గురివింద
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గురివింద | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | ఏ. ప్రికటోరియస్
|
Binomial name | |
ఏబ్రస్ ప్రికటోరియస్ |
గురివింద (ఆంగ్లం Jequirity, Indian Licorice) ఒక చిన్న ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం 'ఏబ్రస్ ప్రికటోరియస్ (Abrus precatorius) '; ఫాబేసి కుటుంబానికి చెందినది. ఇవి చాలా విషపూరితమైనవి.విత్తనాల రంగును బట్టి ఈ మొక్కలలో మూడు రకాలు ఉన్నాయి: ఎరుపు, తెలుపు ఇంకా నలుపు[1].ఆకులు తీపి రుచిని కలిగి ఉంటాయి.[2]
లక్షణాలు
[మార్చు]- ఇది తీగల ద్వారా ఎగబ్రాకే పొద.
- దీర్ఘవృత్తాకారంలో ఉన్న సన్నని పత్రకాలు గల ( చింతాకుల వలె) సమపిచ్ఛాకార సంయుక్త పత్రాలు.
- గ్రీవస్థ అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న కెంపు రంగు పుష్పాలు.
- నల్లని మచ్చతో చిక్కని ఎరుపురంగు విత్తనాలు కలిగి ఉన్న ద్విదారక ఫలాలు.
ఉపయోగాలు
[మార్చు]- గురివింద విత్తనాలను కంసాలి బంగారాన్ని తూకం కోసం వినియోగిస్తారు. (గత కాలంలో బంగారాన్ని ఇన్ని గురుగింజల ఎత్తు అని అనే వారు)
గురువింద ఆకులను నోట్లో వేసుకొని కొంత నమిలి ఆ తర్వాత ఒక చిన్న రాయిని కూడా నోట్లో వేసుకొని నమిలితె అది అతి సునాయాసంగా నలిగి పిండి అయి పోతుంది. అలాగే గింజలను కనురెప్పల కింద దాచి పెట్టడం, పల్లెల్లోని పిల్లలకు ఇదొక ఆట. ఇందులోని మర్మం / రసాయన చర్య ఏమిటొ తెలిసిన వారు చెపితే?. దీని అకులు విష పూరితం కాదు. గింజ లోని పప్పును కొన్ని వైద్యాలకు ఉపయోగిస్తారు.
గ్యాలరీ
[మార్చు]-
గురివింద చెట్టు తీగ, ఆకులు, కాయలోని విత్తనాలు
-
నేలపై గురివింద గింజలు
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "గురివిందతో గుప్పెడు లాభాలు.... | INS Media". www.ins.media. 2018-07-07. Archived from the original on 2021-10-23. Retrieved 2020-11-13.
- ↑ "A REVIEW ON ABRUS PRECATORIUS | PharmaTutor". www.pharmatutor.org. Retrieved 2020-11-13.