Jump to content

గెహన సిప్పీ

వికీపీడియా నుండి
గెహన సిప్పీ
గెహన సిప్పీ
జననం2000 అక్టోబర 11
ఇతర పేర్లుగెహన సిప్పీ
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2021–ప్రస్తుతం

గెహన సిప్పీ (జననం 2000 అక్టోబరు 11) భారతీయ నటి, మోడల్. తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేసే గెహన సిప్పీ హైదరాబాదులో మై సౌత్ దివా 2020 క్యాలెండర్ చిత్రీకరించిన మోడల్‌లలో ఆమె ఒకరు. 2021 సంవత్సరంలో వచ్చిన చోర్ బజార్ చిత్రంతో ఆమె అరంగేంట్రం చేసింది. ఆమె సుధీర్ సరసన నటించిన గాలోడు చిత్రం 2022 డిసెంబరు 18న థియేటర్స్‌లోకి రాబోతోంది.[1]

జననం

[మార్చు]

మహారాష్ట్రలోని ముంబైలో హరేష్ సిప్పీ, నీతా దంపతులకు 2000 అక్టోబరు 11న గెహన సిప్పీ జన్మించింది.[2] ఆమెకు ఒక అక్క ఉంది. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన గెహన సిప్పీ ముంబైలోని లోరెటో కాన్వెంట్ లో హైస్కూళ్ విద్య, ఎస్.ఐ.ఈ.ఎస్ కాలేజ్ లో కళాశాల విద్యను పూర్తిచేసింది.[3]

కెరీర్

[మార్చు]

గెహన సిప్పీ తన నటనా వృత్తిని జిల్లెట్ వీనస్, వెజ్జీ క్లీన్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల టీవీ వాణిజ్య ప్రకటనలతో ప్రారంభించింది.[4] తన మాతృభాష హిందీ అయినా ఇంగ్లీషు కూడా మాట్లాడగలదు. తెలుగు సినిమాలో అడుగుపెట్టిన ఆమె కెరీర్ కోసం తెలుగు మాట్లాడటం నేర్చుకుంది.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (7 November 2022). "మాస్ అండ్‌ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'గాలోడు'.. రిలీజ్‌కు రెడీ". Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  2. "Listen To Latest Telugu Audio Song 'Wifi Nadakalu' From Gaalodu Starring Sudheer Anandh And Gehna Sippy". Times of India. 10 February 2021. Retrieved 10 November 2022.
  3. Gaalodu Movie Team Exclusive Interview | Sudigali Sudheer | Gehna Sippy | NTV Entertainment. NTV Entertainment. 15 November 2022. Event occurs at 28:41.
  4. 'How to Get Party Ready At Home | 3 Steps for DIY Glow | Venus Gillette India (in ఇంగ్లీష్). Venus Gillette India. Retrieved 30 August 2019.
  5. Gaalodu Official Trailer | Sudheer | Gehna Sippy | Bheems Ceciroleo | Rajasekar Reddy Pulicharla. Junglee Music South. 4 November 2022. Event occurs at 2:29.