Jump to content

గుళ్లపల్లి నారాయణమూర్తి

వికీపీడియా నుండి

గుళ్లపల్లి నారాయణమూర్తి నాటకకర్త, రచయిత, జాతీయవాది. అతను వృత్తిరీత్యా వైద్యుడు.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

మహాత్మాగాంధీ పిలుపునందుకుని డాక్టర్‌ గుళ్లపల్లి నారాయణమూర్తి, కోరుకొండ బుచ్చిరాజు తో పాటు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాడు. బ్రిటీష్‌ పాలకులు బుచ్చిరాజును 1930 మార్చి 20న అరెస్టు చేసి తొలుత బరంపురం జైలుకు తరలించారు. తరువాత అక్కడ నుంచి బళ్లారి జైలుకు పంపారు. గుళ్లపల్లి నారాయణమూర్తిని కూడా ఇదే నెలలో అరెస్టు చేసి అలిపూర్‌ (బెంగాల్‌), బళ్లారి జైళ్లలో ఆరు నెలలపాటు నిర్బంధించారు. తరువాత 1932 ఫిబ్రవరి 18న అరెస్టు చేసి మద్రాసు జైలుకు పంపారు[3]. 1941 మార్చి నెలలో ఆయన మరోసారి అరెస్టు అయ్యారు. గుళ్లపల్లి నారాయణమూర్తి అనేక రచనలు కూడా చేశాడు. విడాకులు, ఆకలి, ఆంధ్రజ్యోతి నాటకాలను రాశాడు. నటుడిగా కూడా రాణించారు. ఆయనను జ్యోతి పంతులుగా పిలిచేవారు. తన మిత్రులందరినీ ఈ నాటకాల్లో పాత్రధారులుగా చేసి, బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. [4]

స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ఆంధ్రోద్యమం, తెలంగాణా రైతాంగ పోరాటం కొనసాగాయి. వాటిని ప్రతిబింబిస్తూ అతను 'ఆంధ్రజ్యోతి', నాటకాన్ని రాసాడు.[5]

స్వాతంత్య్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన గ్రంథాలయ ఉద్యమంతో ప్రభావితమైన కోరుకొండ లింగమూర్తి 1936లో అనకాపల్లిలో శారదా గ్రంథాలయాన్ని నెలకొల్పారు. డాక్టర్‌ గుళ్లపల్లి నారాయణమూర్తి, ఉప్పల శ్రీరామ్మూర్తి, గ్రంధి రమణయ్యబాబులు ఈ గ్రంథాలయ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.[4]

రచనలు

[మార్చు]
  • ఆరోగ్య శాస్త్రము[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతని కుమార్తె పి.శ్రీదేవి (1929-1961) ప్రముఖ తెలుగు రచయిత్రి.

మూలాలు

[మార్చు]
  1. శీలా సుభద్రాదేవి 2015, p. 9.
  2. "స్వాతంత్య్ర ఉద్యమంలో అనకాపల్లి". EENADU. Retrieved 2024-11-03.
  3. "స్వాతంత్య్ర ఉద్యమంలో అనకాపల్లి". EENADU. Retrieved 2024-11-03.
  4. 4.0 4.1 ABN (2022-08-12). "సమరయోధుల పురిటిగడ్డ". Andhrajyothy Telugu News. Retrieved 2024-11-03.
  5. "తెలుగు నాటక ప్రచురణలో విప్లవం". Prajasakti (in ఇంగ్లీష్). Retrieved 2024-11-03.
  6. గుళ్లపల్లి నారాయణమూర్తి (1935). ఆరోగ్యశాస్త్రము.

బాహ్య లంకెలు

[మార్చు]