గులాం అహ్మద్ మీర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గులాం అహ్మద్ మీర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డూరు నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

ఆయన 2015 నుండి 2022 వరకు జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (జేకేపీసీసీ) అధ్యక్షుడిగా పని చేశాడు.[4][5]

రాజకీయ జీవితం

[మార్చు]

గులాం అహ్మద్ మీర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996లో జరిగిన శాసనసభ ఎన్నికలలో డూరు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2002, 2008లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో డూరు నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై, జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ మంత్రిగా పని చేశాడు.

గులాం అహ్మద్ మీర్ 2008లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి సయ్యద్ ఫరూఖ్ అహ్మద్ ఆంద్రాబీ చేతిలో 161 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనంత్‌నాగ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. గులాం అహ్మద్ మీర్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో డూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి మహ్మద్ అష్రాఫ్ మాలిక్ పై 29728 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. "2024 Jammu and Kashmir Legislative Assembly election results - INC". 9 October 2024. Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  3. TimelineDaily (8 October 2024). "Ghulam Ahmad Mir: Congress Veteran To Retrieve Dooru Assembly Seat" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
  4. Asian Mail (6 July 2022). "G A Mir resigns as JKPCC chief". Retrieved 14 October 2024.
  5. The Indian Express (7 July 2022). "Ghulam Mir resigns as J&K Congress chief" (in ఇంగ్లీష్). Retrieved 14 October 2024.
  6. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Dooru". Retrieved 14 October 2024.
  7. "J&K polls: Congress' Ghulam Ahmed Mir wins from South Kashmir's Dooru segment". 8 October 2024. Retrieved 14 October 2024.