Jump to content

గుర్రంకొండ

అక్షాంశ రేఖాంశాలు: 13°46′53.472″N 78°35′20.760″E / 13.78152000°N 78.58910000°E / 13.78152000; 78.58910000
వికీపీడియా నుండి

గుర్రంకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లా, గుర్రంకొండ మండలం లోని గ్రామం.

గుర్రంకొండ
చిత్తురు జిల్లా గుర్రంకొండ వద్ద నవాబ్ మీర్ రజా అలీ ఖాన్ సమాధి
చిత్తురు జిల్లా గుర్రంకొండ వద్ద నవాబ్ మీర్ రజా అలీ ఖాన్ సమాధి
పటం
గుర్రంకొండ is located in ఆంధ్రప్రదేశ్
గుర్రంకొండ
గుర్రంకొండ
అక్షాంశ రేఖాంశాలు: 13°46′53.472″N 78°35′20.760″E / 13.78152000°N 78.58910000°E / 13.78152000; 78.58910000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య
మండలంగుర్రంకొండ
విస్తీర్ణం31.11 కి.మీ2 (12.01 చ. మై)
జనాభా
 (2011)[1]
10,642
 • జనసాంద్రత340/కి.మీ2 (890/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు5,480
 • స్త్రీలు5,162
 • లింగ నిష్పత్తి942
 • నివాసాలు2,501
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్517297
2011 జనగణన కోడ్595648

ఇది సమీప పట్టణమైన మదనపల్లె నుండి 35 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2501 ఇళ్లతో, 10642 జనాభాతో 3111 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5480, ఆడవారి సంఖ్య 5162. షెడ్యూల్డ్ కులాల జనాభా 511 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 126. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 595648[2]. గుర్రంకొండ ఒక పర్యాటక ప్రదేశం. దీనికి చారిత్రకంగా జాఫరాబాదు అనే పేరు ఉంది. కడప - బెంగళురు రహదారిలో ఉన్న ఈ గుర్రం కొండ ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది ఆనాడే హిందూ, ముస్లిం సంస్కృతులకు నిలువుటద్దంగా వుండి మతసామరస్యాన్ని చాటిచెప్పింది. గుర్రంకొండ బస్ స్టేషనుతో చించపర్తి, అంగళ్లు, కలకడ బస్ స్టేషన్లతో అనుసంధానం చేయ బడి బస్సులు నడుస్తున్నవి. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం చిత్తూరు జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [3]

గుర్రంకొండ కోట

[మార్చు]
రంగిన్ మహల్, గుర్రంకొండ (నిర్మాణం 1898)

గుర్రంకొండ గిరిదుర్గం. గుర్రంకొండ కోట శత్రుదుర్భేద్యమైన ఈ కోటను చోళులు, చాళుక్యులు, రాయలు, ఆ తర్వాత మహమ్మదీయులు టిప్పుసుల్తాన్, కడప నవాబులు పరిపాలించారు.రాయల కాలంలోను ఆ తర్వాత టిప్పు సుల్తాన్ కాలంలో ఉన్నతస్థితిలో ఉన్నది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ఒక గొప్పకొండపై ఉంది. మూడువైపులా కొండ దాదాపు నిలువుగా ఉండి ఎక్కడానికి వీలులేకుండా ఉంది. నాలుగోవైపు కూడా ఏటవాలుగా ఉండి దుర్భేద్యంగా ఉంది. కోటలో నలభైకి పైగా మసీదులు ఉండేవి. కానీ అవి శిధిలమైనవి. పర్షియాలోని కిర్మాన్ నుండి వచ్చిన హజ్రత్ షా కమాల్ అనే సూఫీ సంతు ఇక్కడ స్థిరపడి స్థానికులకు ఇస్లాం మతాన్ని బోధించి ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాలకు ఇస్లాం మతాన్ని వ్యాపింపజేశాడు. ఈ కోట 18వ శతాబ్దపు చివరలో కొన్నాళ్లు టిప్పూసుల్తాను ఆధీనంలో ఉంది. టిప్పూసుల్తాను ఇక్కడ నాణేలను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటుచేశాడు.[4] ఆ తరువాత కడప నవాబుల పాలనలోకి వచ్చింది. ఇచ్చట గల కోట చాలా ప్రసిద్ధమైంది. ఈ కోటలో గల 'రంగిన్ మహల్' చూపరులకు ఆకట్టుకుంటుంది.

వెల్లివిరిసిన మతసామరస్యం

[మార్చు]

కోట లోపల నిర్మింపబడిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి, వినాయక ఆలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, రెండు మసీదులు, మూడు దర్గాలు ఉండడం నాటి మతసామరస్యానికి, హిందూ, ముస్లిం ఐక్యతను చాటిచెబుతోంది. నెయ్యి గది, వైద్యశాల, ధాన్యపు గదులు అన్నీ నేడు శిథిలావస్థలో ఉన్నాయి. గుర్రం కొండ దుర్గానికి పడమర వైపున ఉన్న మక్బరా (పవిత్ర సమాధి) దుర్గం మొత్తం మీద సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల వాల్మీకిపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల అంగళ్లు లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల తిరుపతిలోను, పాలిటెక్నిక్‌ మదనపల్లెలోను, మేనేజిమెంటు కళాశాల అంగళ్లు లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వాల్మీకిపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల మదనపల్లె లోనూ ఉన్నాయి.

విద్యా సంస్థలు

[మార్చు]
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల,
  • న్యూ శ్రీవాణి హై స్కూలు,
  • జిల్లాపరిషత్ హై స్కూలు.,
  • విశ్వభారతి స్కూలు
  • జిల్లాపరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల,
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఉర్దూ),

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

గుర్రంకొండ (గ్రామం)లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఏడుగురు ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. పారామెడికల్ సిబ్బంది ముగ్గురు ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, పారామెడికల్ సిబ్బంది ముగ్గురు ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, పారామెడికల్ సిబ్బంది ముగ్గురు ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 8 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరు బావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ ఉంది.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

గుర్రంకొండ (గ్రామం)లో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు మట్టిరోడ్లూ ఉన్నాయి.

రోడ్డు మార్గము

[మార్చు]

గుర్రం కొండకు వెళ్లాలంటే... బెంగుళురు నుంచి అయితే మదన పల్లె, వాల్మీకి పురం, కలకడ, మార్గాల లోనూ... కడప నుంచి అయితే రాయచోటి మార్గంలోనూ... తిరుపతి నుంచి అయితే తిరుపతి - బెంగుళురు హైవేలో వాల్మీకి పురం వరకు ప్రయాణించి ఆ తరువాత అక్కడి నుండి గుర్రం కొండ చేరుకోవచ్చు.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

గుర్రంకొండ (గ్రామం)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 295 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 336 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 417 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 273 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 30 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 46 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 511 హెక్టార్లు
  • బంజరు భూమి: 973 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 225 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1641 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 69 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

గుర్రంకొండ (గ్రామం)లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • చెరువులు: 69 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

గుర్రంకొండ (గ్రామం)లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వేరుశనగ, వరి, రామములగ

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

బీడీలు, ఇటుకలు

చేతివృత్తులవారి ఉత్పత్తులు

[మార్చు]

కృత్రిమ పుష్పాలు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  4. The Coins of Haidar Alī and Tīpū Sultān By John Robertson Henderson

వెలుపలి లంకెలు

[మార్చు]