.
- ↑ "Telugu cinema news - idlebrain.com". idlebrain.com.
- ↑ "Godava press meet - Telugu cinema - Vaibhav". www.idlebrain.com.